Warangal
వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
పుట్టపర్తి, సెప్టెంబర్ 18: (E6tv NEWS: ప్రతినిధి) వీఆర్ఏల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఈఎస్ వెంకటేష్ డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా మూడో రోజు పుట్టపర్తి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. రాష్ట్రంలోని వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ వీఆర్ఏలుగా నియమించాలని…
యువతకు బంగారు పునాదులు వేస్తున్నాం
ఏటా జాబ్ క్యాలెండర్.. ఈ ఏడాది 10,060 పోస్టుల భర్తీకి నిర్ణయం 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి సవిత పెనుకొండ, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి) రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తుకు బంగారు పునాదులు వేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. తమది జెన్ జీ పక్షపాతి ప్రభుత్వం అని, చదువుకున్న యువతకు ఉద్యోగాలు…
సాగునీటి గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు
విజన్‌తో పనిచేస్తున్న సీఎం చంద్రబాబురూ.20 కోట్లతో పెనుకొండ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు పెనుకొండ, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి) అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌తో రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 10, 11వ వార్డుల్లో మంత్రి సవిత పర్యటించారు….
మోదీ పాలనలో రైతులు, వ్యవసాయ కూలీల నిజ ఆదాయాలు తగ్గుతున్నాయి
రైతు కూలీల హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య బోధన్ రూరల్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి). కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు, వ్యవసాయ కూలీల నిజ ఆదాయాలు తగ్గిపోతున్నాయని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య ఆరోపించారు. శుక్రవారం బోధన్ మండలం పెద్ద మావంది గ్రామంలో నిర్వహించిన అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) బోధన్ డివిజన్ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మహాసభ…
ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఆర్‌ఐ మృతి
నిజామాబాద్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్. సతీష్ మృతి చెందారు. పోలీస్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌ఎస్‌ఓ డ్యూటీ ముగించుకుని శుక్రవారం ఉదయం నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చిన ఆర్‌ఐ సతీష్ ఆయుధాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు…
అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేస్తే సహించం
‘కలిపిత నాయకుడు అంబేద్కర్’ పుస్తక విడుదలను అడ్డుకోవాలిరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సామాజిక కార్యకర్త పుల్లూరి ప్రశాంత్ జమ్మికుంట, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). డా. బి.ఆర్. అంబేద్కర్‌ను విమర్శిస్తూ ‘కలిపిత నాయకుడు అంబేద్కర్’ పేరుతో పుస్తకాన్ని సెప్టెంబర్ 18న విడుదల చేయనున్న కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని సామాజిక కార్యకర్త పుల్లూరి ప్రశాంత్ డిమాండ్ చేశారు. అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేయడం, ఆయన గౌరవానికి భంగం కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం సహించబోమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా…
ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
ముధోల్, సెప్టెంబర్ 17: (E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతంతో పాటు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎబీవీపీ నిర్మల్ జిల్లా కన్వీనర్ దినేష్ తెలంగాణ రాష్ట్ర విమోచన ఉద్యమ చరిత్ర, ఆనాటి పోరాటాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ…
భీంగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
సంక్షేమ సమస్యలపై ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి భీంగల్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని భీంగల్ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే ఎంపీడీవో కార్యాలయంలోని ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల…
CMR సమస్యలు పరిష్కరించాలి
బాన్సువాడ డివిజన్ రైస్ మిల్లర్ల నిరవధిక బంద్‌కు పిలుపు.. MROకు వినతిపత్రం బాన్సువాడ, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) డెలివరీల్లో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాన్సువాడ డివిజన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు మిల్లింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి…
విశ్వకర్మ భగవానుడి స్ఫూర్తితో వృత్తిదారుల సంక్షేమం
విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా మంత్రి సవిత ఘన నివాళులు పెనుకొండ, సెప్టెంబర్ 17: (E6tv NEWS: ప్రతినిధి) విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖల మంత్రి సవిత విశ్వకర్మ భగవానుడికి ఘన నివాళులు అర్పించారు. శిల్పులు, వృత్తి నిపుణులు, చేతివృత్తిదారులు, కార్మికులకు విశ్వకర్మ భగవానుడు ఆరాధ్య దైవమని ఆమె పేర్కొన్నారు. విశ్వకర్మ భగవానుడి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం అభినందనీయమని మంత్రి తెలిపారు. విజయవాడలో రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు….
