Breaking News

ఎల్లారెడ్డిలో ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

యువతకు కలాం జీవితం స్ఫూర్తిదాయకం దేశ రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాలకు ఆయన సేవలు చిరస్మరణీయం ఎల్లారెడ్డి, అక్టోబర్ 15 (E6tv న్యూస్). మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఎల్లారెడ్డి పట్టణంలోని గ్రంథాలయంలో బహుజనుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. దేశ రక్షణ, అంతరిక్ష పరిశోధన, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి డాక్టర్…

Read Full News

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడు కాలే పండురంగకు శిక్ష.. రూ.5 వేల జరిమానా విధించిన ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం నిజామాబాద్, అక్టోబర్ 15 (E6tv న్యూస్: శివ ఠాకూర్). మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు కాలే పండురంగకు న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి దుర్గాప్రసాద్ తీర్పు వెలువరించారు. నిందితుడికి జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా కూడా విధించారు. 2021లో నమోదైన కేసు…..

Read Full News

బాన్సువాడలో బతుకమ్మ సంబరాలు.. 31 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు

నర్సింగ్ కళాశాల విద్యార్థినులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, అక్టోబర్ 15 (E6tv న్యూస్). బాన్సువాడ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీతో పాటు బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా నిర్వహించారు. బాన్సువాడ పట్టణానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం తన నివాసంలో మంజూరు పత్రాలను అందజేశారు. నిరుపేదల సొంతింటి కలకు మరో అడుగు.. ఇందిరమ్మ ఇళ్ల…

Read Full News

పండుగల వేళ మానవీయ సేవ.. మున్సిపల్ సిబ్బందికి, గ్రామ ప్రజలకు నూతన వస్త్రాల పంపిణీ

పటాన్‌చెరు, అక్టోబర్ 15 (E6 న్యూస్ ప్రతినిధి). బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు, ఆయన సతీమణి పద్మ మానవీయ సేవను చాటుకున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పటాన్‌చెరు సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బందికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అదేవిధంగా ఉస్మాన్ నగర్ గ్రామ ప్రజలకు కూడా నూతన వస్త్రాలను అందజేశారు.పండుగల వేళ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో…

Read Full News

విద్యుత్‌, వ్యవసాయ రంగాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ విమర్శ ఎల్లారెడ్డి, అక్టోబర్ 15 (E6 టీవీ న్యూస్). విద్యుత్‌, వ్యవసాయ రంగాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ విమర్శించారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.తక్కువ వోల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని, విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలతో పంటలు ఎండిపోయే పరిస్థితులు…

Read Full News

మార్కండేయ మందిర పునర్నిర్మాణానికి తొలి అడుగు

ఆలయాన్ని సందర్శించి అంచనాల తయారీకి కొలతలు తీసుకున్న దేవాదాయ శాఖ అధికారులు బాల్కొండ, అక్టోబర్ 15: (E6 టీవీ న్యూస్). బాల్కొండ మండల కేంద్రంలో వేలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక శోభను చాటుతున్న మార్కండేయ మందిర పునర్నిర్మాణ పనులకు సంబంధించి అధికారులు తొలి అడుగు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ నిజామాబాద్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) రమేష్, స్థపతి వెంకటేష్ ఆలయాన్ని సందర్శించారు.ఆలయంలోని విగ్రహాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించి, పునర్నిర్మాణ పనులకు…

Read Full News

బాధితురాలి వైద్య చికిత్సకు రూ. 2 లక్షల ఎల్‌ఓసీ అందజేత

జాన జమునకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచన వేల్పూర్, సెప్టెంబర్ 15: (E6 టీవీ న్యూస్). అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన జాన జమున వైద్య ఖర్చుల నిమిత్తం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ. 2 లక్షల ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. ఈ మేరకు ఎల్‌ఓసీ పత్రం కాపీని వేల్పూర్‌లో బాధితురాలి కుటుంబ…

Read Full News

అచ్చంపేట, మల్లూరు PACS చైర్మన్ల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

రైతు సంక్షేమం, సహకార రంగ అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నిజాంసాగర్, అక్టోబర్ 15 (E6 టీవీ న్యూస్). కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, మల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) నూతన చైర్మన్ల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం గోర్గల్ సొసైటీ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట PACS చైర్మన్‌గా పట్లోళ్ల జనార్దన్ రెడ్డి, మల్లూరు PACS చైర్మన్‌గా భుజంగారి వినోద వెంకట్రామిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు….

Read Full News

రాయసముద్రం చెరువు బతుకమ్మ ఘాట్‌లో బురద, చెత్తాచెదారం!

అధికారుల నిర్లక్ష్యంపై మహిళల ఆవేదన.. రెండు రోజుల్లో శుభ్రం చేయకపోతే ధర్నా చేస్తాం: మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య రామచంద్రపురం, అక్టోబర్ 14 (E6 న్యూస్ ప్రతినిధి) రామచంద్రపురంలోని రాయసముద్రం చెరువు వద్ద ఉన్న బతుకమ్మ ఘాట్ బురద, చెత్తాచెదారంతో అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘాట్‌ను పట్టించుకునే వారే కరువయ్యారని మహిళలు వాపోతున్నారు. ఇటీవల పోచమ్మ గుడిలో నిర్వహించిన దుర్గామాత అన్నదాన కార్యక్రమం సందర్భంగా మహిళలు ఈ సమస్యను మాజీ కార్పొరేటర్ తొంట…

Read Full News

వర్ని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు

రూ.10.70 కోట్లతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం వర్ని, అక్టోబర్ 14 (E6tv NEWS: శివ ఠాకూర్) కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నూతనంగా నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రూ.10 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రిని బుధవారం ఆయన…

Read Full News