Telangana
రూ. 1.5 కోట్ల విలువైన హ్యాషిష్ ఆయిల్ స్వాధీనం: ఐటీ ఉద్యోగి సహా ఆరుగురు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న 12 కేజీల హ్యాషిష్ ఆయిల్‌ను (విలువ సుమారు ₹1.5 కోట్లు) మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ సూచనా విభాగాలు (SOT), వనస్థలిపురం పోలీసులు పట్టుకున్నారు. చింతలకుంట వద్ద సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన తనిఖీల్లో ఓ ఐటీ మహిళా ఉద్యోగి, ఇద్దరు మైనర్లు (17 ఏళ్లు) సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి వెల్లడించారు. వివరాలు & నేర శైలి: ఈ కేసులో సప్లయర్…
పాఠశాలల ఆరోగ్యం బలోపేతానికి ప్రత్యేక చర్యలు
నిజామాబాద్, ఆగస్టు 17: (E6tv NEWS: శివ ఠాకూర్). జిల్లాలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (RBSK)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ RBSK మొబైల్ హెల్త్ టీంలు ప్రతి పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆరు నెలలకు ఒకసారి…
ఆహార, ఔషధ భద్రతకు ప్రాధాన్యత: ‘TG-SAFE’ ప్రాముఖ్యతను వివరించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజల ఆరోగ్యం, ఆహారం మరియు మందుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేసిన ‘TG-SAFE’ (తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎస్సెన్షియల్ డ్రగ్స్) అమలులోకి వచ్చిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం వెల్లడించారు. పౌరులందరి క్షేమం మరియు రక్షణే ధ్యేయంగా ఈ ఏకీకృత వ్యవస్థను తీసుకొచ్చామని, సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా పిలుపునిచ్చారు. జీవో ముఖ్యాంశాలు & అధికారిక వివరాలు: రాష్ట్రంలో నాసిరకం ఆహారం, కల్తీ…
హుజూర్‌నగర్‌లో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన
హుజూర్‌నగర్, ఆగస్టు 17:(E6tv NEWS: ప్రతినిధి). మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఐపీఎస్ ఆదేశాల మేరకు హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు, ఎస్‌ఐ చలిగంటి నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ కళాబృందం ద్వారా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్…
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
హైదరాబాద్, ఆగస్టు 17: (E6tv NEWS: ప్రతినిధి) జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపకుండా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం చట్టపరమైన మార్గాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరింది.టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతినిధులు సోమవారం సచివాలయంలో సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ,…
వందేమాతరం గీతం ప్రతి భారతీయుడి గుండెల్లో నిలవాలి
నిజామాబాద్, ఆగస్టు 17: (E6 tv NEWS: శివ ఠాకూర్). బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట సోమవారం వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం గీతం కీలక పాత్ర పోషించిందన్నారు. 1905 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతరం గీతం రణనినాదంగా మారి ప్రజలను చైతన్యవంతం చేసిందని తెలిపారు. బంకించంద్ర చటర్జీ దూరదృష్టితో వందేమాతరం…
కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలి: వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్, ఆగస్టు 17: (E6tv NEWS,T. గంగాధర్) కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని, ఎన్నికల హామీ మేరకు కళ్యాణలక్ష్మి ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం అందించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ వేల్పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం…
భీంగల్ బ్రహ్మంగారి దేవాలయ భూమి రికార్డులపై తెల్పాలని విశ్వబ్రాహ్మణ సంఘం వారు ప్రజావాణిలో ఫిర్యాదు..
భీంగల్ ఆగస్టు 17: (E6tv NEWS,T. గంగాధర్) భీంగల్ గ్రామంలోని నంది గల్లి బస్సు డిపో వెంకన్న ఉన్న బ్రహ్మంగారి దేవాలయానికి సంబంధించిన భూమి రెవెన్యూ రికార్డులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోనికి తీసుకురావాలని విశ్వబ్రాహ్మణ సంఘము ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినారు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యుల వివరణ ప్రకారము సర్వేనెంబర్ 675లోని 6.0800 ఎకరాల భూమి పాత రెవిన్యూ రికార్డు లోనికి శ్రీ బ్రహ్మం గారి దేవాలయానికి సంబంధించిన భూమి…
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొన్నం ప్రభాకర్
కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ పథకాలకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నామని, పేద కుటుంబాలకు లబ్ధి చేకూరేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. న్యాయపరమైన చిక్కులు & ప్రభుత్వ చర్యలు: పథకాల గణాంకాలు: బీఆర్‌ఎస్ పార్టీ ఈ విషయంపై “సొల్లు…
TG SAFE కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి
తెలంగాణ ఫుడ్ అండ్ ఎస్సెన్షియల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అథారిటీ (TG SAFE) కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో ఆహార పదార్ధాలు, ఔషధాల నాణ్యత మరియు భద్రతా ప్రమాణాలను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ అథారిటీని ఏర్పాటు చేసింది. వివరాలు & ముఖ్య ఉద్దేశాలు:

