Breaking News
ప్రతిభ ఉన్న క్రికెటర్లను గుర్తించి ప్రోత్సహిస్తాం
పెనుకొండలో క్రీడా సంస్కృతికి సుదీర్ఘ చరిత్ర ఉంది ఆర్డీటీ క్రికెట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి అనంతపురం, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రికెట్ ప్రతిభను గుర్తించి, యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) ఆధ్వర్యంలో రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్డీటీ క్రికెట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో…
హంద్రీ–నీవా కుడి కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలి
పేరూరు డ్యాంకు నీరు అందించాలి – జలదీక్షలో జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అనంతపురం, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).హంద్రీ–నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) పీఏబీఆర్ కుడి కాలువ కింద ఉన్న చెరువులకు, పేరూరు డ్యాంకు వెంటనే నీటిని విడుదల చేయాలని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ డిమాండ్ చేశారు. రైతుల సాగునీటి హక్కుల కోసం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహ దినమే
తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడాలి: పీడీఎస్‌యూ బోధన్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు ముమ్మాటికీ విద్రోహ దినమేనని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో నేటి విద్యారంగ సమస్యలపై విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలోని మధుమలంచ జూనియర్ కళాశాలలో పీడీఎస్‌యూ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో “1948 సెప్టెంబర్ 17 విద్రోహ దినం” సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్ కుటుంబానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పరామర్శ
డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్‌తో కలిసి కుటుంబ సభ్యులకు సానుభూతి మద్నూర్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్ వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గురువారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మద్నూర్ మండల కేంద్రంలోని ప్రజ్ఞ కుమార్ స్వగృహానికి వెళ్లిన ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని…
CMR సమస్యలు పరిష్కరించాలి
బాన్సువాడ డివిజన్ రైస్ మిల్లర్ల నిరవధిక బంద్‌కు పిలుపు.. MROకు వినతిపత్రం బాన్సువాడ, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) డెలివరీల్లో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాన్సువాడ డివిజన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు మిల్లింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి…
140 కోట్ల మంది ప్రయోజనాలే ముఖ్యం: ట్రంప్ సుంకాల హెచ్చరికలకు భారత్ కౌంటర్
రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100% దాకా భారీ సుంకాలు విధించేలా అమెరికా ప్రతినిధుల సభ ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం పడితే చట్టంగా మారనున్న ఈ హెచ్చరికలపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన: దేశంలోని 140 కోట్ల మంది…
ఫుడ్ సేఫ్టీపై TG-SAFE కఠిన చర్యలు..
హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా TG-SAFE (తెలంగాణ స్టేట్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ అథారిటీ) అధికారులు తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. ఎల్బీ నగర్ మరియు దిల్సుఖ్నగర్ పరిధిలోని ఫుడ్ తయారీ కేంద్రాలు, హోటళ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. తనిఖీల్లో వెలుగుచూసిన ప్రధాన వివరాలు: ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఏ సంస్థనూ ఉపేక్షించేది లేదని, ఆహార నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని TG-SAFE అధికారులు స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై అఖిలపక్ష సమావేశం
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారుల చర్చ శ్రీ సత్యసాయి జిల్లా, చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియపై అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు. మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లకు సంబంధించిన అంశాలపై సమావేశంలో ప్రధానంగా…
అత్తాపూర్‌లో అర్ధరాత్రి పోకిరీల హల్చల్..
హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిగల చింతల్మెట్ డీమార్ట్ చౌరస్తా వద్ద అర్ధరాత్రి వేళ పోకిరీల ఆగడాలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మోడిఫైడ్ కార్లతో మైనర్ యువకులు రోడ్లపై అతివేగంగా నడుపుతూ, ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు నిరంతరం ‘చబుత్రా మిషన్’తో పాటు అర్ధరాత్రి వాహన తనిఖీలు చేపడుతున్నప్పటికీ ఈ పోకిరీల హంగామా ఆగడం లేదని, అధికారుల పర్యవేక్షణ లోపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలకు ముప్పు…
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ
నిజామాబాద్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. రీజినల్ మేనేజర్ ఎస్వీజీ కృష్ణమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించగా, అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు జాతీయగీతాన్ని ఆలపించి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ప్రజా పాలన ఆవిర్భావం, దేశ సమైక్యత, ప్రజాసేవ ప్రాధాన్యతపై ప్రసంగించారు….
