News
బిచ్కుంద ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ స్థాయికి అభివృద్ధి చేయాలి
డాక్టర్లు, సిబ్బంది, ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని ప్రజల డిమాండ్ బిచ్కుంద, ఆగస్ట్ 4: (E6 tv NEWS, M. మస్నాజీ). కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని 30 పడకల బిచ్కుంద ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అన్ని రకాల వైద్య సేవలు అందించే ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది నియామకం, 24 గంటల వైద్య సేవల కల్పనపై పలు దశల్లో అధికారులకు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు.2026 జనవరి 19న…
జుక్కల్ కేజీబీవీలో విద్యార్థినులకు ప్లేట్లు, గ్లాసులు, చెంచాల పంపిణీ
బస్వాపూర్ (కామారెడ్డి జిల్లా): E6 tv NEWS. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) మరియు జూనియర్ కళాశాల విద్యార్థినులకు గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ ఆధ్వర్యంలో ప్లేట్లు, గ్లాసులు, చెంచాలను పంపిణీ చేశారు.విద్యార్థినుల రోజువారీ అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి అవసరమైన పాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమణ సురేష్ గొండ మాట్లాడుతూ విద్యార్థినులు చదువును భారంగా కాకుండా ఇష్టంగా…
టీజీఎన్-ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్‌లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం NATS 2.0 పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు 10, 2026 వరకు గడువు నిజామాబాద్, ఆగస్ట్ 4: E6 tv NEWS (శివ ఠాకూర్). తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎన్‌ఎస్-ఆర్టీఎస్) నిజామాబాద్ రీజియన్‌లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రీజినల్ మేనేజర్ ఎన్. విజయకృష్ణ మూర్తి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.రీజియన్ పరిధిలోని డీజీఎం (ఇంజినీరింగ్), కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్…
గ్రీన్‌వుడ్ స్కూల్‌లో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై పోలీసుల అవగాహన సదస్సు
విద్యార్థి దశ నుంచే సైబర్ భద్రతపై అవగాహన అవసరం: సీఐ చరమంద రాజు ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి బాధ్యతగల పౌరులుగా ఎదగాలని పిలుపు హుజూర్‌నగర్, ఆగస్టు 5: (E6 tv NEWS ప్రతినిధి)విద్యార్థి దశ నుంచే సాంకేతికత వినియోగంతో పాటు సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు అన్నారు. బుధవారం హుజూర్‌నగర్ పట్టణంలోని గ్రీన్‌వుడ్ స్కూల్‌లో సైబర్…
కట్న వేధింపుల కేసులో భర్తకు మూడేళ్ల జైలు శిక్ష
బోధన్ కోర్టు సంచలన తీర్పు సెక్షన్ 498(A) కింద దోషిగా నిర్ధారణ రూ.500 జరిమానాతో పాటు 3 ఏళ్ల సాధారణ కారాగార శిక్ ఏడపల్లి పోలీసుల దర్యాప్తుకు న్యాయస్థానం మద్దతు ఏడపల్లి, ఆగస్టు 5: (E6 tv NEWS, రవి నాయక్). కట్న వేధింపుల కేసులో బోధన్ గౌరవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ ఈ. సాయి శివ కీలక తీర్పు వెలువరించారు. వివాహ సమయంలో కట్నంగా నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నప్పటికీ, అనంతరం…
కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం రేవంత్ భేటీ.. తుమ్మిడిహెట్టి బ్యారేజీ వివాదంపై కేంద్రం జోక్యం డిమాండ్!
న్యూఢిల్లీ / హైదరాబాద్ : మహారాష్ట్ర సరిహద్దులోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై నిర్మించతలపెట్టిన బ్యారేజీ ఎత్తు వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. బుధవారం ఢిల్లీలోని శ్రమ్‌శక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌తో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కాంగ్రెస్…
బంకీపూర్ ఉపఎన్నిక ఫలితంపై బీజేపీ విమర్శలు.. కాంగ్రెస్‌పై ఎన్‌వీ సుభాష్ ఘాటు వ్యాఖ్యలు!
హైదరాబాద్ : బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడంపై తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ బుధవారం స్పందించారు. ప్రజల తీర్పును బీజేపీ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని పేర్కొన్న ఆయన, బీజేపీ ఓటమిని చూసి సంబరాలు చేసుకునే నైతిక హక్కు ‘ఇండియా’ (INDIA) కూటమికి లేదని మండిపడ్డారు. ప్రజా తీర్పును గౌరవిస్తాం: ఎన్‌వీ సుభాష్ ANIతో మాట్లాడిన ఎన్‌వీ సుభాష్.. “బంకీపూర్ ఉపఎన్నికలో జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ 19,324…
జూలై గౌరవ వేతనాలు తక్షణమే విడుదల చేయాలి: తెలంగాణ ఆశా కార్యకర్తల డిమాండ్!
హైదరాబాద్ : తెలంగాణలో 28,000 మందికి పైగా ఉన్న అక్రిడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ASHA) వర్కర్లు తమకు రావాల్సిన జూలై నెల గౌరవ వేతనాలను వెంటనే ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 3నే నిధులు విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, జిల్లాల్లోని మెజారిటీ ఆశా కార్యకర్తల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య మంత్రికి వినతిపత్రం సిఐటియు (CITU) అనుబంధ…
ఏర్గట్ల మండలంలో అక్రమ ఇసుక బహిరంగ వేలం
ఆగస్టు 7న తహసీల్దార్ కార్యాలయంలో వేలం నిర్వహణ బట్టాపూర్‌లో స్వాధీనం చేసుకున్న 40 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక వేలానికి సిద్ధం ట్రిప్పుకు కనీస ధర రూ.2,000గా నిర్ణయం వేలంలో పాల్గొనాలంటే రూ.10,000 ధరావత్తు తప్పనిసరి వేలానికి ముందు ఇసుక నిల్వలను పరిశీలించే అవకాశం ఆసక్తి గల వారు ఆగస్టు 7 ఉదయం 11:30 గంటలకు తహసీల్దార్ కార్యాలయానికి హాజరు కావాలని సూచన ఏర్గట్ల, ఆగస్టు 5 (E6 tv న్యూస్ ప్రతినిధి).ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో ఇటీవల…
యాదగిరిగుట్టలో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (TGSPF) మాక్ డ్రిల్!
యాదాద్రి భువనగిరి / హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (TGSPF) మంగళవారం ఉగ్రవాద నిరోధక మాక్ డ్రిల్ (Anti-terror mock drill) నిర్వహించింది. ప్రధాన అంశాలు:

