Breaking News

పట్టణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తాం

పట్టణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తాం


మున్సిపల్ సాధారణ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు..

భీంగల్ అక్టోబర్ 7 (E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా భీంగల్ పురపాలక సంఘ కార్యాలయంలో గౌరవ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి అధ్యక్షతన బుధవారం మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి, కౌన్సిల్ సభ్యులు పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.సమావేశంలో పట్టణానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై సభ్యులు చర్చించారు. అనంతరం పలు అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

ఈ సమావేశానికి వైస్ చైర్‌పర్సన్  సంటి లతా నర్సయ్య, కౌన్సిలర్లు ఆరేపల్లి శ్రీజ, పర్స కుశలత, తోట సతీష్, గున్నాల బాలలక్ష్మి, బోదిరే లావణ్య, మహమ్మద్ అంజుమ్ అలీ, మమరి సందీప్, నీలం రవి, సం గ్యా నాయక్, మాలావత్ మల్లెల అనుపమతో పాటు మున్సిపల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *