News
ఏపీలో నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’: సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహణ
కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ధ్యేయంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. కార్యక్రమంలోని ముఖ్య అంశాలు:
పీఎం మోదీ 76వ పుట్టినరోజు: ‘ఆశీర్వాద్ కా దియా’ ప్రత్యేక పాట విడుదల
ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజును, అలాగే ఆయన ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఆశీర్వాద్ కా దియా’ (Ashirwad Ka Diya) అనే ప్రత్యేక పాటను విడుదల చేశారు. ప్రముఖ సంగీత కళాకారులు అమన్ పంత్, స్నేహా శంకర్ ఈ గీతాన్ని రూపొందించారు. పాట ప్రత్యేకతలు:
కేసీఆర్ ఆస్తులపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్
మాజీ సీఎం కేసీఆర్ ఆస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. సిట్టింగ్ జడ్జితో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరి ఆస్తులపై విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. ఆరోపణలు నిజమని తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉందంటూ ఇన్నాళ్లూ తప్పుడు ప్రచారం చేసి, అసెంబ్లీలో మాత్రం 67 ఎకరాలు…
ఆర్థిక వృద్ధిలో రికార్డు.. సెమీకండక్టర్ రంగంలో భారత్ దూకుడు: ప్రధాని నరేంద్ర మోదీ
ప్రపంచవ్యాప్తంగా క్లిష్ట ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత బలంగా పుంజుకుంటోందని, దేశంపై అంతర్జాతీయ సమాజానికి విశ్వాసం గణనీయంగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ‘సెమీకాన్ ఇండియా 2026’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్య విశేషాలు: ‘సెమీకాన్ 2.0’ – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు:
స్థానిక సంస్థల ఎన్నికలపై అఖిలపక్ష సమావేశం
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారుల చర్చ శ్రీ సత్యసాయి జిల్లా, చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియపై అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు. మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లకు సంబంధించిన అంశాలపై సమావేశంలో ప్రధానంగా…
ప్రజా పాలన దినోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి: 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే తెలంగాణ లక్ష్యం
హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ అధికారిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి అణచివేత, భూస్వామ్య దోపిడీపై పోరాడి ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లో పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించిన సీఎం, ప్రజలకు శుభాకాంక్షలు…
ఇంధన పొదుపే మరో విద్యుత్ కేంద్రం: CII సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!
విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతో పాటు ఇంధన వినియోగంలో పొదుపు పాటించడం ద్వారానే పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన 25వ CII ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్-2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం అంటే మరో కొత్త విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పడంతో సమానమని పేర్కొన్నారు. సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ఇంధన వినియోగంలో మరింత…
అత్తాపూర్‌లో అర్ధరాత్రి పోకిరీల హల్చల్..
హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిగల చింతల్మెట్ డీమార్ట్ చౌరస్తా వద్ద అర్ధరాత్రి వేళ పోకిరీల ఆగడాలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మోడిఫైడ్ కార్లతో మైనర్ యువకులు రోడ్లపై అతివేగంగా నడుపుతూ, ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు నిరంతరం ‘చబుత్రా మిషన్’తో పాటు అర్ధరాత్రి వాహన తనిఖీలు చేపడుతున్నప్పటికీ ఈ పోకిరీల హంగామా ఆగడం లేదని, అధికారుల పర్యవేక్షణ లోపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలకు ముప్పు…
కారులో పవర్ బ్యాంక్ పేలుడు: తృటిలో తప్పించుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు వెళ్తుండగా డోర్నకల్ ఎమ్మెల్యే రామ్‌చందర్ నాయక్‌కు ప్రమాదం తృటిలో తప్పిపోయింది. మహబూబాబాద్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తుండగా, చింతపల్లి గ్రామం సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనంలో ఉన్న పవర్ బ్యాంక్ అకస్మాత్తుగా పేలిపోవడంతో కారు కేబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎమ్మెల్యేను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం రామ్‌చందర్ నాయక్ మరొక వాహనంలో మహబూబాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.
కరీంనగర్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక హామీ.. డంపింగ్ యార్డ్ పనులకు త్వరలోనే టెండర్లు!
కరీంనగర్ నగర అభివృద్ధిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. నగరంలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న డంపింగ్ యార్డ్ పనులకు మరో వారం రోజుల్లో రూ.16 కోట్ల స్వచ్ఛ భారత్ నిధులతో టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) కింద మంజూరైన రూ.840 కోట్లలో మరో రూ.80 కోట్లను ప్రత్యేకంగా ఈ డంపింగ్ యార్డ్ ఆధునీకరణకే వెచ్చిస్తామని వెల్లడించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్,…
