Khamam
రూ.23.35 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
గోదావరి పుష్కరాల పనులతో పాటు రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలు, ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణానికి శ్రీకారం నిర్మల్, అక్టోబర్ 05:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లాలో రూ.23.35 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు సోమవారం శంకుస్థాపన చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ భవేశ్…
సింగరేణి లాభాల వాటా పంపిణీకి డిమాండ్
సింగరేణి కార్మికులకు ఇటీవల ప్రకటించిన రూ.1.10 లక్షల దీపావళి బోనస్ (PLRB) కేవలం హెచ్ఎంఎస్ (HMS) కార్మిక సంఘం చేసిన అవిరళ కృషి, సుదీర్ఘ పోరాటాల ఫలితమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆమె, గుర్తింపు సంఘంతో పాటు ఇతర సంఘాల ప్రమేయం లేకుండానే ఈ బోనస్ సాధించామని, కొన్ని పత్రికలు వాస్తవాలను గుర్తించి తమ కథనాలను సరిదిద్దుకోవాలని సూచించారు. దీంతోపాటు కార్మికుల సంక్షేమం కోసం ప్రతి…
నేడు ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లావ్యాప్తంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు ప్రస్తుతం సాగుతున్న పనుల పురోగతిని, నాణ్యతా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అలాగే ఖమ్మం నగరంలోని అల్లీపురంలో టీటీడీ ఆధ్వర్యంలో 20 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పురోగతితో పాటు సాగునీటి సరఫరా, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించే అవకాశం ఉంది….
బషీరాబాద్‌లో మృతుల కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్
కమ్మర్పల్లి, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). మండలంలోని బషీరాబాద్ గ్రామానికి చెందిన మహిళా సమాఖ్య (VOA) కృష్ణవేణి భర్త శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించి, శ్రీనివాస్ మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు.అదే గ్రామానికి చెందిన కట్ట యమున కూడా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కుటుంబ…
మోకాలి శస్త్రచికిత్సకు రూ.1.10 లక్షల LOC మంజూరు
వేల్పూర్ గ్రామానికి చెందిన జమ్మలగిరి వనీతకు వైద్య చికిత్స కోసం LOC అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). వేల్పూర్ గ్రామానికి చెందిన జమ్మలగిరి వనీత మోకాలి శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు ఆర్థిక సహాయం అవసరం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని సంప్రదించారు. వనీత కుటుంబ…
హిందూ ఆలయాలపై దాడులు అమానుషం
నిందితుడిని కఠినంగా శిక్షించాలి: హిందూ సంఘాల నాయకులు రుద్రూర్, అక్టోబర్ 4: (E6tv NEWS: ప్రతినిధి). హిందూ ఆలయాలపై దాడులకు పాల్పడటం అమానుషమని హిందూ సంఘాల నాయకులు అన్నారు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ సంతోషిమాత ఆలయంపై దాడి చేసిన నిందితుడు మహమ్మద్ అన్సారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నిందితుడి దిష్టిబొమ్మను…
నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం నియామకం
నిజామాబాద్, అక్టోబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి)నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ తెలిపారు. మున్నూరు కాపు సంఘం సమావేశంలో సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సామాజిక సేవా కార్యక్రమాలపై చర్చించి పలువురిని వివిధ బాధ్యతల్లో నియమించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులుగా సుగంధం మురళి, సుగంధం సతీష్, ఆది రేఖుల సాయిలు, సోమినేని రాజేందర్, ఇంతు సత్యజీత్, ఇంతు ప్రవీణ్ కుమార్, ముహూర్…
జీపీ రోడ్డు కబ్జాపై గ్రామస్తుల ఆగ్రహం
500 మంది సంతకాలు కావాలంటున్న గ్రామ కార్యదర్శి తీరుపై మండిపాటు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంలో ఇంత నిర్లక్ష్యమా? అక్బర్‌నగర్ గ్రామస్తుల ఆవేదన అక్బర్‌నగర్, అక్టోబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) గ్రామంలో అనేక సంవత్సరాలుగా ఉన్న గ్రామపంచాయతీ (జీపీ) రోడ్డును పరిరక్షించి, పంచాయతీ ఆధీనంలోకి తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. జీపీ రోడ్డుకు సంబంధించిన భూమి ప్రభుత్వ/గ్రామపంచాయతీకి చెందినదని, దీనిపై గతంలో గ్రామపంచాయతీ సమావేశాల్లో పలుమార్లు తీర్మానాలు కూడా చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.ఈ విషయంపై గ్రామస్తులు ఇప్పటికే…
దళిత జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా డీజేఎఫ్
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం బోధన్ డివిజన్ దళిత జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంధం రాజేష్ బోధన్, అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి).దళిత, బహుజన జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దళిత జర్నలిస్ట్ ఫోరం (డీజేఎఫ్) పనిచేస్తోందని బోధన్ డివిజన్ డీజేఎఫ్ గౌరవ అధ్యక్షులు అశోక్ కుంబ్లే తెలిపారు. బోధన్ పట్టణంలోని స్థానిక లయన్స్ క్లబ్ కార్యాలయంలో శనివారం డీజేఎఫ్ బోధన్ డివిజన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. డీజేఎఫ్ బోధన్ డివిజన్…
బీడీ కార్మికులపై అదనపు వసూళ్లు ఆపాలి
దేశాయి బ్రదర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ నిజామాబాద్,అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి)బీడీ కార్మికుల నుంచి వేయి బీడీలకు రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశాయి బ్రదర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, రాజకీయ బీడీ వర్కర్స్ యూనియన్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాజకీయ బీడీ వర్కర్స్ యూనియన్…
