Telangana
ప్రజావాణిలో ఫిర్యాదుదారుల సమస్యలు విన్న ఎస్పీ
నిర్మల్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను క్షుణ్ణంగా విన్న ఎస్పీ, సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో మాట్లాడి ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ఫిర్యాదులను చట్టపరంగా పరిశీలించి, బాధితులకు సకాలంలో…
భైంసాలో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
భైంసా, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). పట్టణంలో రేపు నిర్వహించనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ సోమవారం పరిశీలించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన గడ్డెన్న వాగు నిమజ్జన ప్రదేశాన్ని ఆమె పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా, సజావుగా జరిగేలా…
గణేష్ శోభాయాత్రకు పటిష్ట భద్రత
నిర్మల్, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి). నిర్మల్ పట్టణంలో రేపు నిర్వహించనున్న 9వ రోజు గణేష్ శోభాయాత్రకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ తెలిపారు. శోభాయాత్ర కొనసాగనున్న ప్రధాన మార్గాలతో పాటు గుల్జార్ మజీద్ ప్రాంతాన్ని ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాలు,…
భీంగల్ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రష్మీ గౌతమ్
భీంగల్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). ప్రముఖ యాంకర్, నటి రష్మీ గౌతమ్ సోమవారం నిజామాబాద్ జిల్లా భీంగల్‌లోని శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రణీత్ పంతులు, విష్ణు పంతులు, నర్సయ్య పంతులు, నారాయణ పంతులు రష్మీ గౌతమ్‌తో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందిన ఆమె ఆలయ మహిమ, విశిష్టత గురించి తెలుసుకుని కొంత సమయం భక్తి భావంతో…
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ఘనంగా నిర్వహణ
నిజామాబాద్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). నగరంలోని వినాయక్‌నగర్‌లో గల అమరవీరుల పార్కులో పద్మశాలి కుల పెద్దల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల పెద్దలు గుజ్జేటి వెంకట నరసయ్య, ఎనగందుల మురళి, అల్లే నాగభూషణం, అవధూత రాములు, వేముల సూర్య ప్రకాష్, చిలుక కిషన్, మోర భూమన్న, అవధూత విట్టల్,…
రుద్రూర్ ముస్లిం మైనార్టీ విలేజ్ కమిటీ ఎన్నిక
మైనార్టీల అభివృద్ధి, హక్కుల సాధన కోసం కృషి చేస్తాం రుద్రూర్, సెప్టెంబర్ 21;(E6tv NEWS: ప్రతినిధి). ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం రుద్రూర్ ముస్లిం మైనార్టీ విలేజ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ముల్తాని, ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని తెలిపారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. కమిటీ అధ్యక్షుడిగా సయ్యద్ ముల్తాని, ఉపాధ్యక్షులుగా ఇమ్రాన్ ఖురేషి, ఖలీమ్ ఖురేషి, ప్రధాన కార్యదర్శిగా షేక్ సుభాని, సంయుక్త…
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చొరవతో న్యాయం జరిగింది
అక్బర్‌నగర్ గ్రామ పెద్దల కృషికి కృతజ్ఞతలు తెలిపిన అశోక్ ప్రజాపాలనలో తనకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని దరఖాస్తు రుద్రూర్, సెప్టెంబర్ 21;(E6tv NEWS: ప్రతినిధి). తనకు జరిగిన అన్యాయంపై అక్బర్‌నగర్ గ్రామ పెద్దలు స్పందించి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో న్యాయం జరిగిందని అశోక్ తెలిపారు. అయితే గ్రామ పెద్దలు, ఎమ్మెల్యే చొరవ లేకపోతే తన పరిస్థితి ఏమయ్యేదోనని ఆవేదన వ్యక్తం చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన…
సమస్య చెప్పాడు.. పరిష్కారం చూపించాడు!
డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో విద్యుత్ సమస్యకు పరిష్కారం కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పెద్ద కొడప్‌గల్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). మండల కేంద్రంలోని డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నెలకొన్న విద్యుత్ సమస్యను స్థానికులు జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎస్సీ సెల్ చైర్మన్, మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు సౌదగర్ అరవింద్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ…
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చొరవతో న్యాయం జరిగింది
అక్బర్‌నగర్ గ్రామ పెద్దల కృషికి కృతజ్ఞతలు తెలిపిన అశోక్ ప్రజాపాలనలో తనకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని దరఖాస్తు రుద్రూర్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). తనకు జరిగిన అన్యాయంపై అక్బర్‌నగర్ గ్రామ పెద్దలు స్పందించి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో న్యాయం జరిగిందని అశోక్ తెలిపారు. అయితే గ్రామ పెద్దలు, ఎమ్మెల్యే చొరవ లేకపోతే తన పరిస్థితి ఏమయ్యేదోనని ఆవేదన వ్యక్తం చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన…
నిర్లక్ష్యమా..? ప్రమాదమా..? హత్యా..?
వాకింగ్‌కు వెళ్లి తిరిగి రాని లోకాలకు.. లారీ ఢీకొని మయూరి నగర్ వాసి బీకుమల్ల సత్యనారాయణ మృతి ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు.. పోలీసుల దర్యాప్తు అశోక్‌నగర్,సెప్టెంబర్ 21 (E6tv న్యూస్: ప్రతినిధి). పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని అశోక్‌నగర్ మయూరి నగర్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి ఇంటికి వస్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలనీవాసులు తెలిపిన…
