Breaking News
అఫ్గాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమ్‌ఇండియా.. అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ!
అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లోనూ భారత క్రికెట్ జట్టు తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 127 పరుగుల భారీ తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసి, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అభిషేక్ శర్మ రికార్డు శతకం: టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత…
గుంటూరులో 218 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని!
గుంటూరు నగరంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా 218 నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. ప్రసంగంలోని ప్రధాన ముఖ్యాంశాలు:
నేడు అమరావతిలో కీలక భేటీలు.. పెట్టుబడులు, భూ కేటాయింపులపై నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా నేడు రెండు అత్యంత కీలకమైన ఉన్నత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడుల రాక, రాజధాని నిర్మాణ పనుల వేగవంతం దిశగా ఈ భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సమావేశాల ప్రధాన వివరాలు:
నిజామాబాద్‌లో దారుణం: యూట్యూబర్ భర్త హరిబాబును నరికి చంపిన భావమరిది..
నిజామాబాద్ నగరంలో పట్టపగలే దారుణ హత్య కలకలం రేపింది. ప్రసిద్ధ యూట్యూబర్ వైష్ణవి భర్త చిట్టారి హరిబాబు (26)ను నిజామాబాద్‌లోని రాజరాజేంద్ర (ఆర్‌ఆర్) చౌరస్తా వద్ద ప్రత్యర్థులు కిరాతకంగా నరికి చంపారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కొబ్బరి బొండాల కత్తితో దాడి ప్రత్యక్ష సాక్షులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిబాబుపై ఒక వ్యక్తి కొబ్బరి బొండాలు నరికే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. ఈ దాడిలో…
ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఆర్‌ఐ మృతి
నిజామాబాద్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్. సతీష్ మృతి చెందారు. పోలీస్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌ఎస్‌ఓ డ్యూటీ ముగించుకుని శుక్రవారం ఉదయం నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చిన ఆర్‌ఐ సతీష్ ఆయుధాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు…
హత్య స్థలాన్ని పరిశీలించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్
నిజామాబాద్, సెప్టెంబర్ 17:{E6tv NEWS: శివ ఠాకూర్) నగరంలోని టౌన్-2 పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజరాజేంద్ర థియేటర్ చౌరస్తా వద్ద హరిబాబు హత్యకు గురైన ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, సంఘటన జరిగిన ప్రదేశంలో లభించిన ఆధారాలు తదితర అంశాలపై పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తును నిష్పక్షపాతంగా, వేగవంతంగా కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంఘటనకు సంబంధించిన…
అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేస్తే సహించం
‘కలిపిత నాయకుడు అంబేద్కర్’ పుస్తక విడుదలను అడ్డుకోవాలిరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సామాజిక కార్యకర్త పుల్లూరి ప్రశాంత్ జమ్మికుంట, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). డా. బి.ఆర్. అంబేద్కర్‌ను విమర్శిస్తూ ‘కలిపిత నాయకుడు అంబేద్కర్’ పేరుతో పుస్తకాన్ని సెప్టెంబర్ 18న విడుదల చేయనున్న కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని సామాజిక కార్యకర్త పుల్లూరి ప్రశాంత్ డిమాండ్ చేశారు. అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేయడం, ఆయన గౌరవానికి భంగం కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం సహించబోమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా…
ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
ముధోల్, సెప్టెంబర్ 17: (E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతంతో పాటు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎబీవీపీ నిర్మల్ జిల్లా కన్వీనర్ దినేష్ తెలంగాణ రాష్ట్ర విమోచన ఉద్యమ చరిత్ర, ఆనాటి పోరాటాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ…
ముచ్కూరు గ్రామంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
మొక్కలు నాటి సేవా కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ నాయకులు భీమ్‌గల్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భీమ్‌గల్ మండలం ముచ్కూరు గ్రామంలో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొడిగేళ శ్రీనివాస్, ఉపసర్పంచ్ రమేష్, మండల ప్రధాన కార్యదర్శి పల్లికొండ ప్రసాద్లతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ భీమ్‌గల్ మండల అధ్యక్షుడు అరే రవీందర్…
పచ్చలనడుకుడలో 16 సీసీ కెమెరాలు ప్రారంభం
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం: సీపీ సాయి చైతన్య సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నిజామాబాద్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అన్నారు. మన ఊరు–మన భద్రత–మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్చలనడుకుడ గ్రామంలో 16 సీసీ కెమెరాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా…
