Breaking News

అమరవేణి నర్సాగౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన జాజుల శ్రీనివాస్ గౌడ్

నిర్మల్, సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి).నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీలో ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో మృతి చెందిన అమరవేణి నర్సాగౌడ్ కుమారుడు సిద్ధార్థ బహుజన గౌడ్ కుటుంబాన్ని వివిధ ప్రజా సంఘాలు, బీసీ సంక్షేమ సంఘం, గౌడ సంఘాల నాయకులు, మాజీ మావోయిస్టు నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి తమ అండగా ఉంటామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ…

Read Full News

ఏర్గట్లలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

ఏర్గట్ల, సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి). ఏర్గట్ల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. సల్వాల సంధ్య, రెండ్ల శ్రావణి తదితరులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. అనారోగ్యంతో వైద్య చికిత్స చేయించుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందుతోందన్నారు. వైద్య చికిత్సకు సంబంధించిన బిల్లులను సమర్పిస్తే, అర్హత మేరకు సీఎం…

Read Full News

ఇంటి ముంగిటకే మీసేవ సేవలు:మంత్రి శ్రీధర్ బాబు!

ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సర్కారీ సేవల కోసం మీసేవ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమను తగ్గిస్తూ “మీ సేవ డోర్ డెలివరీ” సర్వీసులను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. బుధవారం ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఈ సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ నూతన విధానం ప్రకారం పౌరులు తమకు కావలసిన సర్టిఫికెట్లు లేదా సేవల…

Read Full News

కాంగ్రెస్ తెచ్చిన ‘క్రాప్ హాలిడే’.. ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు !

తెలంగాణలో ప్రస్తుత వ్యవసాయ సంక్షోభం, క్రాప్ హాలిడే పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలే కారణమని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు లేని నీటి కొరత తెలంగాణలోనే ఎందుకు వస్తోందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏర్పడింది ప్రకృతి కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిపెట్టిన పాలనాపరమైన ‘కల్పిత కరువు’ అని ఆయన మండిపడ్డారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్వహణపై…

Read Full News

థర్మల్ పవర్ ప్లాంట్లపై BRS బిగ్ అటాక్: రంగంలోకి 6 ప్రత్యేక బృందాలు!

తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పష్టత సాధించేందుకు భారత రాష్ట్ర సమితి (BRS) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన పవర్ ప్లాంట్లు, విద్యుత్ ఉత్పత్తి పరిస్థితులు మరియు నిర్వహణ లోపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పార్టీ తరఫున ఆరు ప్రత్యేక నేతల బృందాలను ఏర్పాటు చేసినట్లు మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ బృందాలు రేపు ఆయా పవర్ స్టేషన్లను సందర్శించి వివరాలు సేకరించి నివేదిక తయారు చేయనున్నాయి. కేటీఆర్ తెలిపిన వివరాల…

Read Full News

మరో ఇద్దరు పసికందుల ప్రాణాలు బలి.. రిమ్స్‌లో అసలేం జరుగుతోంది?

ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మరొక ఇద్దరు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. రిమ్స్ ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో (SNCU) గడిచిన ఐదు నెలలుగా సరిగా పనిచేయని ఎయిర్ కండిషనర్ (AC) లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో ఈ దారుణ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ విషాద ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి….

Read Full News

గణేష్ నిమజ్జనం వేళ ‘ఫ్యూచర్ సిటీ’లో వైన్స్, బార్లు క్లోజ్!

గణేష్ నిమజ్జన ఊరేగింపులను ప్రశాంత వాతావరణంలో, శాంతిభద్రతల పరిరక్షణతో పూర్తి చేసేందుకు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం షాపులను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, ఐపీఎస్ బుధవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ చట్టం 1968 లోని సెక్షన్ 20 కింద తనకు ఉన్న అధికారాలను ఉపయోగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం… సెప్టెంబర్…

Read Full News

రాజకీయ పరిస్థితులపై కార్యకర్తలకు అవగాహన

పుట్టపర్తి, సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి).శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలోని కార్మిక కర్షక భవన్‌లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌లో భాగంగా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ వి. రాంభూపాల్ హాజరై ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, స్థానిక రాజకీయ పరిణామాలపై పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వి. రాంభూపాల్ మాట్లాడుతూ, స్థానిక రాజకీయ పరిస్థితులను కార్యకర్తలు లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. ఓట్ల…

Read Full News

బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: మీ డిపాజిట్లపై ప్రభావం ఉందా?

దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో విపరీతంగా పెరిగిపోయిన అదనపు నగదు లభ్యతను (లిక్విడిటీ) అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలు చేపట్టింది. ఇటీవల ఓ దశలో ఏకంగా రూ. 11.16 లక్షల కోట్లకు చేరుకున్న బ్యాంకింగ్ అదనపు లిక్విడిటీ, ఆర్‌బీఐ తీసుకున్న చర్యల వల్ల సుమారు 55 శాతం మేర తగ్గి ప్రస్తుతం రూ. 4.92 లక్షల కోట్లకు పడిపోయిందని రాయిటర్స్ నివేదిక స్పష్టం చేసింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ల (OMO) ద్వారా…

Read Full News

‘మిమ్మల్ని వదిలిపెట్టం’: ఈసీ అధికారులను హెచ్చరించిన రాహుల్ గాంధీ!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై చెలరేగిన వివాదం నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం (ECI)పై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “ఎన్నికల అధికారులకు స్పష్టంగా చెబుతున్నా.. మీరు చేస్తున్నది తప్పు, ఇది దేశద్రోహంతో సమానం.. సమయం వస్తుంది, మిమ్మల్ని పట్టుకుంటాం, తప్పించుకోలేరు” అని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ‘ఓటు చోరీ’ అనేది రాజ్యాంగం మరియు భారత ప్రజలపై నేరుగా దాడి చేయడమేనని ఆయన దుయ్యబట్టారు….

Read Full News