Breaking News

బంజారా తండాలో విద్యుత్ సమస్యకు పరిష్కారం

సర్పంచ్ ధరావత్ సురేష్ చొరవతో నూతన 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్లారెడ్డి,అక్టోబర్ 10 (E6tv News): నాగిరెడ్డిపేట మండలంలోని బంజారా తండా గ్రామంలో గత కొంతకాలంగా నెలకొన్న విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామ సర్పంచ్ ధరావత్ సురేష్ చొరవతో విద్యుత్ అధికారులు గ్రామపంచాయతీ పరిధిలో నూతన 25 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. గ్రామంలో విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సర్పంచ్ ధరావత్ సురేష్ విద్యుత్ అధికారుల దృష్టికి…

Read Full News

చలో నిర్మల్” భారీ ర్యాలీలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి

CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి – కాంగ్రెస్ నాయకుల డిమాండ్ నిర్మల్, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “చలో నిర్మల్ – సేవ్ డెమోక్రసీ” నిరసన ర్యాలీలో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు. AICC పిలుపు మేరకు, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్మల్‌లో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్ DCC అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే…

Read Full News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత

మేయర్ ఎన్నికల్లో 35.29 శాతం రిజర్వేషన్లు – మంత్రి అచ్చెన్నాయుడు పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడి అమరావతి, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి). ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మున్సిపల్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీసీలకు కల్పించనున్న రిజర్వేషన్ల శాతాలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని…

Read Full News

పోషణ మాసం కార్యక్రమంలో ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా జ్యోతి అక్క స్వామికి అవార్డు

మోర్తాడ్, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్ జిల్లా స్థాయిలో నిర్వహించిన పోషణ మాసం–2026 కార్యక్రమంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గం, మోర్తాడ్ మండలానికి చెందిన అంగన్వాడీ టీచర్ జ్యోతి  ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా అవార్డు అందుకున్నారు. అంగన్వాడీ సేవల్లో ఆమె అందిస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును జడ్జి ప్రదానం చేశారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, గర్భిణులు, బాలింతల సంక్షేమం, పిల్లల ఎదుగుదలకు సంబంధించిన కార్యక్రమాల అమలులో అంగన్వాడీ టీచర్ల పాత్ర ఎంతో కీలకమైనది. ఈ నేపథ్యంలో…

Read Full News

ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి ఫిర్యాదు

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన విపక్ష నేతలు న్యూఢిల్లీ, అక్టోబర్ 10: (E6tv NEWS). ఎన్నికల సంఘంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ ఇండియా కూటమి అగ్రనేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ మేరకు ఎన్నికల సంఘంపై తమ అభ్యంతరాలను వివరిస్తూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) ఎంపీ సుప్రియా…

Read Full News

ఏపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు రూ.25 లక్షల టోకరా!

తమది కాని భూమిని తమదిగా నమ్మించి మోసం చేసిన తండ్రీకొడుకులు భూమి విక్రయిస్తామంటూ అడ్వాన్స్ తీసుకుని మోసం.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఎమ్మెల్సీ ఫిర్యాదు హైదరాబాద్, అక్టోబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యను భూమి కొనుగోలు వ్యవహారంలో మోసగించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. మాదాపూర్‌లోని 100 ఫీట్ రోడ్డులో తమకు 5.5 ఎకరాల భూమి ఉందని నమ్మించి, విక్రయిస్తామంటూ రూ.25 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ఏపీ…

Read Full News

ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం,నేతలు

తెలంగాణ సంస్కృతికి, ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఎంగిలిపూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమైంది. ఈ తొమ్మిది రోజుల పాటు సాగే రాష్ట్ర ప్రజల అత్యంత ప్రియమైన పూల పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖ నాయకులు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు మహిళలు ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలను వైభవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వివిధ…

Read Full News

దళారుల నుంచి రైతులను కాపాడండి

సిండికేట్‌గా ఏర్పడి బయటి వ్యాపారులకు బెదిరింపులు.. గిట్టుబాటు ధరకు గండి రుద్రూరు, అక్టోబర్ 10 (E6 NEWS: ప్రతినిధి). పంటకు గిట్టుబాటు ధర లభిస్తుంటే కొందరు దళారులు సిండికేట్‌గా ఏర్పడి అడ్డంకులు సృష్టిస్తున్నారని, బయటి ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులను బెదిరిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని రుద్రూరుకు చెందిన రైతు బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా రైతు బాబు మాట్లాడుతూ.. తాను…

Read Full News

మాసానిపల్లిలో చిరుత భయం.. ఆందోళనలో గ్రామస్తులు

రెండు మేకలపై దాడి చేసినట్లు స్థానికుల వెల్లడి గుట్ట సమీపంలో చిరుత పాదముద్రలు ఉన్నాయని సమాచారం అటవీశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి నాగిరెడ్డిపేట, అక్టోబర్ 09 (E6tv News). కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాసానిపల్లి గ్రామ సమీపంలోని గుట్ట పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా చిరుత కనిపిస్తున్నట్లు స్థానికులు చెబుతుండటంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. వారం రోజుల క్రితం రెండు మేకలపై చిరుత దాడి…

Read Full News

పల్లెబోగుడా తండాలో ఉద్రిక్తత

అటవీ అధికారులను అడ్డుకున్న గిరిజనులు.. మహిళ ఆత్మహత్యాయత్నం అటవీ భూమి వివాదంతో తండాలో ఉద్రిక్త పరిస్థితులు 14 ఎకరాల భూమి చదును చేసినట్లు ఆరోపణలు, ట్రాక్టర్ల స్వాధీనానికి అటవీ అధికారుల యత్నం పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం నాగిరెడ్డిపేట, అక్టోబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి) కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పల్లెబోగుడా తండాలో అటవీ భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. అటవీ భూమిని చదును చేసేందుకు ఉపయోగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రాక్టర్లను…

Read Full News