Breaking News

పల్నాడులో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ: కలెక్టర్, ఎస్పీ వెల్లడి

పల్నాడు జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక చర్యల వల్ల అభ్యర్థులు స్వేచ్ఛగా ముందుకు వచ్చి నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో 65కు పైగా జడ్పీటీసీ, 700కు పైగా ఎంపీటీసీ నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా నేరుగా కలెక్టర్‌ను లేదా పోలీసులను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు పూర్తి ప్రాధాన్యతనిస్తున్నామని, అభ్యర్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ఎన్నికల్లో పాల్గొనాలని అధికారులు భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *