Breaking News

కేఎల్ఆర్ గ్రూప్ చైర్పర్సన్ నాగమణికి ప్రతిష్ఠాత్మక “శిక్షా రత్న-2026” పురస్కారం

పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).


విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్న కేఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్పర్సన్  కె. నాగమణికి ప్రతిష్ఠాత్మక “శిక్షా రత్న-2026” పురస్కారం లభించింది. విద్యాసంస్థల అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, ఆధునిక విద్యా విధానాలను ప్రోత్సహించడం వంటి సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు.

హరి విశ్వవిద్యాలయం, సూపర్ ఏఐ అకాడమీ, అదాబ్ హైదరాబాద్, సాక్షి ఎడ్యుకేషన్, స్టడీ9 మీడియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. కార్యక్రమానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ డా. వి. బాలకృష్ణ రెడ్డి, ఐసీఏఆర్-ఏఐసీఆర్పీ డైరెక్టర్ డా. తారా సత్యవతి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. వారి సమక్షంలో కె. నాగమణికి “శిక్షా రత్న-2026” పురస్కారాన్ని అందించారు.కె. నాగమణి నాయకత్వంలో కేఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది. ఆధునిక మౌలిక వసతుల కల్పన, మెరుగైన విద్యా అవకాశాల అందుబాటులో ఆమె చేస్తున్న కృషిని పలువురు ప్రశంసించారు.

విద్యారంగంలో కె. నాగమణి అందిస్తున్న సేవలకు, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి ఈ పురస్కారం తగిన గుర్తింపుగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా కేఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యం, ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు కె. నాగమణికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆమె నాయకత్వంలో సంస్థలు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *