Breaking News

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు – మంచినీటి ప్లాంట్, సామాజిక పింఛన్లు ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం ములుగు జిల్లాలోని మేడారంలో పర్యటించి, సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ గద్దెల వద్ద పూజారులు ఆయనకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం తన ఎత్తుకు సమానమైన బంగారాన్ని (బెల్లం) తల్లులకు నివేదించి, రాష్ట్ర ప్రజల సంక్షేమం మరియు ఆయురారోగ్యాల కోసం ప్రార్థించారు. పూజల అనంతరం మేడారంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించిన రేవంత్ రెడ్డి, ఆలయ ప్రాంగణంలో మొక్క నాటారు….

Read More

దేశవ్యాప్తంగా 477 ‘మోడల్ సోలార్ విలేజెస్’ ప్రకటన – తెలంగాణలో 30 జిల్లాలకు చోటు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన’ (PM Surya Ghar: Muft Bijli Yojana – PMSG: MBY) పథకం కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 477 మోడల్ సోలార్ విలేజ్ (MSV)లను ప్రకటించినట్లు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ (MNRE) సహాయ మంత్రి యెస్సో నాయక్ వెల్లడించారు. ఇందులో తెలంగాణలోని 30 జిల్లాలు చోటు దక్కించుకున్నాయి. రాజ్యసభలో బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర…

Read More

వరి రకాల బోనస్‌పై ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ రైతుల్లో వ్యతిరేకత

సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన ₹500 బోనస్‌ను కేవలం 7 రకాల (Varieties) విత్తనాలకు మాత్రమే పరిమితం చేయడాన్ని తెలంగాణలోని పలువురు రైతులు వ్యతిరేకిస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన రసీదులు (Bills) ఉంటేనే బోనస్ వర్తింపజేస్తామన్న ప్రభుత్వ నిబంధన తమకు అన్యాయం చేసేలా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల అభ్యంతరాలు – ప్రధాన కారణాలు: ప్రభుత్వం నిర్ణయించిన 7 సన్న రకాల జాబితా: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతో (MSP)…

Read More

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలి

హైకోర్టు తీర్పును సాకుగా చూపి పేదింటి ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం పెండింగ్‌లో ఉన్న అర్హుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ నిజామాబాద్, ఆగస్టు 17: (E6tv NEWS: శివ ఠాకూర్)కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించి, అర్హులైన లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ ధర్నా చౌక్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ…

Read More

తెలంగాణ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ ఏర్పాటు

నూతన కార్యవర్గం ఎన్నిక.. అప్రైజర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ హైదరాబాద్ ఆగస్టు 17: (E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ ఆల్ బ్యాంక్స్ గోల్డ్ అప్రైజర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ఆల్ బ్యాంక్స్ గోల్డ్ అప్రైజర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎర్రోజు రాఘవాచారి, ఉపాధ్యక్షులు కొండూజు విజయ్ కుమార్ చారి, కార్యనిర్వాహక కార్యదర్శి అనంత రాములు తదితరులు…

Read More

కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌పై స్టే.. బీఆర్ఎస్ ధర్నా వెనుక అసలు కథ ఏమిటి?

పేదింటి ఆడబిడ్డల పెళ్లి సాయంపై న్యాయపరమైన ప్రతిష్టంభన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో లబ్ధిదారుల్లో ఆందోళన.. ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు పథకం రద్దు కాలేదా? స్టే మాత్రమేనా? అసలు వివాదం ఏమిటి? నిజామాబాద్, ఆగస్టు 17: E6tv NEWS (శివ ఠాకూర్). తెలంగాణ లో పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలు ప్రస్తుతం రాజకీయ, న్యాయపరమైన చర్చకు కేంద్రంగా మారాయి. ఈ పథకాల అమలుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు ఇటీవల మధ్యంతర…

Read More

మాజీ సర్పంచ్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న హన్మంత్ షిండే

పిట్లం, ఆగస్టు 16: (E6 tv NEWS: ప్రతినిధి) పిట్లం మండలం రాంపూర్ (కలాన్) మాజీ సర్పంచ్ మందాడి నారాయణ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే హాజరై నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన గృహంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు…

Read More

బాడాపహాడ్ కమాన్ నిర్మాణానికి భూమి పూజ

వర్ని, ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి) వర్ని మండల కేంద్రంలోని బాడాపహాడ్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మించనున్న బాడాపహాడ్ కమాన్ (స్వాగత తోరణం) నిర్మాణ పనులకు మాజీ డీసీసీబీ చైర్మన్  పోచారం భాస్కర్ రెడ్డి భూమి పూజ చేశారు.స్థానిక నాయకులతో కలిసి ఆయన కమాన్ నిర్మాణ స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. బాడాపహాడ్ చౌరస్తా వద్ద నిర్మించనున్న ఈ స్వాగత తోరణం వర్ని పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నాయకులు తెలిపారు. ఈ…

Read More

బీజేపీ, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు

బాల్కొండ నియోజకవర్గంలో 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరిక కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్: ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి). ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే…

Read More

బిచ్కుందలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి

బిచ్కుంద, ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి).జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పట్టణంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారి కుమార్తె జోనిట–దాస్ వివాహ ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి హాజరై కాబోయే వధూవరులు జోనిట–దాస్‌లను ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహ విందులో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ…

Read More