Breaking News

బంజారా తండాలో విద్యుత్ సమస్యకు పరిష్కారం

సర్పంచ్ ధరావత్ సురేష్ చొరవతో నూతన 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

ఎల్లారెడ్డి,అక్టోబర్ 10 (E6tv News): నాగిరెడ్డిపేట మండలంలోని బంజారా తండా గ్రామంలో గత కొంతకాలంగా నెలకొన్న విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామ సర్పంచ్ ధరావత్ సురేష్ చొరవతో విద్యుత్ అధికారులు గ్రామపంచాయతీ పరిధిలో నూతన 25 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు.

గ్రామంలో విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సర్పంచ్ ధరావత్ సురేష్ విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజ్ఞప్తికి స్పందించిన అధికారులు నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయడంతో గ్రామస్థులకు ఊరట లభించింది.విద్యుత్ సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన సర్పంచ్ ధరావత్ సురేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు నరేందర్, సత్యనారాయణ, సురేందర్, విట్టల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *