Breaking News

సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం – అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS

“PAUSE FOR SAFETY” – ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించండి నిర్మల్, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). అక్టోబర్ 2026ను జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంగా పాటిస్తున్న సందర్భంగా, సైబర్ నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రత్యేక పోస్టర్లను ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం (DPO), నిర్మల్‌లో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను…

Read Full News

ఉస్మానియా యూనివర్సిటీకి భారీగా తరలిన MSF విద్యార్థి నాయకులు

బాన్సువాడ, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి) మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “హాలో విద్యార్థి – చలో ఉస్మానియా యూనివర్సిటీ” కార్యక్రమానికి బాన్సువాడ నియోజకవర్గం నుంచి విద్యార్థి, యువ నాయకులు భారీగా తరలివెళ్లారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు, బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సోంపూర్ పోచిరాం మాదిగ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీకి బయలుదేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన ఆధారమని,…

Read Full News

సుధాకర్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలిబాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌ 6:(E6tv NEWS: ప్రతినిధి) భీంగల్‌లో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పొలాస సుధాకర్‌ పోలీసుల వేధింపులు తాళలేక పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని, చికిత్స పొందుతూ మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సుధాకర్‌ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన ఆరోపించారు.సుధాకర్‌ మృతదేహాన్ని…

Read Full News

కలెక్టర్ ఆదేశాలను పాటించని బోధన్ ఎంఈఓ?

విద్యార్థికి టీసీ, బోనఫైడ్ ఇప్పించాలని సబ్ కలెక్టర్‌కు వినతి బోధన్:, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతిలో చేరేందుకు ప్రయత్నిస్తున్న మైనార్టీ విద్యార్థికి టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్లు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న ఇక్రా మోడల్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎత్తోండ రాజేందర్ కోరారు.ఈ మేరకు సోమవారం బోధన్ సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థి శేక్ తాజ్రీమ్ ఆర్థిక…

Read Full News

23 అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట వస్తువులు, మ్యాట్ల పంపిణీ

రుద్రూర్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో రుద్రూర్ సెక్టార్ పరిధిలోని 23 అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట వస్తువులు, మ్యాట్లను పంపిణీ చేశారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆటల ద్వారా శారీరక, మానసిక వికాసం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ లయన్ వేమూరి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత, చంద్రశేఖర్…

Read Full News

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, ప్రతి జర్నలిస్టుకూ హెల్త్ కార్డులు ఇవ్వాలి అక్రిడిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి నిర్మల్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)  తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు తొగరి కరుణాకర్, జనరల్ సెక్రటరీ బత్తుల గణేష్, రాష్ట్ర నిర్వాహకురాలు బుంగ చాందిని ఆదేశాల మేరకు నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఎన్నిక జిల్లా అధ్యక్షుడిగా జి. చింతపండు…

Read Full News

నిర్మల్‌ ఐఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్‌ జి. రమేష్‌ బాధ్యతల స్వీకరణ

నూతన అధ్యక్షుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్‌ కత్తి నరేందర్‌ నిర్మల్‌, అక్టోబర్ 5: (E6tv NEWS: ప్రతినిధి). ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ జి. రమేష్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ నియోజకవర్గ చైర్మన్‌, కౌన్సిలర్‌ కత్తి నరేందర్ డాక్టర్‌ జి. రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.నిర్మల్‌ జిల్లాలో వైద్య సేవల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఐఎంఏ తరఫున మరింత…

Read Full News

నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీకి నూతన కార్యవర్గం

జిల్లాలో తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు.. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ఎన్నికల అధికారిగా జిల్లా కో-ఆపరేటివ్ అధికారి శ్రీనివాసరావు చైర్మన్‌గా పోతంకర్ లక్ష్మీనారాయణ.. వైస్ చైర్మన్‌గా ఈ.సీనా నాయక్ ట్రెజరర్‌గా కెంపుల నాగరాజు.. స్టేట్ MC సభ్యుడిగా అనిల్ కుమార్ నిజామాబాద్: అక్టోబర్ 5: (E6tv NEWS: శివ ఠాకూర్). ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖలో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. జిల్లా శాఖకు సంబంధించిన ఎన్నికల్లో పోలింగ్ నిర్వహించి నూతన కార్యవర్గాన్ని…

Read Full News

నేరెళ్ల బాధితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేస్తున్నాయి

ప్రతి బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం మూడు ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి: కల్వకుంట్ల కవిత హైదరాబాద్, అక్టోబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) నేరెళ్ల బాధితులకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు న్యాయం చేయడంలో విఫలమయ్యాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నేరెళ్ల బాధితుల అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్న నాయకులు, ఇప్పుడు వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. 2017లో నేరెళ్లలో జరిగిన ఘటన తెలంగాణ సమాజం తలదించుకునే ఘటన అని కవిత…

Read Full News

జీపీ రోడ్డు కబ్జాపై గ్రామస్తుల ఆగ్రహం

500 మంది సంతకాలు కావాలంటున్న గ్రామ కార్యదర్శి తీరుపై మండిపాటు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంలో ఇంత నిర్లక్ష్యమా? అక్బర్‌నగర్ గ్రామస్తుల ఆవేదన అక్బర్‌నగర్, అక్టోబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) గ్రామంలో అనేక సంవత్సరాలుగా ఉన్న గ్రామపంచాయతీ (జీపీ) రోడ్డును పరిరక్షించి, పంచాయతీ ఆధీనంలోకి తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. జీపీ రోడ్డుకు సంబంధించిన భూమి ప్రభుత్వ/గ్రామపంచాయతీకి చెందినదని, దీనిపై గతంలో గ్రామపంచాయతీ సమావేశాల్లో పలుమార్లు తీర్మానాలు కూడా చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.ఈ విషయంపై గ్రామస్తులు ఇప్పటికే…

Read Full News