Breaking News

పొద్దుటూరులో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం!

వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ 2.0 కింద రూ.30,156 కోట్ల భారీ వ్యయంతో చేపడుతున్న ‘అమరజీవి జలధార’ బృహత్తర తాగునీటి ప్రాజెక్ట్ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ నివాసానికి, సుమారు 90 లక్షల కుటుంబాలకు సురక్షితమైన కుళాయి నీటిని అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో గత కొన్ని నెలల్లో రాష్ట్ర పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశామని, పేదలందరికీ ఇళ్ల నిర్మాణంతో పాటు అమరావతిలో పాన్ ఐఐటీ వరల్డ్ కౌన్సిల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను నెలకొల్పుతూ ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని ఆయన కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *