Warangal
చక్రం గుడిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి మాస కల్యాణం ఘనంగా నిర్వహణ
నిజామాబాద్, సెప్టెంబర్ 15:(E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంలోని చక్రం గుడిలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి మాస కల్యాణ మహోత్సవాన్ని మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సుందరంగా అలంకరించి మాస కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపారు. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమైన కల్యాణ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. వేద మంత్రోచ్ఛారణలు,…
అడవి సిరికి.. ఆన్లైన్ దారి!
ఆదివాసి ఉత్పత్తులకు డిజిటల్ రెక్కలు.. ఇంటికే గిరి ఉత్పత్తులు భద్రాచలం, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) అడవిలో పండిన ఉత్పత్తులకు గిరిజనుల చేతుల మీదుగా విలువ జోడించి.. వాటిని దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరువ చేసేందుకు భద్రాచలంలోని భద్రగిరి మార్ట్ మరో ముందడుగు వేసింది. గిరిజనుల శ్రమకు సరైన గిట్టుబాటు కల్పించడంతో పాటు వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించే లక్ష్యంతో మార్ట్‌ను పర్యాటక రంగంతో అనుసంధానం చేసి, ఆన్లైన్ విక్రయాలకు శ్రీకారం చుట్టారు. అడవి ఉత్పత్తులకు ‘భద్రగిరి…
మోర్తాడ్ సభలో మంత్రి సీతక్క పచ్చి అబద్ధాలు మాట్లాడారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజలకు లెక్క చెప్పాలి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి). మోర్తాడ్‌లో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు వెయ్యి రోజులు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా బీఆర్ఎస్పై విమర్శలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 100…
చిన్న శక్కర్గ సర్పంచ్ దిగంబర్‌కు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు పరామర్శ
నిజామాబాద్:, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్‌లోని హోప్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్న శక్కర్గ గ్రామ సర్పంచ్ దిగంబర్ను ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడిన వారు దిగంబర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. దిగంబర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లోకి రావాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఆకాంక్షించారు.
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం: కలెక్టర్ అంకిత్
భూ రికార్డుల్లో పూర్తి స్పష్టత తీసుకురావాలి – ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలియంగ్ ఇండియా పాఠశాల పనులను వేగవంతం చేయాలినిర్లక్ష్యంపై ఆర్ఐ, ఎంపీడీవోకు చర్యలకు ఆదేశాలు భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. అధికారులు పరస్పర సమన్వయంతో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. దుమ్ముగూడెం మండలం మల్కానపల్లి, చిన్నబండిరేవు గ్రామాల్లో మంగళవారం…
కొత్తపల్లి సొసైటీ చైర్మన్ బరిలో వెనిగళ్ల సుధీర్
తండ్రి, తనయుల సేవలను గుర్తుచేసుకుంటున్న రైతులు కోటగిరి, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి)బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలంలోని కొత్తపల్లి సహకార సంఘం (సొసైటీ) నూతన చైర్మన్ పదవికి వెనిగళ్ల సుధీర్ పేరు రైతుల మధ్య చర్చనీయాంశంగా మారింది. గతంలో సొసైటీ అభివృద్ధికి వెనిగళ్ల కుటుంబం అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్న రైతులు.. సుధీర్ చైర్మన్‌గా బాధ్యతలు చేపడితే సొసైటీ మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వెనిగళ్ల సుధీర్ తండ్రి స్వర్గీయ వెనిగళ్ల భాస్కర్…
కులమతాలకు అతీతంగా హిందూ–ముస్లిం భాయ్ భాయ్
ఆరో వార్డులో వినాయక చవితి వేడుకల్లో ముస్లిం సోదరుల భాగస్వామ్యం జమ్మికుంట,సెప్టెంబర్ 14:(E6tv NEWS: ప్రతినిధి)కులమతాలకు అతీతంగా హిందూ–ముస్లిం సోదరులంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని చాటిచెప్పేలా ఆరో వార్డు ప్రజలు మరోసారి స్నేహభావాన్ని చాటుకున్నారు. ఆరో వార్డులోని యాద ధనంజయ్ కిరాణా దుకాణం సమీపంలో కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ ఆధ్వర్యంలో మహిళల సహకారంతో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వినాయక చవితి వేడుకల్లో ముస్లిం సోదరులు సైతం స్వచ్ఛందంగా పాల్గొని తమ వంతు సహకారం అందించడం ప్రత్యేక…
వినాయక చవితి రోజున విచారణ పేరుతో వేధింపులు దారుణం
రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారుతున్నాయిమాస్కులు ధరించి దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి– మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిసెప్టెంబర్ 14: (E6tv NEWS: ప్రతినిధి). సెప్టెంబర్ 14: (E6tv NEWS: ప్రతినిధి). వినాయక చవితి పండుగ రోజున విచారణ పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేష్‌లను సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.అసెంబ్లీ సమావేశాల…
పండుగలు ఐకమత్యానికి వేదికగా నిలవాలి
సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్వంచ, సెప్టెంబర్ 14:(E6tv NEWS: ప్రతినిధి) పండుగలు ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించే వేదికలుగా నిలవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా పాల్వంచ పట్టణ పరిధిలో వివిధ గణేష్ ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసిన మండపాలను సోమవారం ఎమ్మెల్యే సందర్శించి, ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ…
ప్లాస్టిక్ రహిత ఎర్గట్లకు ఐక్య విద్య అడుగు
చిన్నారుల కోసం స్టీల్ ప్లేట్లు, గ్లాసుల విరాళం ఎర్గట్ల, సెప్టెంబర్ 13; (E6tv NEWS: ప్రతినిధి) ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిస్తూ పర్యావరణ పరిరక్షణతో పాటు చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ఎర్గట్ల సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ ముందడుగు వేశారు. మన ఐక్య విద్య–ప్రహ్లాద బడి చిన్నారుల కోసం స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులను విరాళంగా అందించారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎర్గట్ల గ్రామాన్ని ప్లాస్టిక్…
