దుర్గామాత నిమజ్జనం సందర్భంగా ఘర్షణ.. కత్తితో యువకుడిపై దాడి
కోరుట్ల, అక్టోబర్ 21 (E6tv న్యూస్).
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో జరిగిన హత్యాయత్నం ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పండుగ సందర్భంగా చోటుచేసుకున్న వివాదం ఘర్షణకు దారితీయడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. అర్బన్ కాలనీకి చెందిన గుద్దేటి రాజేందర్ (43) తన కాలనీలో దుర్గామాత నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున కిరణ్, అజయ్, జ్ఞానదీప్‌లు అర్బన్ కాలనీలోని దుర్గామాత ఆలయం వద్దకు వచ్చి రాజేందర్‌తో గొడవకు దిగారు.
ఈ క్రమంలో కిరణ్, అజయ్‌లు రాజేందర్‌ను పట్టుకోగా, జ్ఞానదీప్ తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో రాజేందర్ ఎడమ భుజం, మెడ ఎడమ వైపు గాయాలయ్యాయి. స్థానికులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా, కత్తితో బెదిరించి అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు కిరణ్, అజయ్, జ్ఞానదీప్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ సందర్భంగా కోరుట్ల సీఐ తిరుపతి, ఎస్‌ఐ శ్యామ్‌రాజ్ మాట్లాడుతూ.. పండుగల సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని, చిన్నపాటి వివాదాలను ఘర్షణలుగా మార్చుకోవద్దని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
E6tv NEWS

