Nizambad
ప్రజావాణిలో 39 ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్ కమిషనర్
చట్ట ప్రకారం సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు నిజామాబాద్, జూలై 13: E6 క్రైమ్ న్యూస్ శివ ఠాకూర్ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని చట్టబద్ధంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ప్రజల నుంచి 39 ఫిర్యాదులను స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులను కమిషనర్ స్వయంగా కలిసి…
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో 30 ఎంబిబిఎస్ సీట్లు
ఎన్ఎమ్‌సీ నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లకు అధికారిక అనుమతి నిజామాబాద్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్ నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో శుభవార్త లభించింది. కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను 120 నుంచి 150కు పెంచేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎమ్‌సీ) అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అదనంగా 30 ఎంబీబీఎస్ సీట్ల మంజూరు కోసం ఈ…
జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, రక్షణ చట్టం అమలు చేయాలని టిడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ నిజామాబాద్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్.జిల్లా, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించడంతో పాటు అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన చేపట్టి, అనంతరం…
SIR పై పూర్తి అవగాహన కల్పించిన భీంగల్ ఎమ్మార్వో ఎం.కిరణ్ కుమార్.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అత్యవసరం అర్హులంతా తప్పనిసరిగా వివరాలు ధృవీకరించుకోవాలి – ఎమ్మార్వో సూచన భీంగల్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా పునాది. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్లను తొలగించడం, ఓటరు వివరాలను తప్పులులేకుండా రూపొందించడం లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR)…
పోతంగల్ మంజీరా నదిలో నుండి అక్రమ ఇసుక రవాణా…?
రాత్రివేళల్లో జోరుగా తరలింపు జరుగుతోందని స్థానికుల ఆరోపణలు అధికారులు నిఘా పెంచాలని ప్రజల డిమాండ్ కోటగిరి జూలై 13: E6 న్యూస్:నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పోతంగల్ మంజీరా నది లో నుండి రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆదివారం రాత్రి సుమారు 10 గంటల నుంచి ఇసుక రవాణా ప్రారంభమై తెల్లవారుజాము వరకు కొనసాగుతోందని వారు చెబుతున్నారు. పోతంగల్ నుంచి కోటగిరి మండలంలోని వివిధ గ్రామాలకు, స్థానిక ట్రాక్టర్ల ద్వారా,…
వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధుల ముప్పు…!
జ్వరం, డెంగ్యూ, వైరల్ ఇన్‌ఫెక్షన్లు.. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే..! ఉక్కపోత, చిరుజల్లులతో వైరస్‌ల వ్యాప్తికి అనుకూల పరిస్థితులు పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత జాగ్రత్తలతోనే సీజనల్ వ్యాధులకు చెక్ స్వయంగా మందులు వాడొద్దు.. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి ప్రత్యేక కథనం నిజామాబాద్, జూలై 12 | E6 న్యూస్ ప్రతినిధి : శివ ఠాకూర్ తెలంగాణలో వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ మారుతున్నాయి….
అశోక్ సాగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
లారీ ఢీకొని తల్లి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు నిజామాబాద్, జూలై 12 (E6 క్రైమ్ న్యూస్):నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఆదివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జానకంపేట్ గ్రామ సమీపంలోని అశోక్ సాగర్ వద్ద బోధన్–నిజామాబాద్ ప్రధాన రహదారిపై లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. జానకంపేట్ గ్రామానికి చెందిన మారా కమల తన కుమారుడు అవీష్‌తో కలిసి…
కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బిఆర్ఎస్ నేతలు
కోటగిరి జూలై 12 :E6 న్యూస్:కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండిస్తూ, తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థవంతంగా వినియోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సాగునీటి అవసరాలను తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఉపయోగించి, రైతులకు తక్షణమే సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని…
తెలంగాణకు ఎండల ఎఫెక్ట్…!
జూలై 15 వరకు పొడి వాతావరణం కొనసాగే సూచనలు 16-19 మధ్య అక్కడక్కడా తేలికపాటి ఉరుములు, జల్లులు మాత్రమే..! హైదరాబాద్, జూలై 12: E6 న్యూస్తెలంగాణలో జూలై రెండో వారం నుంచి వాతావరణం అసాధారణంగా వేడిగా మారింది. సాధారణంగా ఈ సమయంలో విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలను తలపించేలా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. నేడు నమోదయ్యే ఉష్ణోగ్రతలు వాతావరణ పరిస్థితులపై అందుబాటులో ఉన్న…
పేదల ఆరోగ్యానికి పెద్దపీట నిమ్స్ చికిత్సకు రూ. 5 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
ఇందూరు, జూలై 12: E6 న్యూస్ శివ ఠాకూర్ నియోజకవర్గంలోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, అవసరమైన వారికి నిమ్స్‌లో చికిత్స కోసం ఎల్వోసీలు (LOC) మంజూరు చేస్తున్నామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.ఆదివారం నగరంలోని తన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆటోనగర్‌కు చెందిన మూడున్నరేళ్ల చిన్నారి ఉమ్మే కుర్సుం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో ఆమె చికిత్స నిమిత్తం రూ.5 లక్షల విలువైన ఎల్వోసీని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే…

