Medchal
28 ప్యాకేజీకి రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయాలి
పలుమార్లు అసెంబ్లీలో విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు శాసనసభలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముధోల్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి) ముధోల్ నియోజకవర్గంలోని సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన 28 ప్యాకేజీ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని, వాటి పూర్తికి ప్రభుత్వం తక్షణమే రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే 28 ప్యాకేజీ పనుల అంశాన్ని…
ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఆర్‌ఐ మృతి
నిజామాబాద్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్. సతీష్ మృతి చెందారు. పోలీస్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌ఎస్‌ఓ డ్యూటీ ముగించుకుని శుక్రవారం ఉదయం నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చిన ఆర్‌ఐ సతీష్ ఆయుధాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు…
డీజే అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇప్పించిన పోలీసులు
మద్నూర్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి) గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీజే ఏర్పాటు చేయాలనుకున్న గణేష్ మండలి నిర్వాహకులకు పోలీసులు అండగా నిలిచారు. డీజేకు అనుమతి లేదని పోలీసులు సూచించడంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న నిర్వాహకులు, రెండు నెలల క్రితం చెల్లించిన రూ.5 వేల అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు చొరవ తీసుకుని అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి ఇప్పించారు. కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం మరేపల్లి గ్రామంలోని ఏకదంత గణేష్…
ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
ముధోల్, సెప్టెంబర్ 17: (E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతంతో పాటు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎబీవీపీ నిర్మల్ జిల్లా కన్వీనర్ దినేష్ తెలంగాణ రాష్ట్ర విమోచన ఉద్యమ చరిత్ర, ఆనాటి పోరాటాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ…
పచ్చలనడుకుడలో 16 సీసీ కెమెరాలు ప్రారంభం
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం: సీపీ సాయి చైతన్య సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నిజామాబాద్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అన్నారు. మన ఊరు–మన భద్రత–మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్చలనడుకుడ గ్రామంలో 16 సీసీ కెమెరాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా…
భీంగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
సంక్షేమ సమస్యలపై ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి భీంగల్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని భీంగల్ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే ఎంపీడీవో కార్యాలయంలోని ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల…
హంద్రీ–నీవా కుడి కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలి
పేరూరు డ్యాంకు నీరు అందించాలి – జలదీక్షలో జడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అనంతపురం, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).హంద్రీ–నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) పీఏబీఆర్ కుడి కాలువ కింద ఉన్న చెరువులకు, పేరూరు డ్యాంకు వెంటనే నీటిని విడుదల చేయాలని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ డిమాండ్ చేశారు. రైతుల సాగునీటి హక్కుల కోసం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహ దినమే
తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడాలి: పీడీఎస్‌యూ బోధన్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు ముమ్మాటికీ విద్రోహ దినమేనని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో నేటి విద్యారంగ సమస్యలపై విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలోని మధుమలంచ జూనియర్ కళాశాలలో పీడీఎస్‌యూ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో “1948 సెప్టెంబర్ 17 విద్రోహ దినం” సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
CMR సమస్యలు పరిష్కరించాలి
బాన్సువాడ డివిజన్ రైస్ మిల్లర్ల నిరవధిక బంద్‌కు పిలుపు.. MROకు వినతిపత్రం బాన్సువాడ, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) డెలివరీల్లో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాన్సువాడ డివిజన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు మిల్లింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి…
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం
‘సార్‌తో సర్పంచ్ సాబ్’ కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మద్నూర్, సెప్టెంబర్ 17: (E6tv NEWS: ప్రతినిధి) మద్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ‘సార్‌తో సర్పంచ్ సాబ్’ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఎమ్మెల్యేతో కలిసి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు తమకు…
