Telangana
పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ నిజామాబాద్, ఆగస్టు 18: (E6tv NEWS: శివ ఠాకూర్). తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల…
కౌలాస్ కోటకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు
జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి మరో ముందడుగు జుక్కల్, ఆగస్టు 18: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ నియోజకవర్గంలోని చారిత్రక కౌలాస్ కోటకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. కౌలాస్ కోటను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిన కోటల జాబితాలో చేర్చడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషి, చొరవతో కౌలాస్ కోటకు మరింత ప్రాధాన్యత లభించిందని స్థానిక నాయకులు పేర్కొన్నారు. చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న…
పాపన్న జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి
ముధోల్, ఆగస్టు 18:(E6tv NEWS: A. తిరుపతి గౌడ్). సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని గౌడ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముధోల్ నియోజకవర్గ గౌడ సంఘాల నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం…
పాపన్న గౌడ్ సాక్షిగా దళిత బహుజనుల హక్కుల కోసం ఐక్య ఉద్యమం
నిర్మల్, ఆగస్టు 18: (Etv NEWS,A. తిరుపతి గౌడ్). సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గౌడజన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జయంతి సభ నిర్వహించారు.కార్యక్రమానికి మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు, టీజీఎస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ మాజీ…
పాపన్న ఆశయాలు నెరవేర్చినప్పుడే అసలైన నివాళి
నిర్మల్, ఆగస్టు 18: (E6tv NEWS:A. తిరుపతి గౌడ్) సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గౌడ సంఘాల నాయకులు, వివిధ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రతినిధులు పాల్గొని సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్, జిల్లా రెవెన్యూ అధికారి…
బీసీలకు కాంగ్రెస్ నమ్మకద్రోహం: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ధ్వజం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్ల రాజకీయం చేస్తూ వెనుకబడిన తరగతులకు (బీసీ) తీవ్ర అన్యాయం చేస్తోందని, వారి రిజర్వేషన్లను దెబ్బతీస్తోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమైన అంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్క బీసీ నాయకుడిని కూడా ముఖ్యమంత్రిని…
లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ క్యాపిటల్‌గా తెలంగాణ: నిపుణుల ధీమా
భారతదేశ ఔషధ తయారీ మరియు వ్యాక్సిన్ల కేంద్రంగా ఉన్న తెలంగాణ, తదుపరి దశలో “లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ క్యాపిటల్”గా అవతరించడానికి వేగంగా అడుగులు వేస్తోందని తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా సీఈఓ సర్వేష్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన పరిశ్రమల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030: ఫార్మా నిపుణుల అభిప్రాయాలు (CPHI & PMEC ఇండియా 2026 ప్రారంభ సదస్సు): నవంబరులో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో జరగనున్న 19వ ‘CPHI…
హైదరాబాద్‌లో నకిలీ నెయ్యి తయారీ స్థావరాలపై దాడులు: 25.5 టన్నుల అడల్టరేటెడ్ నెయ్యి స్వాధీనం
హైదరాబాద్ నగరాన్ని కలవరపెడుతున్న నకిలీ నెయ్యి ముఠాలపై హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) మరియు సిటీ పోలీసులు విరుచుకుపడ్డారు. కమిషనరేట్ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక దాడుల్లో భాగంగా సుమారు 25.5 టన్నుల (25,500 కేజీలు) కల్తీ/నకిలీ నెయ్యిని పోలీసులు మరియు ఆహార భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు & స్వాధీనం చేసుకున్నవి: నగరవాసుల ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ రాయుళ్లపై మరియు నకిలీ ఉత్పత్తులను తయారు చేసే వ్యాపారులపై పిడియాక్ట్ సహా కఠిన చట్టపరమైన…
పేదలకు భూమి పంపిణీ చేయాలి: కల్వకుంట్ల కవిత
సామాజిక న్యాయం కోసం మరోసారి భూ పంపిణీ అవసరం అధికారంలోకి వస్తే ‘భూ లక్ష్మి’ పథకంతో ప్రతి కుటుంబానికి ఎకరం భూమి: కవిత బంజారాహిల్స్, ఆగస్టు 18: (E6tv NEWS: ప్రతినిధి). రాష్ట్రంలో నిజమైన సామాజిక న్యాయం జరగాలంటే మరోసారి భూ పంపిణీ చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. పేదలకు భూమి పంపిణీ చేయాలన్న డిమాండ్‌తో పాటు, తాము అధికారంలోకి వస్తే ‘భూ లక్ష్మి’ పథకం ద్వారా ప్రతి…
ఎంపీ అరవింద్‌పై విమర్శలు చేస్తే ఊరుకోం
బీజేపీ కార్పొరేటర్ల హెచ్చరిక నిజామాబాద్ ఆగస్టు 18: (E6tv NEWS: శివ ఠాకూర్) నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను బీజేపీ కార్పొరేటర్లు తీవ్రంగా ఖండించారు. ఎంపీ అరవింద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీజేపీ శ్రేణులు చూస్తూ ఊరుకోవని 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ హెచ్చరించారు.జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రం సుధీర్, 22వ డివిజన్ కార్పొరేటర్ సాయి వైష్ణవి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు తగినన్ని…

