Karimnagar
బొల్లారం చెరువు కట్టపై వ్యక్తి ఆత్మహత్య
నాగిరెడ్డిపేట్, అక్టోబర్ 07 (E6tvNEWS ప్రతినిధి)నాగిరెడ్డిపేట్ మండలం బొల్లారం గ్రామానికి చెందిన నుక్కని పోచయ్య (44) మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే పోచయ్య గత కొంతకాలంగా మద్యానికి బానిసైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో భార్యతో గొడవ జరిగినట్లు సమాచారం. మంగళవారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో బొల్లారం చెరువు కట్టపైకి వెళ్లిన పోచయ్య అక్కడ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు,…
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష
జీరో ఫాటాలిటీ జిల్లాలే లక్ష్యం: ప్రమాద ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి నిర్మల్, అక్టోబర్ 7 (E6tvNEWS: ప్రతినిధి) రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతను మెరుగుపరచడం, జీరో ఫాటాలిటీ జిల్లాల సాధనే లక్ష్యంగా రాష్ట్ర డీజీపీ (HoPF) ఆధ్వర్యంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇళంబరిది పాల్గొని రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయం (DPO) నుంచి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS…
దశలవారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు
ఇండ్ల మంజూరులో దళారులను ఆశ్రయించవద్దు: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైంసా, అక్టోబర్ 7 (E6tv NEWS: ప్రతినిధి). అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని, ఇళ్లు మంజూరు కాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భైంసా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. బుధవారం భైంసా ఎంపీడీవో కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన 175 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…
పట్టణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తాం
పట్టణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తాం మున్సిపల్ సాధారణ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు.. భీంగల్ అక్టోబర్ 7 (E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా భీంగల్ పురపాలక సంఘ కార్యాలయంలో గౌరవ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి అధ్యక్షతన బుధవారం మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి, కౌన్సిల్ సభ్యులు పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ బోదిరే నాగమణి…
కాపు భవన్ నిర్మాణానికి చర్యలు చేపడతాం: హరీష్ బాబు
మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో స్థల పరిశీలన ధర్మవరం, అక్టోబర్ 7 (E6tvNEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో కాపు భవన్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు తెలిపారు. బుధవారం పోతుకుంట రోడ్డులోని డీఎస్పీ గెస్ట్‌హౌస్ సమీపంలో కాపు భవన్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ధర్మవరం శ్రీకృష్ణదేవరాయల బలిజ సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘం…
పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన
ముధోల్, అక్టోబర్ 7 (E6tvNEWS: ప్రతినిధి). ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి వనరులు తగ్గిపోతున్నందున రైతులు పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. ముధోల్ మండలం బోరెగాం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పొలం బడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన స్థానం, ముధోల్ శాస్త్రవేత్త ఆకుల దినేష్ మాట్లాడుతూ… ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలను ఎంపిక…
రైతుల కష్టాలను మాజీ మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్
వర్ని, అక్టోబర్ 7 (E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్ జిల్లా వర్ని మండల పరిధిలోని సిద్దాపూర్ గ్రామంలో నీటి కొరతతో ఎండిపోతున్న వరి పంటలను ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ రెండు రోజుల క్రితం పరిశీలించారు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు ఎత్తిపోతున్నా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో మోరిల్ శ్రీనివాస్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి కొరత,…
జగిత్యాల మెడికల్ కాలేజీలో మౌలిక వసతుల కోసం విద్యార్థుల నిరసన
జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. గత నాలుగేళ్లుగా గోదాం తరహా భవనాల్లోనే నాణ్యమైన తరగతి గదులు, ల్యాబ్‌లు, హాస్టల్, మెస్ సౌకర్యాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఎన్‌ఎమ్‌సీ నిబంధనల ప్రకారం నూతన భవనాల నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. మాతా శిశు ఆసుపత్రి, క్రిటికల్ కేర్ సెంటర్లు కాలేజీకి దూరంగా ఉండటంతో రవాణా సౌకర్యం లేక…
చింతకుంటలో 20 సీసీ కెమెరాలు ప్రారంభం
ప్రజల భాగస్వామ్యంతో గ్రామ భద్రతకు పటిష్ట చర్యలునిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS నిర్మల్ జిల్లా, అక్టోబర్ 07 (E6tv NEWS: ప్రతినిధి)“గ్రామ భద్రత – మనందరి బాధ్యత” అనే నినాదంతో ముధోల్ మండలం చింతకుంట గ్రామంలో ప్రజల సౌజన్యంతో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS బుధవారం ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా గ్రామంలోని…
దసరా, బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
జగిత్యాల, అక్టోబర్ 07 (E6tvNEWS: ప్రతినిధి)దసరా నవరాత్రోత్సవాలు, సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని నంబి వేణుగోపాల చార్య కౌశిక కోరారు. ఈ మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్యప్రణవ్‌ను కలిసి అవసరమైన ఏర్పాట్లపై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 11న శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమై, అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 20న దసరా పండుగ నిర్వహించనున్నట్లు…
