Breaking News

అర్నాబ్‌ తుఫాన్‌ ప్రభావం: సూర్యలంక బీచ్ మూసివేత..

‘ఆర్నబ్‌’ తుపాను హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల జిల్లా సూర్యలంక సముద్రతీరంలో అలల ఉధృతి, గాలుల వేగం పెరగడంతో అధికారులు తీవ్ర అప్రమత్తత వ్యక్తం చేస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు బీచ్‌కు వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, పర్యాటకులను లోపలికి అనుమతించకుండా వెనక్కి పంపుతున్నారు. దీంతో ఎప్పుడూ సందడిగా ఉండే సూర్యలంక తీరం నిర్మానుష్యంగా మారింది. మరోవైపు, వాతావరణ శాఖ హెచ్చరికలతో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా తమ పడవలను ఆదర్శనగర్‌ కాలువలో సురక్షితంగా…

Read Full News

మాచర్లలో అల్లర్ల కట్టడిపై పోలీసుల మాక్ ఆపరేషన్

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో గురజాల అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు మాక్ ఆపరేషన్ నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు జరిగినప్పుడు శాంతిభద్రతలను ఎలా కాపాడాలి, పరిస్థితులను ఎలా అదుపులోకి తీసుకురావాలనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జ్ వంటి చర్యలను పోలీసులు ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపించారు. అత్యవసర పరిస్థితుల్లో సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడమే ఈ మాక్ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని…

Read Full News

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ధర్మవరంలో పోలీసుల మొబైల్ ర్యాలీ

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీఐలు రెడ్డప్ప, జయ నాయక్ ధర్మవరం, శ్రీ సత్యసాయి జిల్లా (E6tv న్యూస్). మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ జగన్నాథ్ రాజు పర్యవేక్షణలో ధర్మవరం పట్టణంలో వన్‌టౌన్, టూటౌన్ సీఐలు రెడ్డప్ప, జయ నాయక్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మొబైల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల…

Read Full News

నరసరావుపేటలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్.. ప్రజల్లో భరోసా!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఏఆర్ డీఎస్పీ మహాత్మా గాంధీ రెడ్డి పర్యవేక్షణలో నరసరావుపేట పట్టణంలో పోలీసులు గురువారం ఫ్లాగ్ మార్చ్ (కవాతు) నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ఫ్లాగ్ మార్చ్ మల్లమ్మ సెంటర్ మీదుగా సత్తెనపల్లి రోడ్డులోని కోట సెంటర్ వరకు సాగింది. ఈ కవాతులో…

Read Full News

దాచేపల్లిలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం!

పల్నాడు జిల్లా దాచేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికార కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాత్రికి రాత్రే నామినేషన్ కేంద్రాలను మార్చివేస్తూ తమ పార్టీ అభ్యర్థులను అయోమయానికి, ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ మరియు ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెళ్తున్న వైసీపీ అభ్యర్థులను పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుకోవడంతో పాటు, పలువురిపై అక్రమ కేసులు…

Read Full News

వైసీపీ నేతల తీరుపై అదనపు డీఎస్పీ సంచలన కామెంట్స్!

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. నామినేషన్ల దాఖలులో పోలీసు యంత్రాంగం సహకరించడం లేదంటూ వైఎస్సార్‌సీపీ (వైసీపీ) చేస్తున్న ఆరోపణలను అదనపు డీఎస్పీ హనుమంతరావు తీవ్రంగా ఖండించారు. ప్రజలను, పోలీసులను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా వైసీపీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పోలీసుల ప్రకటన ప్రకారం.. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని స్పష్టం చేసినప్పటికీ వైసీపీ అభ్యర్థులు ముందుకు రాలేదు. చివరి రోజు…

Read Full News

ఉత్తరాంధ్ర ‘ఆర్నాబ్’ తుపాను ముప్పు.. 27, 28 తేదీల్లో భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ‘ఆర్నాబ్’ తుపానుగా మారుతున్న నేపథ్యంలో, ఉత్తర కోస్తాంధ్ర మరియు దక్షిణ ఒడిశా తీరాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో గంటకు 70 నుండి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. సముద్రం అలజడిగా…

Read Full News

మహిళా పోలీసుతో విడదల రజనిని తోపులాట…!

పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎడ్లపాడు జెడ్పీటీసీ అభ్యర్థి బుల్లబ్బాయిని ఆమె నివాసంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో రజని బయటకు వచ్చి నిలదీశారు. ఈ సందర్భంగా చిలకలూరుపేట రూరల్ ఎస్ఐ ప్రియాంక, విడదల రజనికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎస్ఐ అడ్డుకునే క్రమంలో జరిగిన తోపులాటలో రజని కిందపడిపోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకునేందుకు…

Read Full News

కూటమి అభ్యర్థిగా పసుపులేటి నారాయణ నామినేషన్

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామానికి చెందిన కూటమి ఎంపీటీసీ అభ్యర్థిగా పసుపులేటి నారాయణ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. నడికుడి సచివాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఆయన తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. నామినేషన్ సందర్భంగా గామాలపాడు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, ఆయనతో పాటు కూటమి నేతలు జంగా సురేష్, జంగా సైదులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు…

Read Full News

పల్నాడులో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ: కలెక్టర్, ఎస్పీ వెల్లడి

పల్నాడు జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక చర్యల వల్ల అభ్యర్థులు స్వేచ్ఛగా ముందుకు వచ్చి నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో 65కు పైగా జడ్పీటీసీ, 700కు పైగా ఎంపీటీసీ నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా నేరుగా కలెక్టర్‌ను లేదా పోలీసులను సంప్రదించవచ్చని స్పష్టం…

Read Full News