Breaking News

జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

దేశ ఐక్యత, అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి: జుక్కల్ ఎమ్మెల్యే జుక్కల్ ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలంతా కలిసికట్టుగా…

Read More

వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

మద్నూర్, ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి).మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం గాంధీ చౌక్ ఆవరణలో గ్రామ పెద్దలు, వ్యాపారవేత్తల కుటుంబాలకు చెందిన మహిళామణుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటే కార్యక్రమాలు నిర్వహించారు. కార్మెల్ ప్రైవేట్ స్కూల్ విద్యార్థినులు ప్రదర్శించిన ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలు…

Read More

భీంగల్ ఎంపీడీవోకు ప్రశంసా పత్రం

నిజామాబాద్ ఆగస్టు 15: ,(E6 tv NEWS ప్రతినిది). 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భీంగల్ ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్‌కు ఘనమైన గౌరవం లభించింది. బోధన్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో చూపిన సేవలను…

Read More

ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నిజామాబాద్, ఆగస్టు 15: (E6 tv NEWS:శివ ఠాకూర్) నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ ఆవరణలో అధ్యక్షులు పంచారెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఐశ్వర్యం హోమ్స్ అండ్ బిల్డర్స్ ఆధ్వర్యంలో, మంతం మధు…

Read More

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్, హైదరాబాద్, ఆగస్టు 15: (E6 tv NEWS: ప్రతినిధి) బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ కాలం నాటి ఆలోచన విధానాలను వీడాలి ఈ సందర్భంగా…

Read More

ఏర్గట్లలో ప్లాస్టిక్‌ కవర్ల వినియోగంపై అవగాహన

ఏర్గట్ల ఆగస్టు 14: (E6tv NEWS: T, గంగాధర్). మండల కేంద్రంలో ప్లాస్టిక్‌ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఏర్గట్ల సర్పంచ్‌ కొలిప్యాక ఉపేందర్‌రెడ్డి కోరారు. వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌తో కలిసి ఆయన గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా కిరాణా దుకాణాలు, చికెన్‌ సెంటర్లు, హోటళ్లను స్వయంగా సందర్శించి వ్యాపారులకు ప్లాస్టిక్‌ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా పర్యావరణహిత బయో ప్లాస్టిక్‌ బ్యాగులను సర్పంచ్‌, వార్డు సభ్యులు…

Read More

ఆగస్టు 16న సీఎం రేవంత్ రెడ్డి ములుగు పర్యటన: మేడారంలో దర్శనం, పెన్షన్ల పంపిణీ ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 16న (ఆగస్టు 16) ములుగు జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. సీఎం పర్యటనను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం మరియు మంత్రులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), కలెక్టర్ బోర్కడే సహదేవరావు మరియు ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్‌లతో కలిసి గట్టమ్మ సమీపంలో అభివృద్ధి పనులను, పైలాన్‌ను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనలోని ప్రధాన అంశాలు:

Read More

హల్ద్వానీ ఘటనకు నిరసనగా కామారెడ్డిలో పాదయాత్ర–సత్యాగ్రహం

కామారెడ్డి, ఆగస్టు 14: (E6 tv NEWS: ప్రతినిధి) హల్ద్వానీలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని గంగాజలంతో శుద్ధి చేసిన ఘటనను నిరసిస్తూ ఆగస్టు 14న కామారెడ్డి జిల్లాలో జిల్లా స్థాయి పాదయాత్ర, సత్యాగ్రహ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు సంఘీభావంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లాలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, అనుబంధ సంఘాలు, విభాగాల…

Read More

బిచ్చుకుంద డిగ్రీ కళాశాలలో సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం

బిచ్చుకుంద, ఆగస్టు 12: (E6 tv NEWS ప్రతినిధి). బిచ్చుకుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు ప్రేమ, మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు తదితర సామాజిక అంశాలపై పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, బిచ్చుకుంద ఎస్‌ఐ జి. రాజు సూచనలతో ఏఎస్ఐ డి. దేవరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్…

Read More

ఎయిడ్స్‌పై రెండు నెలల పాటు విస్తృత అవగాహన కార్యక్రమం

నిజామాబాద్ ఆగస్టు 12: (E6 tv NEWS, శివ ఠాకూర్). హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎయిడ్స్‌ విభాగం ఆధ్వర్యంలో రెండు నెలల పాటు నిర్వహించనున్న విస్తృత అవగాహన కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) శ్రీ భుజంగరావు బుధవారం ప్రారంభించారు.నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని అదనపు కలెక్టర్‌ ఛాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి. రాజశ్రీతో కలిసి ఐఐఈసీ (Intensified Information, Education & Communication) కార్యక్రమాన్ని…

Read More