Breaking News

మాదిగలకు రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి

రైతులకు నిరంతర విద్యుత్‌, వరికి మద్దతు ధర కల్పించాలి జుక్కల్, అక్టోబర్ 5: (E6tv NEWS: ప్రతినిధి). మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యంలో తగిన ప్రాధాన్యత కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూసేగం భూమయ్య మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో ఆయన మాట్లాడుతూ మాదిగలకు డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు.రైతుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు. రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడంతో పాటు,…

Read Full News

కలెక్టర్ ఆదేశాలను పాటించని బోధన్ ఎంఈఓ?

విద్యార్థికి టీసీ, బోనఫైడ్ ఇప్పించాలని సబ్ కలెక్టర్‌కు వినతి బోధన్:, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతిలో చేరేందుకు ప్రయత్నిస్తున్న మైనార్టీ విద్యార్థికి టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్లు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న ఇక్రా మోడల్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎత్తోండ రాజేందర్ కోరారు.ఈ మేరకు సోమవారం బోధన్ సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థి శేక్ తాజ్రీమ్ ఆర్థిక…

Read Full News

23 అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట వస్తువులు, మ్యాట్ల పంపిణీ

రుద్రూర్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో రుద్రూర్ సెక్టార్ పరిధిలోని 23 అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట వస్తువులు, మ్యాట్లను పంపిణీ చేశారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆటల ద్వారా శారీరక, మానసిక వికాసం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ లయన్ వేమూరి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత, చంద్రశేఖర్…

Read Full News

ఇందిరమ్మ ఇళ్లపై సమగ్ర సర్వే చేయాలి

నిరుపేదలకు పార్టీలకు అతీతంగా ఇళ్లు కేటాయించాలి వర్ని, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అర్హులైన నిరుపేదలకు న్యాయం జరిగేలా సమగ్రంగా సర్వే నిర్వహించి, పార్టీలకు అతీతంగా ఇళ్లను మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వర్ని మండల ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ వర్ని మండల అధ్యక్షులు ఆవుల రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కేటాయిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను నిజమైన అర్హులకు…

Read Full News

నిర్మల్‌ ఐఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్‌ జి. రమేష్‌ బాధ్యతల స్వీకరణ

నూతన అధ్యక్షుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్‌ కత్తి నరేందర్‌ నిర్మల్‌, అక్టోబర్ 5: (E6tv NEWS: ప్రతినిధి). ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ జి. రమేష్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ నియోజకవర్గ చైర్మన్‌, కౌన్సిలర్‌ కత్తి నరేందర్ డాక్టర్‌ జి. రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.నిర్మల్‌ జిల్లాలో వైద్య సేవల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఐఎంఏ తరఫున మరింత…

Read Full News

భీంగల్‌ పోలీస్‌స్టేషన్‌ ఘటనపై సీపీ వివరణ

పోలీసుల తప్పేమీ లేదు.. ఘటనకు పోలీసులకు ప్రత్యక్ష సంబంధం లేదు: పోలీస్‌ కమిషనర్‌ నిజామాబాద్‌, అక్టోబర్‌ 5:(E6tv NEWS: శివ ఠాకూర్). భీంగల్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ఘటనపై నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్పష్టత ఇచ్చారు. ఈ ఘటనలో పోలీసుల తప్పేమీ లేదని, ఘటనకు పోలీసు వ్యవస్థకు ప్రత్యక్ష సంబంధం లేదని తెలిపారు. పోలీసు కమిషనర్‌ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సోమవారం ఉదయం సుమారు 9.45 గంటల సమయంలో…

Read Full News

నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీకి నూతన కార్యవర్గం

జిల్లాలో తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు.. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ఎన్నికల అధికారిగా జిల్లా కో-ఆపరేటివ్ అధికారి శ్రీనివాసరావు చైర్మన్‌గా పోతంకర్ లక్ష్మీనారాయణ.. వైస్ చైర్మన్‌గా ఈ.సీనా నాయక్ ట్రెజరర్‌గా కెంపుల నాగరాజు.. స్టేట్ MC సభ్యుడిగా అనిల్ కుమార్ నిజామాబాద్: అక్టోబర్ 5: (E6tv NEWS: శివ ఠాకూర్). ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖలో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. జిల్లా శాఖకు సంబంధించిన ఎన్నికల్లో పోలింగ్ నిర్వహించి నూతన కార్యవర్గాన్ని…

Read Full News

బషీరాబాద్‌లో మృతుల కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్

కమ్మర్‌పల్లి, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). మండలంలోని బషీరాబాద్ గ్రామానికి చెందిన మహిళా సమాఖ్య (VOA) కృష్ణవేణి భర్త శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించి, శ్రీనివాస్ మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు.అదే గ్రామానికి చెందిన కట్ట యమున కూడా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కుటుంబ…

Read Full News

సన్నిత్ యాదవ్‌ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్

సన్నిత్ యాదవ్‌ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ బాల్కొండ, అక్టోబర్ 5: (E6tv NEWS: ప్రతినిధి) బాల్కొండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు సన్నిత్ యాదవ్‌ను బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ అన్న పరామర్శించారు. ఇటీవల సన్నిత్ యాదవ్ ప్రమాదవశాత్తు కన్నుకు గాయం కావడంతో విషయం తెలుసుకున్న సునీల్ బాల్కొండకు వచ్చి ఆయనను పరామర్శించారు.ప్రమాదానికి సంబంధించిన వివరాలను సన్నిత్ యాదవ్‌ను అడిగి తెలుసుకున్న సునీల్, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు….

Read Full News

హిందూ ఆలయాలపై దాడులు అమానుషం

నిందితుడిని కఠినంగా శిక్షించాలి: హిందూ సంఘాల నాయకులు రుద్రూర్, అక్టోబర్ 4: (E6tv NEWS: ప్రతినిధి). హిందూ ఆలయాలపై దాడులకు పాల్పడటం అమానుషమని హిందూ సంఘాల నాయకులు అన్నారు. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ సంతోషిమాత ఆలయంపై దాడి చేసిన నిందితుడు మహమ్మద్‌ అన్సారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం రుద్రూర్‌ మండల కేంద్రంలోని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్‌ చౌక్‌ వద్ద హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నిందితుడి దిష్టిబొమ్మను…

Read Full News