Breaking News

తెలంగాణలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు.. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారాయి. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. ముఖ్యంగా శనివారం (సెప్టెంబర్ 19) నుంచి వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాతావరణ హెచ్చరికలు & ముఖ్య విశ్లేషణ: భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Read Full News

ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ

నిజామాబాద్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. రీజినల్ మేనేజర్ ఎస్‌వీజీ కృష్ణమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించగా, అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు జాతీయగీతాన్ని ఆలపించి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ప్రజా పాలన ఆవిర్భావం, దేశ సమైక్యత, ప్రజాసేవ ప్రాధాన్యతపై ప్రసంగించారు….

Read Full News

దొరల పాలన కాదు.. ప్రజా పాలన

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో అవకతవకలకు తావులేదుదళారులను నమ్మి మోసపోవద్దు: సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ రుద్రూర్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). అర్హులైన నిరుపేదలకే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందేలా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో దళారులు డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందని, లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఇందూరు…

Read Full News

నాయి బ్రాహ్మణులకు క్షవరవృత్తిపై పేటెంట్ హక్కు కల్పించాలి

వరల్డ్ బార్బర్స్ డే లో నాయి బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్ పాల్వంచ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి). నాయి బ్రాహ్మణులు తరతరాలుగా కొనసాగిస్తున్న క్షవరవృత్తిపై వారికి పేటెంట్ హక్కు కల్పించాలని తెలంగాణ నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ అధ్యక్షులు కొమరవెల్లి రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాల్వంచ పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం కేటీపీఎస్ బీసీ అసోసియేషన్ హాల్‌లో వరల్డ్ బార్బర్స్ డే…

Read Full News

ఘనంగా 9వ పోషణ మాసం కార్యక్రమం

పాల్వంచ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి) “మన అంగన్వాడీ – మన బాధ్యత” అనే నినాదంతో 9వ పోషణ మాసం కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని గాంధీనగర్–2 అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పాల్వంచ, వెంగళరావు సెక్టార్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి 44వ డివిజన్ కార్పొరేటర్ విసంశెట్టి విశేశ్వరరావు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక గర్భిణీకి శ్రీమంతం, ఇద్దరు చిన్నారులకు అన్నప్రాసన, నలుగురు…

Read Full News

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

నవ లిమిటెడ్ సీఎస్‌ఆర్‌లో భాగంగా కార్యక్రమం 14 పాఠశాలల్లో 1,400 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు 170 మందికి ఉచిత మందులు.. అనంతరం అద్దాల పంపిణీ పాల్వంచ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాల్వంచలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాత పాల్వంచలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ తరఫున చీఫ్ మానిటరింగ్ ఆఫీసర్…

Read Full News

రాబోయే ఎన్నికల్లో బీజేపీదే విజయం: ఎంపీ అర్వింద్

రాహుల్, రేవంత్, మహేశ్ గౌడ్ వల్ల బీజేపీకి మరింత ప్రయోజనం 22ఏ నిషేధిత భూముల జాబితాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వక అభివృద్ధి పనులు నిలిచిపోయాయి కేంద్ర పథకాల్లో మోదీ ఫొటో తప్పనిసరిగా ఉండాలి: అర్వింద్ నిజామాబాద్, సెప్టెంబర్ 16: (E6tv NEWS: శివ ఠాకూర్). రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా…

Read Full News

అభివృద్ధి, సంక్షేమమే మా అజెండా: మంత్రి సవితమ్మ

కక్ష సాధింపు రాజకీయాలు మా విధానం కాదుసూపర్ సిక్స్ హామీల్లో 90 శాతం అమలు చేశాంపెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు పెనుకొండ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి)  నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖల మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే సవితమ్మ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 26 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని పనులు చేపడతామని చెప్పారు. పెనుకొండ…

Read Full News

సమ్మెకు సిద్ధమైన పవర్ జేఏసీ

పాల్వంచ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి) విద్యుత్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై యాజమాన్యంతో చర్చలు జరిగి 15 రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడంపై పవర్ జేఏసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యుత్ యాజమాన్యాల నుంచి సరైన స్పందన లేకపోవడంతో సమ్మెకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు పవర్ జేఏసీ వెల్లడించింది. సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లోని 1104 కార్యాలయంలో జరిగిన విద్యుత్ జేఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో పవర్ ఎంప్లాయీస్…

Read Full News

బిందెల కాలనీ భూ సమస్యపై 17న ప్రజా ధర్నా

అనంతపురం, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి). బిందెల కాలనీలోని సర్వే నంబర్లు 189/3, 75లో ఉన్న భూముల సమస్యపై దాదాపు 22 నిరుపేద కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 17న శాంతియుత ధర్నా నిర్వహించనున్నట్లు ప్రజా ఉద్యమ నేత సాకే గోవింద్ తెలిపారు. ఉదయం 11 గంటలకు అనంతపురం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పేదల స్థలాలను కాపాడాలని, అక్రమ జోక్యాలను అడ్డుకోవాలని, వాస్తవ రికార్డులను…

Read Full News