Warangal
మద్నూర్‌లో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
మద్నూర్, సెప్టెంబర్ 8:(E6tv న్యూస్: ప్రతినిధి). మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం అంతర పాఠశాలల మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. సర్పంచ్ ఉష, ఎంఈవో రాములు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను కనబరచాలని ఆకాంక్షించారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, సమష్టి భావన పెంపొందుతాయని తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీల్లో మండలంలోని…
వ్యవసాయ పరిశోధనా కేంద్రం ముధోల్‌లో సరస్వతి శిశు మందిర్ విద్యార్థుల క్షేత్ర సందర్శన
ముధోల్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). ముధోల్‌లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని భైంసాకు చెందిన శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు క్షేత్ర సందర్శనలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. ఆకుల దినేష్ మరియు డా. కిషోర్ ఆధ్వర్యంలో మట్టి నమూనాల సేకరణ (Soil Sampling), నేల పరీక్షల ప్రాముఖ్యత, నేల ఆరోగ్యం మరియు పంటల పెరుగుదలలో నేల పోషకాల పాత్ర గురించి అవగాహన కల్పించారు.అలాగే ఎల్ నినో (El…
ఇంటిని తలపిస్తున్న సీతారామనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాల
పరిశుభ్రత, నిర్వహణపై ఎంఈఓ బెక్కంటి శ్రీనివాసరావు ప్రశంసలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమాజం సహకరించాలి భద్రాచలం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి) సీతారామనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం, మరుగుదొడ్ల నిర్వహణ పరిశుభ్రంగా ఉండి ఇంటి వాతావరణాన్ని తలపిస్తోందని మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అన్నారు.సోమవారం పాఠశాలల సందర్శనలో భాగంగా ఆయన సీతారామనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులు,…
అర్హత కలిగిన నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు
పదోన్నతి అర్హత పత్రాలు అందజేసిన ఐటీడీఏ పీవో బి. రాహుల్ భద్రాచలం, సెప్టెంబర్8:(E6tv NEWS: ప్రతినిధి).గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, ఖమ్మం రీజియన్ పరిధిలో పనిచేస్తున్న అర్హత కలిగిన నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు కల్పించి, పదోన్నతి అర్హత పత్రాలను అందజేసినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు.సోమవారం తన ఛాంబర్‌లో ఉద్యోగులకు పదోన్నతి పత్రాలను అందజేశారు. వి. పృధ్వీరాజు, బి. కిరణ్‌లకు జూనియర్ అసిస్టెంట్లుగా, ఎస్. సత్యం, వి. సంతోష్ కుమార్, పి. రామదాస్‌లకు…
జీఓ 97 రద్దు చేయాలి
రాహుల్ గాంధీకి AISF పోస్ట్‌కార్డుల ద్వారా విద్యార్థుల వినతి కొత్తగూడెం,సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో జీఓ నంబర్ 97ను రద్దు చేయాలని కోరుతూ AISF ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం రాహుల్ గాంధీకి పోస్ట్‌కార్డుల ద్వారా వినతి తెలిపారు.ఈ సందర్భంగా AISF జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల విజయ్ మాట్లాడుతూ.. SBTET బోర్డును యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేయడం వల్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్య కార్పొరేటీకరణకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన…
ప్రజావాణి వినతులకు సత్వర పరిష్కారం చూపాలి
ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ మండలాల్లోనూ ప్రజావాణి నిర్వహణతో ప్రజలకు చేరువగా పాలన పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).ప్రజల నుంచి స్వీకరించే ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి…
తాళ్ల రాంపూర్, దోమచందాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
తాళ్ల రాంపూర్, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతిని) ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను తాళ్ల రాంపూర్, దోమచందా గ్రామాల్లో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యాలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో తహసీల్దార్‌తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొని కార్డులను పంపిణీ చేశారు.తాళ్ల రాంపూర్ గ్రామంలో ఇన్‌చార్జి సర్పంచ్ చాట్ల జనార్ధన్, దోమచందా గ్రామంలో సర్పంచ్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్…
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ దొరకు అభినందనలు
పాల్వంచ, సెప్టెంబర్ 7: (E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచ ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) సూపరింటెండెంట్ డాక్టర్ దొరను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్–బాబు జగ్జీవన్‌రామ్ వారసుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా అభినందించారు.పాల్వంచతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని సకాలంలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ దొర సేవలను ఐక్యవేదిక ప్రతినిధులు కొనియాడారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య…
HCA అండర్-16 జట్టుకు పాల్వంచకు చెందిన ముగ్గురు ఎంపిక
సృజంత్, దివాకర్, ప్రిన్స్‌కు చోటు పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచకు చెందిన నెక్స్ట్‌జెన్ క్రికెట్ అకాడమీకి చెందిన ముగ్గురు యువ క్రికెటర్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అండర్-16 జట్టుకు ఎంపికయ్యారు. అకాడమీ ఆటగాళ్లు సృజంత్, దివాకర్, ప్రిన్స్ ప్రతిభ కనబరిచి జట్టులో స్థానం సంపాదించారు.HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో తమ ప్రతిభను చాటుకున్న ఈ ముగ్గురు ఆటగాళ్లు అండర్-16 జట్టుకు ఎంపిక కావడం పట్ల క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. వారి…
విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి బోధన
బోధన్, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) బోధన్‌లో ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలను పోషిస్తూ వివిధ తరగతుల్లో బోధనా కార్యక్రమాలను నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి. సత్య వర ప్రసాద్‌తో పాటు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి…

