Breaking News

నిజాయితీకి పోలీస్‌స్టేషన్‌లో సత్కారం

బంగారు నెక్లెస్‌ను పోలీసులకు అప్పగించిన ముగ్గురికి సీఐ జయనాయక్ ఘన సన్మానంఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నగదు పారితోషికం ధర్మవరం, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి) రోడ్డుపై లభించిన బంగారు నెక్లెస్‌ను పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న ముగ్గురు వ్యక్తులను ధర్మవరం టూ టౌన్ సీఐ జయనాయక్ ఘనంగా సన్మానించారు. ఆటో డ్రైవర్ నరసింహులు, కుమ్మర రామాంజనేయులు, సిద్ధమ్మలను శాలువాలతో సత్కరించి, ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నగదు పారితోషికాన్ని అందజేశారు. వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గం నుంచి…

Read Full News

విద్యార్థులతో మొక్కలు నాటించిన అధికారులు

ఎర్గట్ల, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). ఎరుగట్ల మండలం గుమ్మిరాల గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. “Ek Ped Maa Ke Naam” కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులతో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, మొక్కల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నాటిన మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, ఎంఈఓ, గ్రామపంచాయతీ…

Read Full News

గ్రామీణ యువ క్రికెటర్లను గుర్తించడమే లక్ష్యం

అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి: మచ్చా రామలింగారెడ్డి అనంతపురం, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రికెట్ ప్రతిభను గుర్తించి, వారికి సరైన శిక్షణ అందించి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రికెటర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) ఆధ్వర్యంలో ‘రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు RDT క్రికెట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న యువ…

Read Full News

బీఎస్పీ జిల్లా కార్యదర్శిగా మాల్యవంతం రాంప్రసాద్

ధర్మవరం, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి) బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శిగా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలానికి చెందిన బహుజన నాయకుడు మాల్యవంతం రాంప్రసాద్ నియమితులయ్యారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ మార్గదర్శకత్వంలో జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్ ఈ నియామకాన్ని ప్రకటించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్, రాష్ట్ర…

Read Full News

ధర్మవరం పట్టణ అభివృద్ధికి రూ.242.28 కోట్ల సమగ్ర ప్రణాళిక

రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కులు, వీధి దీపాల అభివృద్ధికి ప్రాధాన్యం ధర్మవరం, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి) ధర్మవరం పట్టణ సమగ్ర అభివృద్ధికి వివిధ ప్రభుత్వ పథకాల కింద మొత్తం రూ.242.28 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా మంగళవారం కుప్పం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

Read Full News

ఘనంగా పరిటాల శ్రీరామ్ పుట్టినరోజు వేడుకలు

ధర్మవరం, సెప్టెంబర్ 22: (E6tv NEWS: ప్రతినిధి). ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ పుట్టినరోజు వేడుకలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గ్రామాలు, వార్డుల్లో పార్టీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. పుట్టినరోజు సందర్భంగా ధర్మవరం పట్టణ టీడీపీ నాయకులు దుర్గమ్మ దేవాలయంలో పరిటాల శ్రీరామ్ పేరిట ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద పేదలకు ఉచితంగా అల్పాహారం అందజేశారు. అదేవిధంగా పాత మున్సిపల్ కార్యాలయం…

Read Full News

కుల సంఘాలే అర్హులను నిర్ణయించాలి

రుద్రూరులో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం రుద్రూరు, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). రుద్రూరు మండల కేంద్రంలో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు కదలిక వచ్చింది. సోమవారం నిర్వహించిన గ్రామసభలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై చర్చ జరిగింది. కుల సంఘాల ప్రతినిధులు తమ సంఘాల్లోని అర్హులైన నిరుపేదల జాబితాను అధికారులకు అందజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కుల సంఘాల నుంచి అర్హుల జాబితా గ్రామంలో ఉన్న కుల సంఘాలు…

Read Full News

మండల సమాఖ్యలపై మోడల్ శిక్షణ

రానున్న ఐదేళ్లలో సంఘాల అభివృద్ధికి విజన్ రూపొందించుకోవాలి విజన్ సాధనకు పక్కా వ్యూహాలు రూపొందించుకోవాలని సూచన మద్నూర్, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లు, వీఓఏలకు మోడల్ మండల సమాఖ్యలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. NRLM స్టేట్ రిసోర్స్ పర్సన్స్ ఎస్. రమాదేవి, ఓ. కవిత శిక్షణను అందించారు. ఐదేళ్ల అభివృద్ధికి విజన్ రానున్న ఐదేళ్లలో స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు ఏ స్థాయిలో…

Read Full News

కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్‌లను వ్యతిరేకించాలి

శ్రీ సత్యసాయి వాటర్ వర్కర్స్‌కు విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులు పుట్టపర్తి, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి వాటర్ వర్కర్స్ ఆధ్వర్యంలో కార్మికులకు విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులను పుట్టపర్తి కార్మిక కర్షక భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధుసూదన్ అధ్యక్షత వహించారు. జెండా ఆవిష్కరించిన సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు శిక్షణా తరగతుల ప్రారంభానికి ముందు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఓబులు జెండాను ఆవిష్కరించి ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన…

Read Full News

లంచం తీసుకోకపోతే పని కాదా?:మంచిర్యాల ఏసీబీ రైడ్‌లో జీపీవో, అనుచరుడు!

మంచిర్యాల జిల్లా పెద్దపేట గ్రామంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడి చేసి, లంచం తీసుకుంటుండగా గ్రామ పరిపాలనా అధికారి (GPO) దుర్గాప్రసాద్‌తో పాటు అతని అనుచరుడు పోతు రాజేందర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. భూ బదిలీ క్రమబద్ధీకరణతో పాటు పట్టాదారు పాస్‌పుస్తకాలు మంజూరు చేసేందుకు గానూ అధికారికంగా సహకరించడానికి జీపీవో దుర్గాప్రసాద్ ఫిర్యాదుదారుడి నుంచి రూ. 1.30 లక్షల లంచం డిమాండ్ చేశాడు. అందులో భాగంగా మొదటి విడతగా రూ. 80,000…

Read Full News