Adilabad
ఆర్టీసీ బస్సులో భద్రత గాలికేనా..?
బాన్సువాడ డిపో ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రమాదకర పరిస్థితులు TS16UC3338 బస్సు లో ఉన్న ప్రయాణికుల ఆందోళన.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ నిజామాబాద్ ఆగస్టు 31:(E6tv NEWS: శివ ఠాకూర్). ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ బస్సుల్లోనే భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాన్సువాడ డిపోకు చెందిన TS16UC3338 ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణికులకు ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఉన్నాయంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సులో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు కాలు పెట్టే ప్రదేశాల్లో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయని,…
మానాల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాన్ని పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
మూడు నెలల్లో మిగిలిన పనులు పూర్తి చేయాలి: ఇంజనీరింగ్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం విశాలమైన భవనంలోకి పాఠశాలను తరలిస్తే విద్యార్థులకు మెరుగైన వసతులు గిరిజన విద్యార్థులకు ఎంతో ప్రయోజనం: వేముల ప్రశాంత్ రెడ్డి మానాల,ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి) మానాల మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నూతన భవన నిర్మాణ పనులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతుండటంపై ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారుభవన…
SIR ఫేజ్–2పై BLAలు, సూపర్వైజర్లకు శిక్షణ
మోర్తాడ్, ఆగస్టు 30:(E6tv NEWS: ప్రతినిధి). బాల్కొండ నియోజకవర్గ స్థాయి BLAలు (బూత్ లెవెల్ ఏజెంట్లు), BLA సూపర్వైజర్లకు SIR ఫేజ్–2పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని RNB ఫంక్షన్ హాల్‌లో ఈ సమావేశం జరిగింది.కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, SIR ఇంచార్జ్ ఊట్ల వరప్రసాద్ హాజరై BLAలు, సూపర్వైజర్లకు SIR ప్రక్రియపై అవగాహన కల్పించారు. SIR ఫేజ్–2లో భాగంగా నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు BLO…
ఇరిగేషన్ జాగా కబ్జాపై అధికారుల చర్యలు
కబ్జా చేసిన స్థలంలో అక్రమ నిర్మాణాలు నిలిపివేత స్థలం ఖాళీ చేయకపోతే రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారంతో కఠిన చర్యలు ఇరిగేషన్ ఏఈ రవికుమార్ హెచ్చరిక రుద్రూర్, ఆగస్టు 30:(E6tv NEWS ప్రతినిధి).నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సులేమాన్ ఫారం గ్రామంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న ఇరిగేషన్ శాఖ ఏఈ రవికుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని…
చెన్నమ్మ కోరి దేవస్థానంలో భక్తుల సందడి
మద్నూర్, ఆగస్టు 29:(E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం కుర్చీర్ గ్రామంలోని కోడిచీర శివారులో వెలసిన చెన్నమ్మ కోరి దేవస్థానంలో శ్రావణ శనివారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. చిన్న ఎక్లార గ్రామస్తులు, భక్తుల ఆధ్వర్యంలో దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు దేవస్థానానికి చేరుకుని చెన్నమ్మ కోరి అమ్మవారిని దర్శించుకుని…
ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు అవగాహన
నిర్మల్, ఆగస్టు 30: (E6tv NEWS: ప్రతినిధి) నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవారపేట మోచి సంఘంలో ఎస్‌ఐఆర్ (SIR) ఫామ్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ కత్తి నరేందర్, బీఎల్‌ఓ ఇంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఓటర్లు తమకు అందిన నోటీసుతో పాటు, పాత ఓటర్ జాబితా లేదా 2002…
కొత్త పంటల రాక సందర్భంగా ఆదివాసీల ‘నవ్వోంగ్ పూజ’ సంబరాలు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఆదివాసీ మెస్రం వంశీయులు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (సర్ప దేవుడు) సమక్షంలో సాంప్రదాయ ‘నవ్వోంగ్ పూజ’ (కొత్తపంటల పండుగ) ను శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తోలకరి పంటలైన సామలు, పెసర్లు చేతికి వచ్చిన శుభసమయంలో ఈ పండుగను జరుపుకోవడం వారి సాంప్రదాయం. పూజా విశేషాలు & సాంప్రదాయం:
ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు అవగాహన కల్పించిన నిర్మల్ రూరల్ ఎంఆర్‌ఓ రాజు
నిర్మల్,ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి).ఎస్‌ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు నిర్మల్ రూరల్ ఎంఆర్‌ఓ రాజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం వైయస్సార్ కాలనీలో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై వివరించారు. నోటీసులకు ఆధారాలు జత చేయాలి ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంఆర్‌ఓ రాజు తెలిపారు. నోటీసుతో పాటు తమ వద్ద ఉన్న…
రూ.30 లక్షలతో ఐకేపీ గోడౌన్ నిర్మాణానికి భూమిపూజ
మారుమూల గ్రామాల్లో ధాన్యం నిల్వకు ఉపయోగకరం – సర్పంచులు, తండా పెద్దమనుషులు మానాల, ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి). ఉమ్మడి మానాల గ్రామపంచాయతీ పరిధిలోని స్కూల్ తండా గ్రామపంచాయతీలో రూ.30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఐకేపీ గోడౌన్‌కు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి మానాల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, తండా పెద్దమనుషులు, ప్రజాప్రతినిధులు కలిసి భూమిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో గోడౌన్ల నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కొనుగోలు…
ఏర్గట్లలో వైభవంగా జంధ్యాల పౌర్ణమి వేడుకలు
శాస్త్రోక్తంగా నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం జంధ్యాల పౌర్ణమి వేడుకలు ఏర్గట్ల, ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి). బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండల కేంద్రంలో శ్రీ శివమార్కండేయ మాతృ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జంధ్యాల పౌర్ణమి (నూతన యజ్ఞోపవీత ధారణ) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ…

