Breaking News

సర్పంచ్ అశోక్ పటేల్‌కు ఘన సన్మానం

యువసేన గణేష్ మండలి నిర్వాహకుల అభినందనలు

మెనూర్, సెప్టెంబర్ 18;(E6tv NEWS: ప్రతినిధి)

మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలోని యువసేన గణేష్ మండలి నిర్వాహకులు, గ్రామ పెద్దలు సర్పంచ్ అశోక్ పటేల్‌ను శుక్రవారం ఘనంగా సన్మానించారు.

గణేష్ మండలి వద్ద సర్పంచ్ అశోక్ పటేల్ తన సొంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మండలి సభ్యులు సర్పంచ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించి అభినందించారు.అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు సేవ చేసిన సర్పంచ్ అశోక్ పటేల్‌పై మండలి నిర్వాహకులు ప్రశంసలు కురిపించారు. గణనాథుని ఆశీస్సులతో సర్పంచ్ అశోక్ పటేల్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, ఆయన కుటుంబ సభ్యులపై గణపతి దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *