News
జూరాల నీటి విడుదల: ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు!
జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలకు అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఎడమ, కుడి కాలువల గేట్లను ఎత్తివేశారు. గత వారం రోజులుగా పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే నీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు ఆందోళనలు చేపట్టగా.. వారికి బీఆర్ఎస్ నేతలు కూడా మద్దతుగా నిలిచారు. రైతుల డిమాండ్లు మరియు నిరసనలపై స్పందించిన అధికారులు ఎట్టకేలకు నీటిని కిందికి వదిలారు. కాలువల ద్వారా సాగునీరు పారడంతో తమ పంటలను కాపాడుకోవచ్చనే నమ్మకంతో ఆయకట్టు ప్రాంతాల రైతులు తీవ్ర…
ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి నేడే చివరి అవకాశం!!
హైదరాబాద్‌లో 7 దశాబ్దాలుగా విశేష పూజలందుకుంటున్న ఖైరతాబాద్ మహాగణపతి (69 అడుగుల పంచముఖ సంకటహర గణపతి) దర్శనాలకు సమయం ఆసన్నమైంది. ఈరోజు (సెప్టెంబర్ 23, బుధవారం) రాత్రి వరకు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. రేపు (సెప్టెంబర్ 24న) మండపం వద్ద ఏర్పాటు చేసిన షెడ్డు, బ్యారికేడ్లను తొలగించి, శోభాయాత్రకు మరియు నిమజ్జనానికి అవసరమైన రూట్ మార్గాన్ని సిద్ధం చేయనున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా…
‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల వివాదం: హైకోర్టు షాకింగ్ నిర్ణయం..
‘ది ప్యారడైజ్’ సినిమా టికెట్ ధరల పెంపు మరియు ప్రత్యేక షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమోపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరి నిమిషంలో టికెట్ ధరలను పెంచడంపై ప్రశ్నించిన న్యాయస్థానం, ఈ నిర్ణయానికి గల స్పష్టమైన కారణాలను నమోదు చేశారా అని నిలదీసింది. అంతేకాకుండా, ధరల పెంపుపై ప్రజలకు ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆరా తీసింది. సెప్టెంబర్ 20న ప్రభుత్వం ఇచ్చి జీవో మెమోను పునఃపరిశీలించి, దానిని…
మబ్బు పట్టిన ఆకాశం, పలు జిల్లాల్లో అలర్ట్
ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపిస్తున్న వాయుగుండం (దీప్ డిప్రెషన్) ప్రభావంతో రాబోయే 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు తీవ్రతరం కానున్నాయి. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో ఉదయం నుంచే ఈదురుగాలులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే…
గణేష్ రథయాత్ర మార్గంలో బీటీ రోడ్డు పనుల పర్యవేక్షణ
నిజామాబాద్, సెప్టెంబర్ 22:(E6tv NEWS: శివ ఠాకూర్). నగరంలో శుక్రవారం నిర్వహించనున్న సార్వజనిక్ గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని గణేష్ రథయాత్ర సజావుగా సాగేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా గణేష్ రథయాత్ర వెళ్లే మార్గంలోని గుర్బాబాది రోడ్డు – శివాజీ చౌక్ నుంచి రైల్వే గేట్ వరకు చేపడుతున్న బీటీ రోడ్డు పనులను సంబంధిత అధికారులు, 35 వ డివిజన్ బిజెపి కార్పొరేటర్ ఎర్రం సుధీర్ పర్యవేక్షించారు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో…
నిబంధనలు పాటిద్దాం.. ప్రమాదాలను నివారిద్దాం
డ్రైవర్లు, సిబ్బందికి రోడ్ సేఫ్టీపై అవగాహన నిజామాబాద్, సెప్టెంబర్ 23:(E6 tv NEWS: ప్రతినిధి). రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ అధికారులు సూచించారు. నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో డ్రైవర్లు, సిబ్బందికి రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి A.M.V.I. మణికాంత్ ముఖ్య అతిథిగా హాజరై రహదారి భద్రతపై పలు సూచనలు చేశారు. కలెక్టర్ కార్యాలయం నుంచి రోడ్ సేఫ్టీ ఈదార్ మేనేజర్ వర్షా నిహంత్…
నిజాయితీకి పోలీస్‌స్టేషన్‌లో సత్కారం
బంగారు నెక్లెస్‌ను పోలీసులకు అప్పగించిన ముగ్గురికి సీఐ జయనాయక్ ఘన సన్మానంఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నగదు పారితోషికం ధర్మవరం, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి) రోడ్డుపై లభించిన బంగారు నెక్లెస్‌ను పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న ముగ్గురు వ్యక్తులను ధర్మవరం టూ టౌన్ సీఐ జయనాయక్ ఘనంగా సన్మానించారు. ఆటో డ్రైవర్ నరసింహులు, కుమ్మర రామాంజనేయులు, సిద్ధమ్మలను శాలువాలతో సత్కరించి, ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నగదు పారితోషికాన్ని అందజేశారు. వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గం నుంచి…
గ్రామీణ యువ క్రికెటర్లను గుర్తించడమే లక్ష్యం
అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి: మచ్చా రామలింగారెడ్డి అనంతపురం, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రికెట్ ప్రతిభను గుర్తించి, వారికి సరైన శిక్షణ అందించి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రికెటర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) ఆధ్వర్యంలో ‘రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు RDT క్రికెట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న యువ…
శ్రీరామ్‌కు ఆత్మీయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్
రాప్తాడు, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడులో స్వర్గీయ నందమూరి తారక రామారావు, పరిటాల రవీంద్ర విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం పరిటాల శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా కేక్ కట్ చేయించి శ్రీరామ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ్ పట్ల తనకున్న ఆత్మీయతను చాటుకుంటూ ప్రేమపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు.అనంతరం మంత్రి నారా లోకేష్‌కు వీడ్కోలు పలికే సమయంలో…
బీఎస్పీ జిల్లా కార్యదర్శిగా మాల్యవంతం రాంప్రసాద్
ధర్మవరం, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి) బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శిగా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలానికి చెందిన బహుజన నాయకుడు మాల్యవంతం రాంప్రసాద్ నియమితులయ్యారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ మార్గదర్శకత్వంలో జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్ ఈ నియామకాన్ని ప్రకటించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్, రాష్ట్ర…
