Breaking News

నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి కార్యాచరణ

ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం: ఈడీ సోలమన్ నిజామాబాద్, సెప్టెంబర్ 5: (E6tv NEWS; ప్రతినిధి) టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ తెలిపారు. నిజామాబాద్ రీజియన్‌లో పర్యటించిన ఆయన వివిధ డిపోల పనితీరును పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్లతో సమావేశమైన ఈడీ సోలమన్.. డిపోల పనితీరును మరింత మెరుగుపరచాలని సూచించారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, సమయపాలనతో కూడిన ప్రజా రవాణా…

Read More

కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి

నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిజామాబాద్, సెప్టెంబర్ 5,:(E6tv NEWS: ప్రతినిధి)  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ నాయకత్వం వహించారు. ర్యాలీలో వెయ్యికి పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.పాత కలెక్టర్…

Read More

భీంగల్‌లో కాంగ్రెస్ 1000 రోజుల ప్రజాపాలన విజయోత్సవం

భీంగల్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీ ఆదివారం భీంగల్ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ, సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్, డీసీసీ అధ్యక్షుడు కట్పల్లి నగేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో…

Read More

ఉనికి కోసమే బీఆర్ఎస్ నాయకుల ఆరాటం

ప్రజా సంక్షేమంపై మరింత నిబద్ధతతో ముందుకు వెళ్తాం: మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)  బీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలిపారు….

Read More

విద్యార్థులకు బూట్లు, సాక్సుల పంపిణీ

ఏర్గట్ల, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) . ఎర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన బూట్లు, సాక్సులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులు యూనిఫామ్‌లో చక్కగా కనిపించడంతో పాటు క్రమశిక్షణతో పాఠశాలకు హాజరయ్యేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బూట్లు, సాక్సులు అందజేస్తోందన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు బూట్లు, సాక్సులు ధరించి రావాలని సూచించారు. యూనిఫామ్‌ను సక్రమంగా ధరించడం, బూట్లు వేసుకోవడం,…

Read More

మంత్రి పొంగులేటికి కౌశిక్ రెడ్డి వార్నింగ్…

హన్మకొండ: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుపై నోరుపారేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ చేపట్టిన ‘వంటా-వార్పు’ నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. పాడి కౌశిక్ రెడ్డి విమర్శల ప్రధానాంశాలు:

Read More

శిరీష హత్యాచార ఘటనపై నిందితుడిని కఠినంగా శిక్షించాలి

కొవ్వొత్తుల ర్యాలీ, మానవహారం నిర్వహించిన ఇల్లందు కాంగ్రెస్ శ్రేణులు ఇల్లందు: హైదరాబాద్‌లోని ప్రైమ్ కేర్ హాస్పిటల్‌లో నర్సుగా విధులు నిర్వహిస్తున్న ఊకే శిరీష పై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి జగదాంబ సెంటర్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగదాంబ…

Read More

ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం: గణేష్ బిగాల

నిజామాబాద్, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ బైక్ ర్యాలీ సెప్టెంబర్ 5న ఉదయం 10:30 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి ప్రారంభం కానుంది. యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఎన్నికల సమయంలో…

Read More

బల్దియా ఉద్యోగుల మెడకు  అవుట్సోర్సింగ్ ఉచ్చు!

జమ్మికుంట, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి).జమ్మికుంట బల్దియా ఉద్యోగుల మెడకు అవుట్సోర్సింగ్ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై ఆధారాలు సేకరించి చర్యలు తీసుకునేందుకు అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు ఉద్యోగుల వ్యవహారాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ కార్యాలయంలో ఉద్యోగుల పనితీరు, గతంలో జరిగిన వ్యవహారాలపై అధికారులు ఆరా…

Read More

జుక్కల్ చౌరస్తాలో బస్సు ప్రమాదం

డ్రైవర్ మృతి.. 12 మందికి గాయాలు బిచ్కుంద ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) జుక్కల్ చౌరస్తా వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, మరో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మొత్తం 13 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను…

Read More