News
భీంగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
సంక్షేమ సమస్యలపై ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి భీంగల్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని భీంగల్ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే ఎంపీడీవో కార్యాలయంలోని ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల…
ప్రతిభ ఉన్న క్రికెటర్లను గుర్తించి ప్రోత్సహిస్తాం
పెనుకొండలో క్రీడా సంస్కృతికి సుదీర్ఘ చరిత్ర ఉంది ఆర్డీటీ క్రికెట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి అనంతపురం, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రికెట్ ప్రతిభను గుర్తించి, యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) ఆధ్వర్యంలో రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్డీటీ క్రికెట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో…
హంద్రీ–నీవా కుడి కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలి
పేరూరు డ్యాంకు నీరు అందించాలి – జలదీక్షలో జడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అనంతపురం, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).హంద్రీ–నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) పీఏబీఆర్ కుడి కాలువ కింద ఉన్న చెరువులకు, పేరూరు డ్యాంకు వెంటనే నీటిని విడుదల చేయాలని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ డిమాండ్ చేశారు. రైతుల సాగునీటి హక్కుల కోసం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహ దినమే
తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడాలి: పీడీఎస్‌యూ బోధన్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు ముమ్మాటికీ విద్రోహ దినమేనని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో నేటి విద్యారంగ సమస్యలపై విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలోని మధుమలంచ జూనియర్ కళాశాలలో పీడీఎస్‌యూ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో “1948 సెప్టెంబర్ 17 విద్రోహ దినం” సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
హైదరాబాద్ నిమ్స్‌లో పీజీ డాక్టర్‌కు ప్రాణహాని హెచ్చరికలు: విధులు బహిష్కరించిన ఆర్‌డీఏ!
హైదరాబాద్‌లోని ప్రముఖ నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై దాడికి యత్నించి, చంపుతామని బెదిరించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు నిరసనగా నిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (RDA) గురువారం నుంచి అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని విధులను బహిష్కరిస్తూ ఆందోళన బాట పట్టింది. అసలేం జరిగింది? ఆర్‌డీఏ డిమాండ్లు: డాక్టర్ల నిరసనతో ఆసుపత్రి యాజమాన్యం స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. గతంలో జరిగిన…
ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో మంత్రి సవిత
పెనుకొండ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు పెనుకొండ, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖల మంత్రి సవిత ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేక్ కట్ చేసి ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నరేంద్ర మోదీ 1950 సెప్టెంబర్ 17న జన్మించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక వివరాలు పేర్కొంటోంది. ప్రధాని…
మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్ కుటుంబానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పరామర్శ
డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్‌తో కలిసి కుటుంబ సభ్యులకు సానుభూతి మద్నూర్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్ వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గురువారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మద్నూర్ మండల కేంద్రంలోని ప్రజ్ఞ కుమార్ స్వగృహానికి వెళ్లిన ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని…
CMR సమస్యలు పరిష్కరించాలి
బాన్సువాడ డివిజన్ రైస్ మిల్లర్ల నిరవధిక బంద్‌కు పిలుపు.. MROకు వినతిపత్రం బాన్సువాడ, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) డెలివరీల్లో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాన్సువాడ డివిజన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు మిల్లింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి…
విశ్వకర్మ భగవానుడి స్ఫూర్తితో వృత్తిదారుల సంక్షేమం
విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా మంత్రి సవిత ఘన నివాళులు పెనుకొండ, సెప్టెంబర్ 17: (E6tv NEWS: ప్రతినిధి) విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖల మంత్రి సవిత విశ్వకర్మ భగవానుడికి ఘన నివాళులు అర్పించారు. శిల్పులు, వృత్తి నిపుణులు, చేతివృత్తిదారులు, కార్మికులకు విశ్వకర్మ భగవానుడు ఆరాధ్య దైవమని ఆమె పేర్కొన్నారు. విశ్వకర్మ భగవానుడి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం అభినందనీయమని మంత్రి తెలిపారు. విజయవాడలో రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు….
తిరుమల బ్రహ్మోత్సవాల్లో కళాకారుల ఆధ్యాత్మిక కోలాహలం
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం నిర్వహించిన ‘సింహ వాహన సేవ’లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 500 మంది కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యాంశాలు: శ్రీవారి సేవలో భాగస్వాములైన కళాకారుల ప్రదర్శనలతో తిరుమల మాడ వీధులు సాంస్కృతిక హరివిల్లును తలపించాయని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
