News
కాజీపేట ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై బీజేపీ నిరసన!
వరంగల్: కాజీపేట ఫాతిమానగర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో జరుగుతున్న విపరీతమైన ఆలస్యాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (BJP) నాయకులు మంగళవారం ఫ్లైఓవర్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రధాన అంశాలు:
కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణ ప్రాజెక్టులపై కీలక చర్చలు!
న్యూఢిల్లీ / హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ యానెక్స్‌లో కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతులపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. భేటీకి సంబంధించిన ముఖ్యాంశాలు:
మేనూర్‌లో రోడ్డు ఆక్రమణలు వెంటనే తొలగించాలి
ఆక్రమణల తొలగింపునకు నోటీసులు జారీ చేసిన గ్రామ పంచాయతీ మద్నూర్, ఆగస్టు 4: E6 tv NEWS (M. మస్నాజీ)కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో ప్రధాన రహదారిపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని గ్రామ పంచాయతీ అధికార యంత్రాంగం ఆదేశించింది. బస్టాండ్ నుంచి హనుమాన్ టెంపుల్ వరకు రహదారి ఇరుకుగా మారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్, పంచాయతీ కార్యదర్శి హరీష్ కుమార్ తెలిపారు. గ్రామంలోని ప్రధాన…
బస్ స్టాండ్‌ను ఆధునికీకరించాలి
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఇందూరు, ఆగస్టు 4: E6 tv NEWS ప్రతినిధి. నిజామాబాద్ నగర బస్ స్టాండ్‌ను ఆధునికీకరించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిజామాబాద్ నగరానికి నూతన బస్ స్టాండ్ నిర్మాణం…
వన్నెల్ బిలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
శిశువు పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలి.. ఆరు నెలల పాటు తల్లిపాలే ఉత్తమ ఆహారం: నిపుణులు బాల్కొండ, ఆగస్టు 4: E6 TV NEWS (తాటికొండ గంగాధర్)బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బక్కూరి వినోద ముఖ్య అతిథిగా హాజరై తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శిశువు జన్మించిన గంటలోపే ముర్రుపాలు పట్టించడం ఎంతో అవసరమని, తొలి…
ప్రజల కోసం పనిచేయాలి.. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకోవద్దు: ముత్యాల సునీల్ కుమార్
మెండోరలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిశీలన.. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఇంచార్జ్ విమర్శలు మెండోర, ఆగస్టు 4: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పదేపదే ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు.మంగళవారం మెండోర మండల కేంద్రంలోని రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని ఆయన పరిశీలించారు. ఈ…
రేవంత్ రెడ్డి ఒక ‘క్రిమినల్ వేస్ట్’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ కడిగిపారేత!
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలోని నిరుద్యోగ యువతను, ఇంజనీరింగ్ విద్యార్థులను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాష్ట్ర యువతకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప్రెస్ మీట్‌లో కేటీఆర్ వ్యాఖ్యలు:
జీజీహెచ్‌లో సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలి
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సమీక్షలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ విజ్ఞప్తి ఇందూరు, ఆగస్టు 4: E6 tv NEWS శివ ఠాకూర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ విస్తృతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రోజుకు 2…
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.1 లక్ష ఎల్‌ఓసీ అందజేత
అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్నకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బాల్కొండ, ఆగస్టు 3: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సాట్లపల్లి రాజన్న (తండ్రి: గంగారం) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సిందిగా సూచించడంతో కుటుంబ సభ్యులు వైద్య సహాయం కోసం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ను సంప్రదించారు.విషయాన్ని…
బాల్కొండ నియోజకవర్గ ఆరోగ్య రంగ అభివృద్ధికి 10 కీలక ప్రతిపాదనలు
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతి అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 3: E6 tv NEWS ప్రతినిధి. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన నిజామాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ ఆరోగ్య రంగ అభివృద్ధికి సంబంధించిన…

