Breaking News

నరసరావుపేటలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్.. ప్రజల్లో భరోసా!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఏఆర్ డీఎస్పీ మహాత్మా గాంధీ రెడ్డి పర్యవేక్షణలో నరసరావుపేట పట్టణంలో పోలీసులు గురువారం ఫ్లాగ్ మార్చ్ (కవాతు) నిర్వహించారు.

జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ఫ్లాగ్ మార్చ్ మల్లమ్మ సెంటర్ మీదుగా సత్తెనపల్లి రోడ్డులోని కోట సెంటర్ వరకు సాగింది. ఈ కవాతులో నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్‌ఐలతో పాటు సుమారు 100 మందికి పైగా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యగా దీనిని చేపట్టామని పోలీసులు తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *