మొక్కలు నాటి సేవా కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ నాయకులు
భీమ్‌గల్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భీమ్‌గల్ మండలం ముచ్కూరు గ్రామంలో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొడిగేళ శ్రీనివాస్, ఉపసర్పంచ్ రమేష్, మండల ప్రధాన కార్యదర్శి పల్లికొండ ప్రసాద్లతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ భీమ్‌గల్ మండల అధ్యక్షుడు అరే రవీందర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని కేవలం వేడుకలకు పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాలకు అంకితం చేయడం ఆయనకు అందించే గౌరవమని అన్నారు. మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి, పేదల సంక్షేమం, స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.ప్రధాని మోదీ పిలుపుతో కొనసాగుతున్న ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం స్ఫూర్తితో మొక్కలు నాటినట్లు రవీందర్ తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు యోగేశ్వర నరసయ్య, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు తోట గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శి పల్లికొండ ప్రసాద్, బిర్రు రామకృష్ణ, మండల కార్యదర్శి గణేష్, నర్సాగౌడ్, సీనియర్ నాయకులు జక్కుల కార్తీక్, బద్దం సంజయ్, ఏగోళం శ్రీనివాస్ గౌడ్, మగ్గిడి సాయి, బాలయ్య, అభిలాష్, ఇదపు అజయ్, కర్రోల్ల గంగారెడ్డి, హరీష్ తదితర నాయకులు, కార్యకర్తలు, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



