పదోన్నతి అర్హత పత్రాలు అందజేసిన ఐటీడీఏ పీవో బి. రాహుల్
భద్రాచలం, సెప్టెంబర్8:(E6tv NEWS: ప్రతినిధి).
గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, ఖమ్మం రీజియన్ పరిధిలో పనిచేస్తున్న అర్హత కలిగిన నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు కల్పించి, పదోన్నతి అర్హత పత్రాలను అందజేసినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు.సోమవారం తన ఛాంబర్‌లో ఉద్యోగులకు పదోన్నతి పత్రాలను అందజేశారు. వి. పృధ్వీరాజు, బి. కిరణ్‌లకు జూనియర్ అసిస్టెంట్లుగా, ఎస్. సత్యం, వి. సంతోష్ కుమార్, పి. రామదాస్‌లకు ల్యాబ్ అసిస్టెంట్లుగా, బి. నాగరాజుకు రికార్డ్ అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పించి, ఆయా గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో నియమించినట్లు పీవో తెలిపారు.
పదోన్నతులు పొందిన ఉద్యోగులు తమకు కేటాయించిన గురుకుల విద్యాసంస్థల్లో వెంటనే విధుల్లో చేరాలని పీవో బి. రాహుల్ సూచించారు. ఉద్యోగుల అర్హతలను పరిగణనలోకి తీసుకుని పదోన్నతులు కల్పించడం ద్వారా వారి సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో గురుకులం ఆర్‌సీవో అరుణకుమారి, గురుకులం ఏవో నరేందర్, పదోన్నతి పొందిన నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

