Warangal
సౌదీలో మృతి చెందిన పశ్చిమ బెంగాల్ వాసి మృతదేహం తరలింపునకు SATA చొరవ
భారత రాయబార కార్యాలయం నుంచి NOC ప్రక్రియ పూర్తి.. కార్గో ఏర్పాట్లు పెండింగ్ జెడ్డా, సౌదీ అరేబియా (E6tv NEWS): సౌదీ అరేబియాలో సహజ మరణం చెందిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహమ్మద్ మజ్రుల్ హక్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) చొరవ తీసుకుంది. మృతదేహాన్ని భారత్‌కు పంపించేందుకు అవసరమైన అధికారిక ప్రక్రియ పూర్తికాగా, ప్రస్తుతం కార్గో ఏర్పాట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మహమ్మద్ మజ్రుల్ హక్ ఇస్సామ్ కబ్బానీ గ్రూప్‌లో ఉద్యోగిగా…
తెలంగాణలో 95% తగ్గిన వర్షపాతం!
ఈ ఏడాది అక్టోబర్‌లో తెలంగాణ తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ నెల 1 నుంచి 21వ తేదీ వరకు సాధారణంగా కురవాల్సిన 75.6 మిమీ వర్షపాతానికి గాను కేవలం 3.5 మిమీ మాత్రమే వర్షం నమోదుకావడంతో ఏకంగా 95 శాతం లోటు నమోదైంది. ఈ పరిస్థితుల దృష్ట్యా పంటల సంరక్షణ, నీటి నిల్వల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఎస్సారెస్పీ సబ్ కెనాల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
మృతురాలి వయస్సు 40–45 ఏళ్ల మధ్య ఉండవచ్చని అంచనా.. ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి ఇబ్రహీంపట్నం, అక్టోబర్ (E6tv న్యూస్). జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదూరు గ్రామ శివారులో ఉన్న ఎస్సారెస్పీ సబ్ కెనాల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కాలువ నీటి ప్రవాహంలో మృతదేహం కొట్టుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఆమె ఎరుపు…
హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్
దుర్గామాత నిమజ్జనం సందర్భంగా ఘర్షణ.. కత్తితో యువకుడిపై దాడి కోరుట్ల, అక్టోబర్ 21 (E6tv న్యూస్). జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో జరిగిన హత్యాయత్నం ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పండుగ సందర్భంగా చోటుచేసుకున్న వివాదం ఘర్షణకు దారితీయడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. అర్బన్ కాలనీకి చెందిన గుద్దేటి రాజేందర్ (43) తన కాలనీలో దుర్గామాత నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. పోలీస్ శాఖకు తీరని లోటు
హెడ్ కానిస్టేబుల్ గడపలే బాబు అంత్యక్రియల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల నిర్మల్ జిల్లా, అక్టోబర్ 21 (E6tv న్యూస్). నిర్మల్ జిల్లా పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గడపలే బాబు (HC 2228) బైంసా పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆయన అకాల…
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
సతెళ్లి దర్గా సమీపంలో చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం యెల్లారెడ్డి, అక్టోబర్ 21 (E6tv న్యూస్) కామారెడ్డి జిల్లా యెల్లారెడ్డి మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సతెళ్లి గ్రామానికి చెందిన కుర్మ సాయిలు (21) అక్టోబర్ 20వ తేదీ రాత్రి సుమారు 8 గంటల సమయంలో యెల్లారెడ్డి నుంచి తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామమైన సతెళ్లికి బయలుదేరాడు. ఈ క్రమంలో సతెళ్లి దర్గా సమీపానికి…
బిజెవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కసిరెడ్డి సింధూరెడ్డి నియామకం
జాతీయ స్థాయిలో తెలంగాణ యువ మహిళా నాయకురాలికి గుర్తింపు పార్టీ అభివృద్ధికి పూర్తి సమయం కేటాయిస్తా: కసిరెడ్డి సింధూరెడ్డి చందానగర్, అక్టోబర్ 21 (E6 tv NEWS). భారతీయ జనతా పార్టీ యువమోర్చా (బిజెవైఎం) జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా చందానగర్ బీజేపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్, బిజెవైఎం తెలంగాణ మాజీ ఉపాధ్యక్షురాలు కసిరెడ్డి సింధూరెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకాన్ని బిజెవైఎం జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు డాక్టర్ హెమాంగ్ జోషి మంగళవారం ప్రకటించారు. తెలంగాణకు చెందిన యువ మహిళా…
అమ్మవారి లడ్డూకు రూ.25,555.. మణిహారానికి రూ.24,100!
భక్తిశ్రద్ధల నడుమ దుర్గాభవాని అమ్మవారి ప్రసాదాల వేలం పది అవతారాల్లో అమ్మవారి దర్శనం.. చీరల వేలంలో భక్తుల పోటాపోటీ ఎల్లారెడ్డి, అక్టోబర్ 21 (E6tv న్యూస్ ప్రతినిధి). కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి 4వ వార్డులో త్రినేత్రి భవాని మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గాభవాని అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారికి సమర్పించిన పవిత్ర ప్రసాదాలు, చీరలు, మణిహారం వేలం నిర్వహించగా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు….
ఈనెల 23న మున్నూరు కాపు దసరా ఆత్మీయ సమ్మేళనం
జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ నిజామాబాద్, అక్టోబర్ 21: (E6tv న్యూస్:శివ ఠాకూర్). నిజామాబాద్ జిల్లాలోని మున్నూరు కాపు కుటుంబాల ఐక్యత, ఆత్మీయతను పెంపొందించేందుకు ఈనెల 23వ తేదీన దసరా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు నిజామాబాద్ మాజీ మేయర్, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ తెలిపారు. ప్రగతినగర్ లోని మున్నూరు కాపు సంఘం భవనంలో నిర్వహించనున్న ఈ సమ్మేళనానికి జిల్లాలోని ప్రతి మున్నూరు కాపు కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నట్లు ఆయన…
మీనూరులో దసరా బంగారం సందడి
జమ్మి ఆకులను బంగారంగా భావించి పంచుకున్న గ్రామస్తులు మీనూరు, అక్టోబర్ 21 (E6tv న్యూస్). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మీనూరు గ్రామంలో విజయదశమి పండుగ సందర్భంగా దసరా బంగారం సందడి నెలకొంది. గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా జమ్మి ఆకులను బంగారంగా భావించి ఒకరికొకరు పంచుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటూ ఆప్యాయతను చాటుకున్నారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ గ్రామంలో ఆనందోత్సాహాల మధ్య సాగింది. జమ్మి ఆకులను…
