Telangana
దసరాకే కొత్త పింఛన్లు వచ్చేస్తున్నాయా??
హైదరాబాద్ (ఈ6 టీవీ): తెలంగాణలో కొత్త సామాజిక భద్రత పింఛన్ల కోసం నిరీక్షిస్తున్న అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించేందుకు వేగంగా చర్యలు చేపడుతోంది. అక్టోబర్‌లో దసరా పండుగ కానుకగా కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభించేలా ఏర్పాట్లు వేగవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలన, అర్హుల ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు. కీలక ఆదేశాలు & ముఖ్యాంశాలు: అయితే ఎంతమందికి…
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరుపై బిఆర్ఎస్ ఫోకస్…
హైదరాబాద్ (ఈ6 టీవీ): రాబోయే హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు ముఖ్య నేతలతో కీలక సమావేశం జరిగింది. ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల నమోదు ప్రక్రియ మరియు క్షేత్రస్థాయి వ్యూహాలపై ఈ సమావేశంలో కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశ వివరాలు & ప్రధాన ముఖ్యాంశాలు:
రోగుల పరామర్శను కూడా రాజకీయం చేస్తారా?
ప్రభుత్వం,పోలీసులు కనీస మానవత్వంతో వ్యవహరించాలి భేషరతుగా క్షమాపణ చెప్పి.. కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ (E6tv NEWS: సెప్టెంబర్ 22). వరంగల్‌లో చోటుచేసుకున్న ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న వారిని పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ సీనియర్ నేత వినయ్ భాస్కర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు. సీనియర్ ప్రజాప్రతినిధితో…
మహిళల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు
మహా అన్నదాన కార్యక్రమం నిర్వహణ జమ్మికుంట, సెప్టెంబర్ 21: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణం 6వ వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీ, 7వ వార్డు దుర్గా కాలనీలో శ్రీ శక్తి మహిళా గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలంతా కలిసి తొలిసారిగా శ్రీ శక్తి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో…
బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్: వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్!
హైదరాబాద్ (ఈ6 టీవీ): యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపు మేరకు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మూడు రోజుల పాటు సమ్మె బాట పట్టనున్నారు. సెప్టెంబర్ 26న నాల్గవ శనివారం, 27న ఆదివారం సాధారణ సెలవులు కావడం, ఆ వెంటనే 28, 29, 30 తేదీల్లో బ్యాంకు సమ్మె కొనసాగనుండటంతో వరుసగా 5 రోజుల పాటు ప్రత్యక్ష బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో…
మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
జీవో 52 రద్దు చేసి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి: మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల డిమాండ్ చేశారు. గత ఐదు రోజులుగా ధర్నా చౌక్‌లో మున్సిపల్ కార్మికులు చేపడుతున్న సమ్మెకు ఆయన హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల…
నీటి సమస్యపై తీవ్ర నిరసన: జూరాల యాత్రలో బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్
మహబూబ్‌నగర్ (ఈ6 టీవీ): జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టిన రైతులకు సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు మంగళవారం జడ్చర్ల వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌తో జడ్చర్లలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాంచందర్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితర కీలక నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్…
నిమ్స్ డాక్టర్‌పై ఏసీబీ రైడ్స్: డిప్యూటీ సూపరింటెండెంట్ ఇళ్లలో భారీగా సోదాలు!
హైదరాబాద్: హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ నివాసాలు మరియు కార్యాలయాలపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఉదయం భారీ దాడులు చేపట్టారు. ఆయన ఆదాయానికి మించి కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారనే పక్కా ఆధారాలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. సోదాల ప్రధాన వివరాలు: ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయని, స్వాధీనం చేసుకున్న ఆస్తుల పూర్తి విలువ మరియు లెక్క తేలిన…
హైదరాబాద్‌వాసులకు బిగ్ అలర్ట్: నీటిని వృథా చేస్తే రూ.20,000 ఫైన్!
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తాగునీటి వృథాను అరికట్టేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. నీటిని దుర్వినియోగం చేసే వినియోగదారులపై భారీగా జరిమానాలు విధించడంతో పాటు, పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే నీటి కనెక్షన్లను శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించింది. ప్రధాన వివరాలు & కఠిన చర్యలు: నీటి దుర్వినియోగం లేదా వృథాకు సంబంధించి ప్రజలు 99499 30003 అనే వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని, నీటి సంరక్షణ అనేది…
రుద్రూర్లో రసాభాసగా మారిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గ్రామసభ
లబ్ధిదారుల ఎంపిక వాయిదా.. నిరాశకు గురైన నిరుపేదలు రుద్రూర్, సెప్టెంబర్ 22 (E6TV NEWS: ప్రతినిధి).నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల కేటాయింపు జరుగుతుందని ఆశతో భారీ సంఖ్యలో గ్రామస్తులు హాజరయ్యారు. అయితే లబ్ధిదారుల ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో అధికారులు ఎంపిక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. రుద్రూర్లో నిర్మించిన 150 డబుల్ బెడ్రూమ్…
