Breaking News

కార్యకర్తలకు గుర్తింపు.. పార్టీ బలోపేతానికి అడుగులు!

పరిగి మండలంలో వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డుల పంపిణీ స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా గ్రామస్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి పెనుకొండ / పరిగి, అక్టోబర్ 9 (E6 TV NEWS): శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని పరిగి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ పార్టీ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. బీచగానిపల్లి, శిగుపల్లి, పైడేటి, పి.నరసాపురం, శిరేకొలం,…

Read Full News

రావులచెరువులో 42 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలు

104 ఆరోగ్య రథం ద్వారా గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు పరీక్షలతో పాటు ఉచితంగా మందుల పంపిణీ ధర్మవరం రూరల్‌, అక్టోబర్ 9 (E6 TV NEWS): గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ ద్వారా 42 రకాల ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్‌ మండలం రావులచెరువు గ్రామంలో భవ్య హెల్త్‌ సర్వీస్‌ ఆధ్వర్యంలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి….

Read Full News

నిజామాబాద్ AMCలో అసలు ఏం జరుగుతోంది?

కోట్ల ఆదాయం.. 76 ఎకరాల మార్కెట్.. అయినా పాలనపై ప్రశ్నలు చైర్మన్ పీఠం ఎవరికి? సిబ్బంది కొరత ఎప్పుడు తీరేను? ఆదాయ–వ్యయాలపై పారదర్శకత ఎప్పుడు? నిజామాబాద్, అక్టోబర్ 8 (E6tvNEWS: శివ ఠాకూర్).రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, ఖరీదుదారులతో నిత్యం రద్దీగా ఉండే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC)పై ఇప్పుడు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుమారు 76 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న మార్కెట్‌కు భారీగా ఆదాయం వస్తున్నట్లు సమాచారం. వందలాది మంది లైసెన్సుదారులు, అనేక రకాల…

Read Full News

దొంగిలించిన బంగారు ఉంగరం రికవరీ

చెన్నేకొత్తపల్లి పోలీసుల చాకచక్యం.. బాధితుడికి ఉంగరం అప్పగింత చెన్నై కొత్తపల్లి, అక్టోబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి) చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించబడిన బంగారు ఉంగరాన్ని పోలీసులు రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం.. చెన్నేకొత్తపల్లికి చెందిన రామకృష్ణ రాజు వద్దకు గతంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మాటల్లో మభ్యపెట్టాడు. తన తల్లికి ఇలాంటి ఉంగరం చేయించాలని ఉందని, రామకృష్ణ రాజు ధరించిన ఉంగరాన్ని ఒకసారి చూసి ఇస్తానని నమ్మించాడు. దీంతో రామకృష్ణ రాజు…

Read Full News

రాయలసీమ నిధులపై రోజా ఫైర్..సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

రాయలసీమలో కరవు, సాగునీటి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్.కే. రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. “కరవు, చంద్రబాబు కవల పిల్లలు” అని వ్యాఖ్యానించిన ఆమె, రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.24,000 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్న మాటల్లో నిజం లేదని, ఆ నిధులు ఎక్కడ వెచ్చించారో ప్రజలకు చూపించాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రకటించాలని,…

Read Full News

మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

సమాన పనికి సమాన వేతనం అందించాలి: సాకే హరి అనంతపురం, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి)మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, సమాన పనికి సమాన వేతనం అందేలా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో…

Read Full News

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యం

‘విద్యా వికాసం–విద్యా వాహిని’తో ప్రతిభకు ప్రోత్సాహం పర్యావరణ పరిరక్షణపై డ్రాయింగ్ పోటీలు.. విజేతలకు బహుమతులు ధర్మవరం, అక్టోబర్ 05:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే ‘విద్యా వికాసం–విద్యా వాహిని’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇంచార్జ్…

Read Full News

వివేకా హత్య, లిక్కర్ స్కామ్‌పై చంద్రబాబు ఛాలెంజ్!

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి రూ.30,156 కోట్ల అంచనా వ్యయంతో 90 లక్షల కుటుంబాలకు సురక్షిత తాగునీరు అందించే ‘అమరజీవి జలధార’ (జల్ జీవన్ మిషన్ 2.0) పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. గత వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల సుపారీ గుట్టు విప్పాక…

Read Full News

పొద్దుటూరులో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం!

వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ 2.0 కింద రూ.30,156 కోట్ల భారీ వ్యయంతో చేపడుతున్న ‘అమరజీవి జలధార’ బృహత్తర తాగునీటి ప్రాజెక్ట్ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ నివాసానికి, సుమారు 90 లక్షల కుటుంబాలకు సురక్షితమైన కుళాయి నీటిని అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన…

Read Full News

శ్రీ సత్యసాయి జిల్లా మాదిగ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కన్వీనర్‌గా రాచర్ల రామకృష్ణ

చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లా మాదిగ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కమిటీ కన్వీనర్‌గా చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన జర్నలిస్టు రాచర్ల రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎం.ఎస్.పి. రాష్ట్ర మాజీ అధ్యక్షులు, శ్రీ సత్యసాయి జిల్లా ఇన్‌చార్జి బాయకాటి బెనర్జీ ప్రకటించారు. శనివారం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఆవరణలో చెన్నేకొత్తపల్లి మండల ఎం.ఆర్.పి.ఎస్. అధ్యక్షులు అర్జునప్ప మాదిగ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాప్తాడు…

Read Full News