Breaking News

ఫేమస్ అయ్యాక గిరాకీ తగ్గిందా? సంపాదనపై నోరు విప్పిన కుమారి ఆంటీ!

హైదరాబాద్‌కు చెందిన సోషల్ మీడియా సెలబ్రిటీ కుమారి ఆంటీ (దాసరి సాయికుమారి) తన బిజినెస్, రోజువారీ ఆదాయం మరియు వ్యక్తిగత విషయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మీది మొత్తం 1000 అయింది.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా” అనే డైలాగ్‌తో పాపులర్ అయిన ఆమె, తాను వైరల్ కాకముందే వ్యాపారం మరింత బాగా జరిగేదని పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. గతంలో తన హోటల్‌కు రోజుకు 1,500 మంది వరకు కస్టమర్లు వచ్చేవారని,…

Read Full News

నర్సింగ్ విద్యార్థిని మిస్టరీ మరణం: వెలుగులోకి తల్లి అనుమానాలు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని హరిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బిఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న హరిణి, సెలవుల నిమిత్తం రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. మంగళవారం రాత్రి ఆమె తల్లి రాజేశ్వరి బంధువుల ఇంటికి వెళ్లడంతో హరిణి ఒక్కతే ఇంట్లో ఉంది. రాత్రి రాజేశ్వరి ఇంటికి తిరిగి వచ్చేసరికి హరిణి కనిపించకపోవడంతో, స్థానికుల సహాయంతో వెతకగా…

Read Full News

భద్రాచలం రామాలయ అభివృద్ధి పనుల పరిశీలన:మంత్రి పొంగులేటి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి పనులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి, ఎంపీకి ఆలయ అధికారులు మంగళ వాయిద్యాలు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు వారికి శాలువాలతో సత్కరించి ఆశీర్వచనం అందజేశారు. వర్షం పడుతున్నప్పటికీ లెక్కచేయకుండా,…

Read Full News

పోచారంలో ఆరుగురికి రోల్‌బ్యాక్ పెన్షన్ల పంపిణీ

పోచారం, సెప్టెంబర్ 22: (E6tv NEWS: ప్రతినిధి). పోచారం గ్రామంలో సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ ఆధ్వర్యంలో రోల్‌బ్యాక్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గతంలో పెన్షన్ పొందుతూ, వివిధ కారణాలతో నిలిచిపోయిన ఆరుగురు అర్హులైన లబ్ధిదారులకు తిరిగి పెన్షన్లు మంజూరు కాగా, వాటిని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెన్షన్లకు సంబంధించిన సమస్యలను…

Read Full News

వర్షాల ధాటికి చార్మినార్‌ పెచ్చులు ఊడిపడటం: తప్పిన ముప్పు!

హైదరాబాద్‌లోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చారిత్రక కట్టడం చార్మినార్‌పై పెచ్చులు ఊడిపడటంతో అధికారులు తీవ్ర అప్రమత్తమయ్యారు. నగరంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. చార్మినార్‌లోని లాడ్ బజార్ వైపు ఉన్న మినార్ పైభాగంలో కాంక్రీట్, సున్నపు పూత దెబ్బతిని కింద పడిపోయింది. వర్షాల ధాటికి సున్నపు పూత తేలిపోయి ఇప్పటికే ఉబ్బిపోవడాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది, కింద పడిన పెచ్చులను వెంటనే అక్కడి…

Read Full News

జూరాల నీటి విడుదల: ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు!

జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలకు అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఎడమ, కుడి కాలువల గేట్లను ఎత్తివేశారు. గత వారం రోజులుగా పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే నీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు ఆందోళనలు చేపట్టగా.. వారికి బీఆర్ఎస్ నేతలు కూడా మద్దతుగా నిలిచారు. రైతుల డిమాండ్లు మరియు నిరసనలపై స్పందించిన అధికారులు ఎట్టకేలకు నీటిని కిందికి వదిలారు. కాలువల ద్వారా సాగునీరు పారడంతో తమ పంటలను కాపాడుకోవచ్చనే నమ్మకంతో ఆయకట్టు ప్రాంతాల రైతులు తీవ్ర…

Read Full News

ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి నేడే చివరి అవకాశం!!

హైదరాబాద్‌లో 7 దశాబ్దాలుగా విశేష పూజలందుకుంటున్న ఖైరతాబాద్ మహాగణపతి (69 అడుగుల పంచముఖ సంకటహర గణపతి) దర్శనాలకు సమయం ఆసన్నమైంది. ఈరోజు (సెప్టెంబర్ 23, బుధవారం) రాత్రి వరకు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. రేపు (సెప్టెంబర్ 24న) మండపం వద్ద ఏర్పాటు చేసిన షెడ్డు, బ్యారికేడ్లను తొలగించి, శోభాయాత్రకు మరియు నిమజ్జనానికి అవసరమైన రూట్ మార్గాన్ని సిద్ధం చేయనున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా…

Read Full News

మబ్బు పట్టిన ఆకాశం, పలు జిల్లాల్లో అలర్ట్

ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపిస్తున్న వాయుగుండం (దీప్ డిప్రెషన్) ప్రభావంతో రాబోయే 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు తీవ్రతరం కానున్నాయి. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో ఉదయం నుంచే ఈదురుగాలులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే…

Read Full News

గణేష్ రథయాత్ర మార్గంలో బీటీ రోడ్డు పనుల పర్యవేక్షణ

నిజామాబాద్, సెప్టెంబర్ 22:(E6tv NEWS: శివ ఠాకూర్). నగరంలో శుక్రవారం నిర్వహించనున్న సార్వజనిక్ గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని గణేష్ రథయాత్ర సజావుగా సాగేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా గణేష్ రథయాత్ర వెళ్లే మార్గంలోని గుర్బాబాది రోడ్డు – శివాజీ చౌక్ నుంచి రైల్వే గేట్ వరకు చేపడుతున్న బీటీ రోడ్డు పనులను సంబంధిత అధికారులు, 35 వ డివిజన్ బిజెపి కార్పొరేటర్ ఎర్రం సుధీర్ పర్యవేక్షించారు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో…

Read Full News

నిబంధనలు పాటిద్దాం.. ప్రమాదాలను నివారిద్దాం

డ్రైవర్లు, సిబ్బందికి రోడ్ సేఫ్టీపై అవగాహన నిజామాబాద్, సెప్టెంబర్ 23:(E6 tv NEWS: ప్రతినిధి). రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ అధికారులు సూచించారు. నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో డ్రైవర్లు, సిబ్బందికి రోడ్‌ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి A.M.V.I. మణికాంత్ ముఖ్య అతిథిగా హాజరై రహదారి భద్రతపై పలు సూచనలు చేశారు. కలెక్టర్ కార్యాలయం నుంచి రోడ్‌ సేఫ్టీ ఈదార్ మేనేజర్ వర్షా నిహంత్…

Read Full News