Breaking News

ఏషియన్ గేమ్స్‌లో మీరాబాయి చాను రజత పతకం…

టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత్ స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఏషియన్ గేమ్స్‌లో రజత పతకంతో మెరిసింది. జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల 49 కేజీల విభాగంలో ఆమె మొత్తం 198 కేజీల బరువు ఎత్తి (స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు) రెండవ స్థానంలో నిలిచింది. 1998లో కర్ణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధించిన తర్వాత, ఆసియా క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు పతకం దక్కడం ఇదే…

Read Full News

దివంగత నేత కుటుంబానికి జనసేన భరోసా: రూ.2.5 లక్షల ఆర్థిక సాయం!

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు మానవత్వాన్ని చాటుకున్నారు. కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామానికి చెందిన జనసేన నాయకుడు అచ్యుతరాయుడు ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందగా, ఆయన నివాసానికి వెళ్లిన జనసేన ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ₹1 లక్ష, గోపాలపురం నేత దిరిశిన ఫాతిమారాణి ₹50 వేలు, కొవ్వూరు ఇన్ ఛార్జ్ టి.వి. రామారావు మరియు…

Read Full News

జూరాలకు నీటి విడుదలకు కర్ణాటక సీఎం సానుకూలత!

అంతర్రాష్ట్ర జల వివాదాలు, నీటి ఎద్దడి పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ బృందం కర్ణాటకలో పర్యటించింది. తెలంగాణ మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌తో మరోసారి కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్-నినో ప్రభావంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లాలో నెలకొన్న తీవ్ర తాగు, సాగునీటి ఎద్దడిని, పంటల ప్రస్తుత పరిస్థితిని తెలంగాణ బృందం సీఎం డి.కె. శివకుమార్‌కు వివరించింది. మానవతా దృక్పథంతో ఆల్మట్టి డ్యామ్ నుంచి…

Read Full News

ఫేమస్ అయ్యాక గిరాకీ తగ్గిందా? సంపాదనపై నోరు విప్పిన కుమారి ఆంటీ!

హైదరాబాద్‌కు చెందిన సోషల్ మీడియా సెలబ్రిటీ కుమారి ఆంటీ (దాసరి సాయికుమారి) తన బిజినెస్, రోజువారీ ఆదాయం మరియు వ్యక్తిగత విషయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మీది మొత్తం 1000 అయింది.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా” అనే డైలాగ్‌తో పాపులర్ అయిన ఆమె, తాను వైరల్ కాకముందే వ్యాపారం మరింత బాగా జరిగేదని పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. గతంలో తన హోటల్‌కు రోజుకు 1,500 మంది వరకు కస్టమర్లు వచ్చేవారని,…

Read Full News

నర్సింగ్ విద్యార్థిని మిస్టరీ మరణం: వెలుగులోకి తల్లి అనుమానాలు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని హరిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బిఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న హరిణి, సెలవుల నిమిత్తం రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. మంగళవారం రాత్రి ఆమె తల్లి రాజేశ్వరి బంధువుల ఇంటికి వెళ్లడంతో హరిణి ఒక్కతే ఇంట్లో ఉంది. రాత్రి రాజేశ్వరి ఇంటికి తిరిగి వచ్చేసరికి హరిణి కనిపించకపోవడంతో, స్థానికుల సహాయంతో వెతకగా…

Read Full News

భద్రాచలం రామాలయ అభివృద్ధి పనుల పరిశీలన:మంత్రి పొంగులేటి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి పనులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి, ఎంపీకి ఆలయ అధికారులు మంగళ వాయిద్యాలు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు వారికి శాలువాలతో సత్కరించి ఆశీర్వచనం అందజేశారు. వర్షం పడుతున్నప్పటికీ లెక్కచేయకుండా,…

Read Full News

బ్రెజిల్‌లో సీరియల్ కిల్లర్ అరెస్ట్:లేడీ గెటప్‌లో హత్య

బ్రెజిల్‌లో వరుస హత్యలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఓ డేంజరస్ సీరియల్ కిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరైబా రాష్ట్రానికి చెందిన జొర్లాన్ లోప్స్ డ సిల్వా (33) అనే వ్యక్తి గత మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా 16 మందిని దారుణంగా హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. అతడి సన్నటి శరీరాకృతి కారణంగా స్థానికులు అతడిని ‘మస్కిటో’ (దోమ) అని పిలిచేవారు. మారుమూల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే జొర్లాన్, నేరం చేసిన వెంటనే…

Read Full News

పోచారంలో ఆరుగురికి రోల్‌బ్యాక్ పెన్షన్ల పంపిణీ

పోచారం, సెప్టెంబర్ 22: (E6tv NEWS: ప్రతినిధి). పోచారం గ్రామంలో సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ ఆధ్వర్యంలో రోల్‌బ్యాక్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గతంలో పెన్షన్ పొందుతూ, వివిధ కారణాలతో నిలిచిపోయిన ఆరుగురు అర్హులైన లబ్ధిదారులకు తిరిగి పెన్షన్లు మంజూరు కాగా, వాటిని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెన్షన్లకు సంబంధించిన సమస్యలను…

Read Full News

‘శాప్’ ఘటనపై జగన్‌ను అరెస్టు చేయాలని:బుద్దా వెంకన్న

విజయవాడలోని శాప్ (SAAP) కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు అరాచకం సృష్టించారని, దేవుడు ఇచ్చిన ఉద్యోగాలను కష్టపడి సాధించుకున్న ఉపాధ్యాయులపై దాడులు చేయించడం నీచమైన చర్య అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు వంటి నాయకులు ఆకు రౌడీల్లా వ్యవహరిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ… నాటి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన రౌడీల్లో…

Read Full News

వర్షాల ధాటికి చార్మినార్‌ పెచ్చులు ఊడిపడటం: తప్పిన ముప్పు!

హైదరాబాద్‌లోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చారిత్రక కట్టడం చార్మినార్‌పై పెచ్చులు ఊడిపడటంతో అధికారులు తీవ్ర అప్రమత్తమయ్యారు. నగరంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. చార్మినార్‌లోని లాడ్ బజార్ వైపు ఉన్న మినార్ పైభాగంలో కాంక్రీట్, సున్నపు పూత దెబ్బతిని కింద పడిపోయింది. వర్షాల ధాటికి సున్నపు పూత తేలిపోయి ఇప్పటికే ఉబ్బిపోవడాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది, కింద పడిన పెచ్చులను వెంటనే అక్కడి…

Read Full News