Breaking News

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జనసేన నాయకుడికి ఘన సన్మానం

మెట్‌పల్లి, అక్టోబర్ 16 (E6tv న్యూస్): మెట్‌పల్లి పట్టణంలోని వాసవీమాత ఆలయంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జనసేన పార్టీ కోరుట్ల నియోజకవర్గ సీనియర్ నాయకులు గంగం అజయ్ కుమార్‌కు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మైలారపు రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం పెద్దలు మాట్లాడుతూ.. గంగం అజయ్ కుమార్ ఎల్లప్పుడూ ఆర్యవైశ్య సంఘానికి, వాసవీమాత ఆలయ అభివృద్ధికి అండగా నిలుస్తున్నారని కొనియాడారు….

Read Full News

పలు అమ్మవారి మండపాలను సందర్శించిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, అక్టోబర్ 16 (E6 న్యూస్ ప్రతినిధి). దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా పటాన్‌చెరు పట్టణంలోని పలు అమ్మవారి మండపాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎండీఆర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు మాద్రి పృథ్వీరాజ్ సందర్శించారు. శ్రీరామ్ నగర్, శివాలయంతో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాద్రి…

Read Full News

మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రగాఢ సంతాపం

మెట్‌పల్లి, అక్టోబర్ 16 (E6tv న్యూస్): మెట్‌పల్లి పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు జంగం విజయ్ అనారోగ్యంతో కన్నుమూశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో మెట్‌పల్లి పాత్రికేయ రంగంలో విషాదం నెలకొంది.సుదీర్ఘకాలంగా పాత్రికేయ రంగంలో సేవలందించిన జంగం విజయ్ మృతి పట్ల జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహచర పాత్రికేయుడిని కోల్పోవడం బాధాకరమని, ఆయన…

Read Full News

రైతుల విద్యుత్ కష్టాలకు చెక్‌ పెట్టే దిశగా అడుగులు!

₹10.30 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లు.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు భూమిపూజ జుక్కల్, అక్టోబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి). రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు, వ్యవసాయ పనులకు విద్యుత్ అంతరాయాల వల్ల ఇబ్బందులు కలగకుండా చూడటమే లక్ష్యంగా జుక్కల్ నియోజకవర్గంలో కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బ్రాహ్మణ్‌పల్లి–ఆరేపల్లి, కాటేపల్లి, లచ్చన్, తడ్గూర్ గ్రామాల్లో మొత్తం రూ.10.30 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లకు జుక్కల్…

Read Full News

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా.. అవాంఛనీయ ఘటనలకు అడ్డుకట్ట పుట్టపర్తి, అక్టోబర్ 16 (E6tv NEWS). శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని హిందూపురం, పెనుకొండ, మడకశిర, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల వద్ద విస్తృత పోలీసు బందోబస్తు…

Read Full News

ఏసీబీ పంజా: లంచం తీసుకుంటూ పట్టుబడిన ముగ్గురు అధికారులు

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ముగ్గురు ప్రభుత్వ అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ప్రభుత్వ సేవలు అందించడానికి లంచాలు డిమాండ్ చేసే అధికారులపై ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తుండడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది.

Read Full News

ప్రకృతి ఒడిలో బతుకమ్మ సందడి!

పోచారం ప్రాజెక్టు గట్టుపై పూల బతుకమ్మలు పేర్చిన చిన్నారులు.. కనువిందు చేసిన ప్రకృతి అందాలు ఎల్లారెడ్డి, అక్టోబర్ 16 (E6tv NEWS). తెలంగాణ ఆడపడుచుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేళ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద ఆహ్లాదకరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రకృతి ఒడిలో పూల బతుకమ్మలను పేర్చుతూ చిన్నారులు, యువతులు సందడి చేశారు. పోచారం ప్రాజెక్టు పరిధిలోని పోచమ్మరాల్ గ్రామానికి చెందిన చిన్నారులు, యువతులు శుక్రవారం తెల్లవారుజామున ప్రాజెక్టు…

Read Full News

రుద్రూరులో మెగా వైద్య శిబిరం.. ఉచితంగా వైద్య పరీక్షలు, మందుల పంపిణీ

రక్తదాన శిబిరానికి స్పందించిన పలువురు దాతలు రుద్రూరు, సెప్టెంబర్ 16 (E6 న్యూస్: ప్రతినిధి). నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల ఆధ్వర్యంలో, గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు….

Read Full News

డాక్టర్ ఎంఏ హకీమ్ సేవలు అద్భుతం.. పేదలకు అండగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్న సామాజిక కార్యకర్త

ఆడపిల్ల పుట్టిన తల్లులకు రూ.5 వేల ఆర్థిక సాయం, దుస్తులు, తల్లి కిట్‌ అందజేత పోతంగల్, అక్టోబర్ 16: (E6 న్యూస్ ప్రతినిధి). పేదల సంక్షేమమే లక్ష్యంగా, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ ఎంఏ హకీమ్ అందిస్తున్న సేవలపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పార్టీలకు అతీతంగా, కులమతాలకతీతంగా, చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారని స్థానికులు కొనియాడుతున్నారు. నిజామాబాద్ జిల్లా…

Read Full News

పటాన్‌చెరులో అండర్‌-17 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం

ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ పటాన్‌చెరు, అక్టోబర్ 15 (E6tv ప్రతినిధి). పటాన్‌చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) అండర్‌-17 బాలబాలికల రాష్ట్రస్థాయి రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని 10 ఉమ్మడి…

Read Full News