Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: మంత్రి సవిత

పెనుకొండ మున్సిపాలిటీలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం తిమ్మాపురం, వెంకటరెడ్డిపల్లిలో రూ.2 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు సుమారు 150 మంది లబ్ధిదారులకు ఇంటి పత్రాల పంపిణీ పెనుకొండ, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి). ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయా లేదా తెలుసుకునేందుకు పెనుకొండ…

Read Full News

ముస్లిం స్మశాన వాటికలో అక్రమ దుకాణాలు తొలగించాలి

ప్రజావాణిలో ముస్లిం సోదరుల ఫిర్యాదు మద్నూర్, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి) మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ ఎదురుగా ఉన్న మైనారిటీ ముస్లిం స్మశాన వాటిక, ఈద్గా స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలు, షెడ్లను తొలగించి స్థలాన్ని పరిరక్షించాలని ముస్లిం సోదరులు అధికారులను కోరారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ముస్లిం సోదరులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్నూర్ కేంద్రంలోని సర్వే నంబర్ 581లో…

Read Full News

నిరుద్యోగులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్:మైన్స్ శాఖలో ప్రమోషన్లు, ఖాళీల భర్తీకి సీఎస్ ఆదేశాలు!

హైదరాబాద్: తెలంగాణ గనులు, భూగర్భ వనరుల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు ఉద్యోగుల పదోన్నతుల (ప్రమోషన్లు) ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సిబ్బంది కొరత కారణంగా శాఖ కార్యకలాపాలకు, ప్రజా సేవలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖ…

Read Full News

అవకతవకలకు తావులేదు..

స్వయం సహాయక సంఘాల లావాదేవీలపై ప్రత్యేక దృష్టి బకాయిలు, స్త్రీనిధి రుణాల రికవరీకి చర్యలు వ్యక్తిగత కక్షలకు తావులేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పని చేయాలి: ఏపీఎం సువర్ణ సిరికొండ, సెప్టెంబర్ 21:(E6tv NEWS: శివ ఠాకూర్). స్వయం సహాయక సంఘాల్లో ఆర్థిక లావాదేవీల విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని సిరికొండ APM సువర్ణ స్పష్టం చేశారు. సంఘాల నిధులను దుర్వినియోగం చేసినా, లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు….

Read Full News

కరీంనగర్ – వరంగల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్: అక్టోబర్‌లో ఫోర్ లేన్ హైవే ప్రారంభం!

కరీంనగర్: కరీంనగర్ మరియు వరంగల్ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జగిత్యాల – వరంగల్ జాతీయ రహదారి 563 (NH-563) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ నుంచి హనుమకొండ వరకు నిర్మించిన 68 కిలోమీటర్ల పొడవైన ఈ నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవేపై సెప్టెంబర్ 5 నుంచే ట్రయల్ రన్ విజయవంతంగా ప్రారంభమైంది. రూ. 2,486 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక రహదారిని అక్టోబర్ నెలలో ప్రధాని నరేంద్ర…

Read Full News

నిజామాబాద్: రూ.15 వేల లంచం తీసుకుంటూ చిక్కిన ఉద్యోగులు!

నిజామాబాద్, సెప్టెంబర్ 21: (E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సంచలన దాడి నిర్వహించారు. కార్యాలయంలోని రెండవ అంతస్తులో గల ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ అసిస్టెంట్ అశోక్ కుమార్, ఒక పౌరుడి పనులకు సంబంధించిన అనుమతుల కోసం రూ.15,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఈ విషయమై ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, పక్కా ప్రణాళిక ప్రకారం సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు…

Read Full News

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ దాడులు

రూ.15 వేల లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ పట్టివేత ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కూడా అదుపులోకి నిజామాబాద్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. రూ.15 వేల లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. అతనితో పాటు అదే విభాగంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న మరో వ్యక్తిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు…

Read Full News

రైతులకు నీళ్లివ్వమంటే అరెస్టులా?: రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం!

హైదరాబాద్: ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి సాగునీరు విడుదల చేయాలని కోరిన రైతులను, వారికి మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతుల ఆవేదనను ఆలకించి నీళ్లు ఇవ్వాల్సింది పోయి అక్రమ అరెస్టులకు పాల్పడటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక్షస మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు…

Read Full News

ఆకాశాన్నంటుతున్న విమాన టికెట్ల ధరలు: పండగ వేళ ప్రయాణికులకు చుక్కలు!

హైదరాబాద్: దీపావళి పండగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు విమానయాన సంస్థలు కోలుకోలేని షాక్ ఇస్తున్నాయి. పండగ రద్దీతో పాటు పెరిగిన విమానయాన ఇంధన (ATF) ధరలను సాకుగా చూపిస్తూ దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో చార్జీలను ఆకాశాన్నంటేలా పెంచేశాయి. కొన్ని ప్రధాన రూట్లలో టికెట్ ధరలు సాధారణ రోజులతో పోలిస్తే ఏకంగా 300 శాతం వరకు పెరగడంతో పండగ ప్రయాణం సామాన్యులకు తీవ్ర భారంగా మారింది. ఉదాహరణకు ఢిల్లీ-బెంగళూరు మార్గంలో రౌండ్-ట్రిప్ చార్జీలు రూ. 20,000 దాటగా,…

Read Full News

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ప్రారంభం!

హైదరాబాద్: ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలో తన నాల్గవ ‘క్లౌడ్ రీజియన్’ (డేటా సెంటర్)ను సోమవారం హైదరాబాద్‌లో అధికారికంగా ప్రారంభించింది. దేశ డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రూ. 1.70 లక్షల కోట్ల (20.5 బిలియన్ డాలర్లు) భారీ పెట్టుబడి ప్రణాళికలో భాగంగా ఈ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే పూణే, చెన్నై, ముంబైలలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ రీజియన్లు సేవలు అందిస్తుండగా, హైదరాబాద్ వేదికగా ఏర్పాటైన ‘ఇండియా సౌత్ సెంట్రల్’…

Read Full News