విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా మంత్రి సవిత ఘన నివాళులు
పెనుకొండ, సెప్టెంబర్ 17: (E6tv NEWS: ప్రతినిధి)
విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖల మంత్రి సవిత విశ్వకర్మ భగవానుడికి ఘన నివాళులు అర్పించారు. శిల్పులు, వృత్తి నిపుణులు, చేతివృత్తిదారులు, కార్మికులకు విశ్వకర్మ భగవానుడు ఆరాధ్య దైవమని ఆమె పేర్కొన్నారు.
విశ్వకర్మ భగవానుడి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం అభినందనీయమని మంత్రి తెలిపారు. విజయవాడలో రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విశ్వకర్మ భగవానుడి స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతివృత్తిదారులు, కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.గీత, వడ్డెర, చేనేత తదితర సంప్రదాయ వృత్తులపై ఆధారపడిన వారికి ఆర్థికంగా ప్రయోజనం కలిగేలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. లంకానగరం, ద్వారక, ఇంద్రప్రస్థం వంటి అద్భుత నగరాల నిర్మాణంతో విశ్వకర్మ భగవానుడు నిర్మాణ నైపుణ్యానికి ప్రతీకగా నిలిచారని అన్నారు.
ఆధునిక నగరాల నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశేష కృషి చేశారని, సైబరాబాద్‌తో పాటు అమరావతి నిర్మాణానికి కూడా ఆయన కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వృత్తిదారులు, కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, వృత్తిదారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.



