పటాన్చెరు, అక్టోబర్ 15 (E6 న్యూస్ ప్రతినిధి).
బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు, ఆయన సతీమణి పద్మ మానవీయ సేవను చాటుకున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పటాన్చెరు సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బందికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అదేవిధంగా ఉస్మాన్ నగర్ గ్రామ ప్రజలకు కూడా నూతన వస్త్రాలను అందజేశారు.పండుగల వేళ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పర్స శ్యామ్ రావు దంపతులు తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని, పరస్పర ప్రేమాభిమానాలు, ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది, బిల్ కలెక్టర్లు, ఉస్మాన్ నగర్ గ్రామ ప్రజలకు బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో పండుగలను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.పండుగల సందర్భంగా నూతన వస్త్రాలు అందజేయడంపై మున్సిపల్ సిబ్బంది, బిల్ కలెక్టర్లు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పర్స శ్యామ్ రావు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.



