Breaking News
బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్: “అది స్పష్టంగా కోర్టు ధిక్కరణే!”
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నెపంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు, నిర్బంధాలతో కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ముఖ్యమైన వివరాలు: ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ దారి మళ్లింపు రాజకీయాలని, ప్రజలే కాంగ్రెస్ సర్కార్‌కు తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.
హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అరెస్ట్!
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ (తాతా మధు)ను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో భారీ బందోబస్తు నడుమ ఆయనను అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమైన వివరాలు: అరెస్టు చేసిన ఎమ్మెల్సీలను నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టేందుకు…
కాకినాడ వైసీపీలో ప్రకంపనలు:పార్టీకి సీనియర్ నేత గుడ్‌బై
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా కాకినాడ జిల్లాలో పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. సీనియర్ నాయకుడు, జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జి నెక్కంటి సాయి ప్రసాద్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ముఖ్యమైన వివరాలు: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
హామీల అమల్లో వైఫల్యం: నల్ల టీషర్టులతో బీఆర్ఎస్ నిరసన, ఎమ్మెల్యేల అరెస్ట్
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి 1000 రోజులు గడిచినా ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమైన వివరాలు:
శిరీష హంతకులను కఠినంగా శిక్షించాలి
కేసును నీరుగారిస్తే రాజధాని ముట్టడిస్తాం కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).నర్సు ఊకె శిరీష హంతకులను కఠినంగా శిక్షించాలని, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే రాజధానిని ముట్టడిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శిరీష హత్య ఘటనపై సోమవారం కొత్తగూడెంలోని సిపిఐ కార్యాలయం శేషగిరిభవన్లో రాజకీయ, సామాజిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ ప్రజాసేవలో ఉన్న గిరిజన యువతిపై…
కేఎల్ఆర్ గ్రూప్ చైర్పర్సన్ నాగమణికి ప్రతిష్ఠాత్మక “శిక్షా రత్న-2026” పురస్కారం
పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్న కేఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్పర్సన్ కె. నాగమణికి ప్రతిష్ఠాత్మక “శిక్షా రత్న-2026” పురస్కారం లభించింది. విద్యాసంస్థల అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, ఆధునిక విద్యా విధానాలను ప్రోత్సహించడం వంటి సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. హరి విశ్వవిద్యాలయం, సూపర్ ఏఐ అకాడమీ, అదాబ్ హైదరాబాద్, సాక్షి ఎడ్యుకేషన్, స్టడీ9 మీడియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు….
స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తాతా మధు వ్యాఖ్యలు ఖండిస్తున్నాం
రాజ్యాంగ పదవులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉంది ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పినపాక, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, దళిత నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందన్నారు. ఎమ్మెల్సీగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న…
ఎంపీ రఘురాంరెడ్డికి ఘన స్వాగతం
ఏఏఐ బృందం సర్వేలో ఎంపీతో కలిసి పాల్గొన్న కొత్వాల కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి ఏఏఐ బృందంతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు.సోమవారం సుజాతనగర్ మండలం నాయకులగూడెం వద్ద జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్నతో కలిసి ఎంపీ రఘురాంరెడ్డికి కొత్వాల శాలువా కప్పి…
నీట్లో ప్రతిభ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు
గిరిజన విద్యార్థినికి రూ.50 వేల ఆర్థిక సహాయం అభినందించిన ఐటీడీఏ పీవో బి. రాహుల్ భద్రాచలం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).నిరుపేద కుటుంబానికి చెందిన గిరిజన విద్యార్థిని భూక్య వాసిని నీట్ అడ్వాన్స్–2026లో ప్రతిభ కనబరిచి, స్టేట్ ర్యాంక్ 1962 సాధించి మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించడం అభినందనీయమని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. సోమవారం తన ఛాంబర్లో విద్యార్థినిని అభినందించిన పీవో.. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించి,…
అర్హత కలిగిన నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు
పదోన్నతి అర్హత పత్రాలు అందజేసిన ఐటీడీఏ పీవో బి. రాహుల్ భద్రాచలం, సెప్టెంబర్8:(E6tv NEWS: ప్రతినిధి).గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, ఖమ్మం రీజియన్ పరిధిలో పనిచేస్తున్న అర్హత కలిగిన నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు కల్పించి, పదోన్నతి అర్హత పత్రాలను అందజేసినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు.సోమవారం తన ఛాంబర్లో ఉద్యోగులకు పదోన్నతి పత్రాలను అందజేశారు. వి. పృధ్వీరాజు, బి. కిరణ్‌లకు జూనియర్ అసిస్టెంట్లుగా, ఎస్. సత్యం, వి. సంతోష్ కుమార్, పి. రామదాస్లకు…
