డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్‌తో కలిసి కుటుంబ సభ్యులకు సానుభూతి
మద్నూర్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్ వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గురువారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
మద్నూర్ మండల కేంద్రంలోని ప్రజ్ఞ కుమార్ స్వగృహానికి వెళ్లిన ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రజ్ఞ కుమార్ మృతి పట్ల వారు విచారం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



